Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/england-cricketer-johnson-roy-interesting-comments-bd35d050-b50c-4f48-999a-280dd4bf2e84-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/england-cricketer-johnson-roy-interesting-comments-bd35d050-b50c-4f48-999a-280dd4bf2e84-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో అటు దేశీయ లీగ్ల హవా ఎక్కువగా కొనసాగుతూ ఉంది. అటు ప్లేయర్లు కూడా ఈ దేశీయ లీగ్ల కారణంగా ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు అని చెప్పాలి. దేశం తరఫున ఆడిన సమయంలో అందుకున్న వేతనం కంటే ఇక ఆయా దేశీయ లీగ్ లలోనే ఎక్కువ వేతనం అందుకుంటూ ఉండటంతో కొంతమంది ప్లేయర్లు అంతర్జాతీయ క్రికెట్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడం కంటే.. ఇక దేశీయ లీగ్ లో ఆడటమే ముఖ్యం అన్న విధంగా వ్యవహరిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. లేదంటే ఏదో ఒక ఫార్మాట్ కి మాత్రమే పరిమితమై మిగతా ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించడం లాంటివిCricket {#}England;Cheque;Cricket;INTERNATIONAL;Newsఆ వార్తల్లో నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన ఇంగ్లాండ్ క్రికెటర్?ఆ వార్తల్లో నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన ఇంగ్లాండ్ క్రికెటర్?Cricket {#}England;Cheque;Cricket;INTERNATIONAL;NewsFri, 26 May 2023 13:30:00 GMTఇటీవల కాలంలో అటు దేశీయ లీగ్ల హవా ఎక్కువగా కొనసాగుతూ ఉంది. అటు ప్లేయర్లు కూడా ఈ దేశీయ లీగ్ల కారణంగా ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు అని చెప్పాలి. దేశం తరఫున ఆడిన సమయంలో అందుకున్న వేతనం కంటే ఇక ఆయా దేశీయ లీగ్ లలోనే ఎక్కువ వేతనం అందుకుంటూ ఉండటంతో కొంతమంది ప్లేయర్లు అంతర్జాతీయ క్రికెట్లో దేశం తరఫున ప్రాతినిధ్యం  వహించడం కంటే.. ఇక దేశీయ లీగ్ లో ఆడటమే ముఖ్యం అన్న విధంగా వ్యవహరిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.


 లేదంటే ఏదో ఒక ఫార్మాట్ కి మాత్రమే పరిమితమై మిగతా ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించడం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు. ఇక ఇలా చేసి కొన్ని కొన్ని సార్లు విమర్శలు ఎదుర్కొంటున్నారు క్రికెటర్లు. అయితే ఇటీవల ఇంగ్లాండు క్రికెటర్ జాసన్ రాయ్ విషయంలో కూడా ఇలాంటి వార్తలు ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయాయి. జాసన్ రాయ్ ఏకంగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కాంట్రాక్టు రద్దు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే మేజర్ లీగ్ క్రికెట్లో పాల్గొనాలి అనే ఉద్దేశంతోనే ఇలా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కాంట్రాక్టును రద్దు చేసుకుంటున్నట్లు వార్తల్లో సారాంశం ఉంది. ఈ క్రమంలోనే అతనిపై విమర్శలు కూడా వచ్చాయి.


 అయితే ఈ విషయంపై స్వయంగా ఇంగ్లాండ్ క్రికెటర్ జాసన్ రాయ్ స్పందించాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు గర్వకారణంగా ఉంటుంది. నా మొదటి ప్రాధాన్యత కూడా అదే అంటూ వార్తలకు చెక్ పెట్టాడు జాసన్ రాయ్. అయితే మేజర్ లీగ్ క్రికెట్ లో పాల్గొనడం గురించి ఇంగ్లాండు క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సెంట్రల్ కాంట్రాక్ట్ లేని సింగిల్ ఫార్మాట్ ప్లేయర్గా కొనసాగుతున్న తాను.. ఇక లీగ్ మ్యాచ్లలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాను అంటూ జాసన్ రాయ్ చెప్పుకొచ్చాడు. కాగా జాసన్ రాయ్ ఐపీఎల్ లో కూడా ఫ్రాంచైజీల  తరఫున ఆడాడు.



RRR Telugu Movie Review Rating

ప్రభాస్ డార్లింగ్ సినిమా కోసం ముందు ఆ స్టార్ హీరోని అనుకున్నారా..!?

అమెరికాను దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రష్యా

జగన్‌ ప్రభంజనం సృష్టించిన ఆ క్షణాలు?

మనం గర్వించే.. ఇండియా గురించి షాకింగ్‌ వాస్తవాలు?

అగ్ర రాజ్యాలకు మోడీ ఘాటు వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>