BusinessPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/hyderabad--rtcae2ebfa7-6dd2-4e0e-a4f3-5a985c4fa64d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/hyderabad--rtcae2ebfa7-6dd2-4e0e-a4f3-5a985c4fa64d-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ సిటీ బస్‌ ప్రయాణికులకు ఆర్టీసీ సూపరాఫర్‌ ని తీసుకొచ్చింది. 'రూట్ పాస్' పేరుతో మొదటిసారిగా కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది.ఇక గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థం మొదటిసారిగా 'జనరల్ రూట్ పాస్'కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) శ్రీకారం చుట్టింది.టి-24, టి-6 ఇంకా ఎఫ్-24 టికెట్లతో ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను కల్పిస్తోన్న సంస్థ.. తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం ఈ రూట్ పాస్ కు రూపకల్పనని చేసింది. 8 కిలోమీటర్ల పరిధిలో రాకపోకలకు వర్తించే ఈ పాస్ ఈ HYDERABAD - RTC{#}RTC;Press;Telangana;Chiranjeevi;Hyderabadహైదరాబాద్: ప్రయాణికులకు ఆర్టీసీ సూపరాఫర్‌?హైదరాబాద్: ప్రయాణికులకు ఆర్టీసీ సూపరాఫర్‌?HYDERABAD - RTC{#}RTC;Press;Telangana;Chiranjeevi;HyderabadThu, 25 May 2023 20:11:57 GMTహైదరాబాద్ సిటీ బస్‌ ప్రయాణికులకు ఆర్టీసీ సూపరాఫర్‌ ని తీసుకొచ్చింది. 'రూట్ పాస్' పేరుతో మొదటిసారిగా కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది.ఇక గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థం మొదటిసారిగా 'జనరల్ రూట్ పాస్'కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) శ్రీకారం చుట్టింది.టి-24, టి-6 ఇంకా ఎఫ్-24 టికెట్లతో ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను కల్పిస్తోన్న సంస్థ.. తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం ఈ రూట్ పాస్ కు రూపకల్పనని చేసింది. 8 కిలోమీటర్ల పరిధిలో రాకపోకలకు వర్తించే ఈ పాస్ ఈ నెల 27 వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది.మొత్తం ఒక నెల రోజుల పాటు వర్తించే సిటీ ఆర్డీనరీ రూట్ బస్ పాస్ కు రూ. 600గా ఇంకా మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్ కు రూ. 1000గా ధరను టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.ఇంకా ఈ ధరతో పాటు ఐడీ కార్డుకు రూ.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.


ముందుగా హైదరాబాద్ లోని 162 రూట్లలో ఈ పాస్ ను ప్రయాణికులకు ఇవ్వనుంది. ఈ రూట్ పాస్ దారులు 8 కిలోమీటర్ల రేంజ్ లో అన్ లిమిటెడ్ గా ఎన్నిసార్లైన బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటును సంస్థ కల్పించింది. సెలువు దినాలతో పాటు ఆదివారాల్లో కూడా ఈ పాస్ తో ప్రయాణించవచ్చు.హైదరాబాద్ లో ప్రయాణికులకు జనరల్ బస్ టికెట్ అనేది అందుబాటులో ఉంది. ఆర్డినరీ బస్ పాస్ కు రూ.1150 ఇంకా మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్ కు రూ.1300గా ధర ఉంది. ఈ పాస్ దారులు సిటీ సబర్బన్ రేంజిలో తిరిగే అన్ని బస్సుల్లో కూడా ఎక్కడినుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. అలాగే సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు మాత్రమే ఈ పాస్ లను కొనుగోలు చేస్తున్నారని సంస్థ చేసిన సర్వేలో వెల్లడయింది. ఇక తక్కువ దూరం వెళ్లే ఉద్యోగులు, చిరు వ్యాపారులు బస్సుల్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారని తేలింది.తక్కువ దూరం ప్రయాణించే వారికి దగ్గర కావడం కోసమే జనరల్ రూట్ పాస్ ను టీఎస్ఆర్టీసీ రూపొందించింది.



RRR Telugu Movie Review Rating

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ షెడ్యూల్ ఇదే?

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>