MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-trivikram-samyuktha-menon3c22c0fc-7063-4a8d-b30e-00033c77f720-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-trivikram-samyuktha-menon3c22c0fc-7063-4a8d-b30e-00033c77f720-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరుపొందారు.. పుష్ప చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. ముఖ్యంగా ఇందులో అల్లు అర్జున్ పాత్ర మేకోవర్ యాటిట్యూడ్ అందరిని ఆకట్టుకునేలా చేశాయి. బన్నీ రేంజ్ను అమాంతం పెంచేసిన సినిమాగా పేరుపొందింది. ఇందులో రష్మిక, సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ తదితరులు సైతం కీలకపాత్రలో నటించారు. ఈ చిత్రంలో సమంత స్పెషల్ సాంగ్లో నటించి మరింత హైలెట్గా నిలిచింది. ప్రస్తుతం పుష్ప-2ALLU ARJUN;TRIVIKRAM;SAMYUKTHA MENON{#}geetha;sithara;Allu Arjun;Samantha;Prabhas;Reddy;India;sandeep;Director;Cinema;Heroine;Newsఅల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ అతనేనా..?అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ అతనేనా..?ALLU ARJUN;TRIVIKRAM;SAMYUKTHA MENON{#}geetha;sithara;Allu Arjun;Samantha;Prabhas;Reddy;India;sandeep;Director;Cinema;Heroine;NewsThu, 25 May 2023 07:30:00 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరుపొందారు.. పుష్ప చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. ముఖ్యంగా ఇందులో అల్లు అర్జున్ పాత్ర మేకోవర్ యాటిట్యూడ్ అందరిని ఆకట్టుకునేలా చేశాయి. బన్నీ రేంజ్ను అమాంతం పెంచేసిన సినిమాగా పేరుపొందింది. ఇందులో రష్మిక, సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ తదితరులు సైతం కీలకపాత్రలో నటించారు. ఈ చిత్రంలో సమంత స్పెషల్ సాంగ్లో నటించి మరింత హైలెట్గా నిలిచింది.


ప్రస్తుతం పుష్ప-2 సినిమా  తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా మొదటి భాగాని కంటే మరింత అద్భుతంగా తెరకెక్కించాలని డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ ఈ సినిమా హైపును భారీగా పెంచేసింది. ఈ సినిమా షూటింగ్ ఒకవైపు జరుగుతూ ఉండగానే మరొకవైపు అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా పైన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికి తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా కాస్త ఆలస్యంగా మొదలు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఇందుకు కారణం ప్రస్తుతం సందీప్ వంగ బాలీవుడ్లో యానిమల్ అనే సినిమా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో కలిసి స్పిరిట్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు చిత్రాల తర్వాతే అల్లు అర్జున్ సందీప్ వంగ కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్లు సమాచారం. అయితే ఏమాత్రం సమయాన్ని వృధా చేయకుండా అల్లు అర్జున్ మరొక సినిమాని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తన తదుపరిచిత్రాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గీత ఆర్ట్స్ సితార ఎంటర్టైన్మెంట్ లో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ గా సంయుక్త నటిస్తున్నట్లు సమాచారం.



RRR Telugu Movie Review Rating

అమరావతి : కలవకముందే ప్రతిపక్షాల్లో కుమ్ములాటలా ?

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>