Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-b1b5089e-9f1d-474c-987a-cc8f31665a56-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-b1b5089e-9f1d-474c-987a-cc8f31665a56-415x250-IndiaHerald.jpgగ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ స్థాయిలో సత్తా చాటుతోంది. హిందీ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ బ్యూటీ అక్కడ అగ్ర హీరోలందరితో ఆడిపాడింది. క్రిష్, తుఫాన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక హాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన ఈ భామ తాజాగా సిటాడెల్ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీసులోని ఫైనల్ ఎపిసోడ్ మే 26న విడుదలకు సిద్దంగా ఉంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక చోప్రా ఒక దర్శకుడిపై సంచలన కామెంట్స్ చేసింది. అంగీకారం కోసం: బాలీవుడSocialstars lifestyle {#}Fashion;priyanka;Love Story;Episode;bhama;Hollywood;Hindi;television;bollywood;BEAUTY;Pawan Kalyan;Tamil;Telugu;Audience;Director;Heroine;Cinemaఆ డైరెక్టర్ నన్ను అది తీసి చూపించమన్నాడు :: ప్రియాంక చోప్రాఆ డైరెక్టర్ నన్ను అది తీసి చూపించమన్నాడు :: ప్రియాంక చోప్రాSocialstars lifestyle {#}Fashion;priyanka;Love Story;Episode;bhama;Hollywood;Hindi;television;bollywood;BEAUTY;Pawan Kalyan;Tamil;Telugu;Audience;Director;Heroine;CinemaWed, 24 May 2023 23:39:20 GMTగ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ స్థాయిలో సత్తా చాటుతోంది. హిందీ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ బ్యూటీ అక్కడ అగ్ర హీరోలందరితో ఆడిపాడింది. క్రిష్, తుఫాన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

ఇక హాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన ఈ భామ తాజాగా సిటాడెల్ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీసులోని ఫైనల్ ఎపిసోడ్ మే 26న విడుదలకు సిద్దంగా ఉంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక చోప్రా ఒక దర్శకుడిపై సంచలన కామెంట్స్ చేసింది.
అంగీకారం కోసం: బాలీవుడ్, హాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న స్టన్నింగ్ బ్యూటి ప్రియాంక చోప్రా 1982 జూలై 18న జంషెడ్ పూర్ లో జన్మించింది. మోడలింగ్ రంగంలో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ సుందరి 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమెతో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు ఆమె అంగీకారం కోసం క్యూ కట్టారు.

హిందీ సినిమాలతో: మోస్ట్ గ్లామరస్ బ్యూటి ప్రియాంక చోప్రా 2002లో తమిజాన్ అనే తమిళ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం 2003లో 'ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై' సినిమాతో హిందీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమాలో మంచి నటన కనబర్చిన ముద్దుగుమ్మకు ప్రశంసలు దక్కాయి. తర్వాత క్రిష్, డాన్, ఫ్యాషన్ వంటి సినిమాలతో హిందీలో తెగ పాపులర్ అయింది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ.

రామ్ చరణ్ తో: అంతేకాకుండా ఫ్యాషన్ సినిమాకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ సైతం అందుకుంది గ్లామరస్ బ్యూటి ప్రియాంక చోప్రా. హిందీలోనే కాకుండా తెలుగు సినిమాల్లో కూడా నటించింది ఈ సుందరి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి జంజీర్ తెలుగులో తుఫాన్ సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీని తర్వాత తెలుగులో ప్రియాంకకు అవకాశాలు రాలేదు.
వరుసగా ఇంగ్లీష్ చిత్రాలు: హిందీలో స్టార్ హీరోయిన్ రేంజ్ లో కొనసాగుతున్న ప్రియాంక చోప్రాకు హాలీవుడ్ నుంచి ఆఫర్లు రావడం మొదలైంది. ఈ క్రమంలోనే 2015లో క్వాంటికో అనే టీవీ సిరీసుతో హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కాలు మోపింది ఈ భామ.అనంతరం, బేవాచ్, ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్ వంటి హాలీవుడ్ చిత్రాలు చేసింది. అలాగే హిందీలో ది వైట్ టైగర్ మూవీ చేసింది. ప్రస్తుతం సిటాడెల్ అనే వెబ్ సిరీసుతో ప్రేక్షకులను అలరిస్తోంది ప్రియాంక చోప్రా.

 అండర్ వేర్ చూడాలని: అయితే బాలీవుడ్ లో తాను ఎదుర్కొన్న సమస్యల గురించి షాకింగ్ విషయాలు తెలిపింది ప్రియాంక చోప్రా. "అప్పుడే బాలీవుడ్ లోకి అడుగుపెట్టాను. నేను ఒక సినిమా ఒప్పుకున్నాను. అందులో నేను అండర్ కవర్ ఏజెంట్.

వ్యక్తిని ట్రాప్ చేయడానికి డ్యాన్స్ లో భాగంగా నా ఒంటిపై దుస్తులు తీసేయమని డైరెక్టర్ చెప్పాడు. నా అండర్ వేర్ చూడాలనుకుంటున్నట్లు స్టైలిష్ తో చెప్పించాడు. అలా అయితేనే ప్రేక్షకులు సినిమా చూస్తారని చెప్పడంతో షాక్ అయ్యా" అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది.

అదే పెద్ద తప్పు: "షూటింగ్ సెట్ లో అలా నా అండర్ వేర్ తొలగించమని డైరెక్టర్ చెప్పడంతో నాకు చాలా కోపం వచ్చింది. కానీ నేను ఏం అనలేకపోయాను. కానీ అందుకు ఒప్పుకోలేదు. ఆ మరుసటి రోజే నేను ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాను. ఇది నిజంగా షాక్.

ఆరోజు నేను అలాంటి సంఘటన చూశానా అని ఇప్పటికీ అనిపిస్తుంది. మీరు చెప్పేది తప్పు అని గట్టిగా వారికి చెప్పాలి. ఆ క్షణంలో భయపడి మౌనంగా వెళ్లిపోయాను. అదే నేను చేసిన పెద్ద తప్పు" అని ప్రియాంక వెల్లడించింది. అయితే ఆ డైరెక్టర్ పేరు మాత్రం చెప్పలేదు ప్రియాంక చోప్రా.



RRR Telugu Movie Review Rating

ఆ ప్రొడ్యూసర్ కి అమ్మాయిల పిచ్చి :: సంగీత ఒడ్వానీ

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>