Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-2bb34f6e-1962-40be-9734-8d71182d6db6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-2bb34f6e-1962-40be-9734-8d71182d6db6-415x250-IndiaHerald.jpgదేశంలో మహిళలు పనులు చేసే ప్రతి చోట క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఉన్నాయని పలువురు మహిళలు ఆవేదనలు వ్యక్తం చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు తీవ్రంగా ఉంటాయని ఎంతోమంది హీరోయిన్స్ బహిరంగంగానే వెల్లడించారు. దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కామాంధులు మహిళలపై లైంగిక దాడులకు తెగబడుతున్నారు. ఈ లైంగిక వేధింపులు సామాన్య మహిళలకే కాదు.. సెలబ్రెటీలకు కూడా తప్పలేదు. దేశంలో పలు చోట్ల మహిళలు క్యSocialstars lifestyle {#}chinna;bollywood;producer;Producer;Heroine;Cinemaఆ ప్రొడ్యూసర్ కి అమ్మాయిల పిచ్చి :: సంగీత ఒడ్వానీఆ ప్రొడ్యూసర్ కి అమ్మాయిల పిచ్చి :: సంగీత ఒడ్వానీSocialstars lifestyle {#}chinna;bollywood;producer;Producer;Heroine;CinemaWed, 24 May 2023 23:54:38 GMTదేశంలో మహిళలు పనులు చేసే ప్రతి చోట క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఉన్నాయని పలువురు మహిళలు ఆవేదనలు వ్యక్తం చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు తీవ్రంగా ఉంటాయని ఎంతోమంది హీరోయిన్స్ బహిరంగంగానే వెల్లడించారు.

దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కామాంధులు మహిళలపై లైంగిక దాడులకు తెగబడుతున్నారు. ఈ లైంగిక వేధింపులు సామాన్య మహిళలకే కాదు.. సెలబ్రెటీలకు కూడా తప్పలేదు. దేశంలో పలు చోట్ల మహిళలు క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ కేసులు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇటీవల పలువురు హీరోయిన్స్ గతంలో తమకు ఎదురైన చేదు అనుభవాట గురించి వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు కొంతమంది క్యాస్టింగ్ కౌచ్ పై పోరాటాలు కూడా చేస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ గతంలో తనపై లైంగిక వేధింపులు జరిగాయని సంచలన వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే..

గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ పై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఇండస్ట్రీలో రాణించాలంటే.. కొంతమందికి పడక సుఖం ఇవ్వాల్సిందే అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నటీమణులు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తమపై జరిగిన లైంగిక వేదింపుల గురించి ప్రస్తుతం బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. ఈ సమస్య ఇప్పటిది కాదని.. దశాబ్దాల కాలం నుంచి ఎంతోమంది వేధింపులకు గురి అయ్యారని వాపోతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి ‘శబ్ మంగళ్ మే దంగల్’ మూవీ ఫేం సంగీతా ఒడ్వాని గతంలో తాను ఇండస్ట్రీలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. వివరాల్లోకి వెళితే..

‘నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్, ఇతర క్యారెక్టర్స్ లో నటించేవారు ఖచ్చితంగా క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదుర్కోని ఉండేఉంటారు. చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనేది పచ్చినిజం.. గతంలో నాకు ఈ చేదు అనుభవాలు చాలా అయ్యాయి. ఓ స్టార్ ప్రొడ్యూసర్ సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానని.. నన్ను తన ఇంటికి ఒంటరిగా రమ్మని అడిగాడు. అతని ఆంతర్యం ఏంటో నాకు అర్ధం అయింది.. అందుకే నా స్నేహితులను తీసుకొని ఆయన ఇంటికి వెళ్లాను. అందరినీ చూసి తన ప్లాన్ బెడిసి కొట్టిందని గ్రహించిన ఆ నిర్మాత తనకు వేరే పని పడిందని.. తర్వాత కలుద్దామని వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా నన్ను అలాగే పలుమార్లు ఒంటరిగా కలమని అడిగాడు.. కానీ అతన్ని దూరం పెట్టాను. ఆ ప్రొడ్యూసర్ కి అమ్మాయిల పిచ్చి ఎక్కువ.. వాళ్ల బలహినతలు అడ్డు పెట్టుకొని లైంగికంగా వేధిస్తు.. కోరిక తీర్చుకుంటాడు’ అంటూ సంచలన ఆరోపణలు చేసింది.



RRR Telugu Movie Review Rating

ఆ ప్రొడ్యూసర్ కి అమ్మాయిల పిచ్చి :: సంగీత ఒడ్వానీ

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>