Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/accident-5d908e4a-b28c-42e9-b5e1-9b899830fc6b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/accident-5d908e4a-b28c-42e9-b5e1-9b899830fc6b-415x250-IndiaHerald.jpgనేటి రోజుల్లో మనిషి పూర్తిగా స్వార్థపరుడిగా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. నేను నా ఫ్యామిలీ బాగుంటే చాలు ఎవరు ఎటు పోతే నాకెందుకు అనే విధంగానే స్వార్థంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి స్వార్థపూరితమైన గుణంతోనే ఎదుటివారిని మోసం చేసేందుకు కూడా వెనకడుగు వేయడం లేదు. అదే సమయంలో ఇక ఎవరైనా సాటి మనుషులు ప్రమాదంలో ఉన్నారు అంటే చాలు సహాయం చేయడానికి కూడా ముందడుగు వేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. ఇలాంటి స్వార్థపూరిత సమాజంలో కూడా ఇంకా అక్కడక్కడ మానవత్వం బ్రతికే ఉంది అని నిరూపించే ఘటనలు Accident {#}Yevaruసాయం చేయాలనే గుణమే.. చివరికి అతని ప్రాణం తీసింది?సాయం చేయాలనే గుణమే.. చివరికి అతని ప్రాణం తీసింది?Accident {#}YevaruWed, 24 May 2023 14:30:00 GMTనేటి రోజుల్లో మనిషి పూర్తిగా స్వార్థపరుడిగా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. నేను నా ఫ్యామిలీ బాగుంటే చాలు ఎవరు ఎటు పోతే నాకెందుకు అనే విధంగానే స్వార్థంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి స్వార్థపూరితమైన గుణంతోనే ఎదుటివారిని మోసం చేసేందుకు కూడా వెనకడుగు వేయడం లేదు. అదే సమయంలో ఇక ఎవరైనా సాటి మనుషులు ప్రమాదంలో ఉన్నారు అంటే చాలు సహాయం చేయడానికి కూడా ముందడుగు వేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. ఇలాంటి స్వార్థపూరిత సమాజంలో కూడా ఇంకా అక్కడక్కడ మానవత్వం బ్రతికే ఉంది అని నిరూపించే ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి.


 ఏకంగా సాటి మనుషులు ప్రమాదంలో ఉన్నప్పుడు చేయి అందించే మానవత్వం కలిగిన మనుషులు కూడా ఉన్నారు అని ఆ ఘటనలు నిరూపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం అంతకుమించి గొప్పగా మానవత్వాన్ని చాటుకున్నాడు. సాటి మనుషులకు సహాయం చేయడం కాదు.. ఏకంగా పక్షులకు సహాయం చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ అతని సహాయం చేసే గుణమే చివరికి అతని ప్రాణాలు పోయే పరిస్థితిని తీసుకువచ్చింది. రోడ్డు దాటుతున్న పక్షులకు సహాయం చేయబోయిన అతను రోడ్డు ప్రమాదం బారిన పడి చనిపోయాడు.



 ఈ విషాదకర ఘటన యూఎస్ లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. కాలిఫోర్నియాలో  41 ఏళ్ల వ్యక్తి రోడ్డు దాటేందుకు ఇబ్బంది పడుతున్న బాతుల గుంపును చూసి వాటికి సహాయం చేయడానికి వెళ్ళాడు. ఈ క్రమంలోనే 17 ఏళ్ల యువతి అదే రోడ్డుపై వేగంగా కారులో దూసుకు వచ్చి అతన్ని ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలైన సదరు వ్యక్తి  అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు అని చెప్పాలి. ఇక ఈ విషయం గురించి తెలిసి మంచి వాళ్లను దేవుడు తొందరగా తీసుకుపోతూ ఉంటాడు అని అంటూ ఉంటారు.. బహుశా అది నిజమేనేమో అని ఈ ఘటన గురించి తెలిసిన తర్వాత నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

విష్ణు ప్రియ ని దారుణంగా అవమానించిన బలంగం వేణు..!?

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?

రేవంత్‌ రెడ్డి కోసం ఆ ఎల్లో మీడియా పని చేస్తోందా?

భారత్‌పై కుట్ర.. బయటపెట్టిన పాక్‌ యూట్యూబర్‌?

జగన్‌పై దూకుడు పెంచిన పవన్‌ కల్యాణ్‌?

కళకళలాడుతున్న కేసీఆర్‌ గల్లా పెట్టె?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>