PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/avinash-viveka-yellow-mediaacb77e91-7bed-4ab2-bfa8-c3e124f29f66-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/avinash-viveka-yellow-mediaacb77e91-7bed-4ab2-bfa8-c3e124f29f66-415x250-IndiaHerald.jpgఅయితే ఎల్లోమీడియా చెప్పినట్లుగా ఎంపీ అనుచరులు మీడియా ప్రతినిధుల మీద దాడులు చేయలేదు. కేవలం ఎల్లోమీడియా ప్రతినిధుల గురించి మాత్రమే వాకాబుచేశారు. ఎల్లోమీడియా ప్రతినిధులను అక్కడినుండి వెళ్ళిపొమన్నారట. విషయం ఏమిటంటే ఎంపీ తల్లి లక్ష్మమ్మ కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. అందుకనే రెండురోజులుగా అవినాష్ కూడా అక్కడే ఉంటున్నారు. ఒకవైపు సీబీఐ విచారణకు రావాలని ఎంపీకి నోటీసులిస్తోంది. తన తల్లి ఆసుపత్రిలో ఉన్నారు కాబట్టి విచారణకు రాలేనని అవినాష్ సీబీఐకి లేఖలు రాస్తున్నారు. avinash viveka yellow media{#}Kurnool;sunday;Y S Vivekananda Reddy;Letter;television;kadapa;MP;devineni avinash;CBI;Hyderabad;media;Newsరాయలసీమ : ఎంపీ విషయంలో ఎల్లోమీడియా ఓవరాక్షన్ చేస్తోందా ?రాయలసీమ : ఎంపీ విషయంలో ఎల్లోమీడియా ఓవరాక్షన్ చేస్తోందా ?avinash viveka yellow media{#}Kurnool;sunday;Y S Vivekananda Reddy;Letter;television;kadapa;MP;devineni avinash;CBI;Hyderabad;media;NewsWed, 24 May 2023 09:00:00 GMT


కర్నూలులో ఆదివారం రాత్రి మీడియా మీద కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు దాడులు చేశారంటు ఎల్లోమీడియా ఒకటే గోలచేస్తోంది.  మీడియా ప్రతినిదులను వెదికి వెదికి మరీ దాడులు చేశారని, కెమెరాలు లాక్కుని పగలగొట్టేశారంటు రచ్చచేస్తోంది. రిపోర్టలను తరిమికొట్టారంటు మొదటిపేజీల్లో వార్తలు రాసుకున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మీడియా అనేది చాలా విస్తృతమైన పదం. మీడియా అంటే అన్నీ దినపత్రికలు, టీవీ ఛానళ్ళు వస్తాయి.





అయితే ఎల్లోమీడియా చెప్పినట్లుగా ఎంపీ అనుచరులు మీడియా ప్రతినిధుల మీద దాడులు చేయలేదు. కేవలం ఎల్లోమీడియా ప్రతినిధుల గురించి మాత్రమే వాకాబుచేశారు. ఎల్లోమీడియా ప్రతినిధులను అక్కడినుండి వెళ్ళిపొమన్నారట. విషయం ఏమిటంటే ఎంపీ తల్లి లక్ష్మమ్మ కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. అందుకనే రెండురోజులుగా అవినాష్ కూడా అక్కడే ఉంటున్నారు. ఒకవైపు సీబీఐ విచారణకు రావాలని ఎంపీకి నోటీసులిస్తోంది. తన తల్లి ఆసుపత్రిలో ఉన్నారు కాబట్టి విచారణకు రాలేనని అవినాష్ సీబీఐకి లేఖలు రాస్తున్నారు.





విచారణకు హాజరవ్వటం హాజరుకాకపోవటమన్నది ఎంపీ-సీబీఐ మధ్యవ్యవహారం. హాజరుకాకపోతే ఎంపీని సీబీఐ ఏమిచేస్తుందనేది దర్యాప్తుసంస్ధ నిర్ణయం. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే ఎలాగైనా ఎంపీని అరెస్టుచేయించాలన్నది ఎల్లోమీడియా పట్టుదల. విచారణకు హాజరుకాకపోయినా ఎంపీమీద  సీబీఐ ఎందుకు యాక్షన్ తీసుకోవటంలేదని పదే పదే వార్తలు, కథనాలు రాస్తోంది. ఎంపీని అరెస్టుచేసేట్లుగా సీబీఐ మీద ఎల్లోమీడియా ఒత్తిడితెస్తోంది. వివేకానందరెడ్డి హత్యకేసును సీబీఐతో పాటు ఎల్లోమీడియా కూడా ప్యారలల్ గా దర్యాప్తు చేసేస్తోంది. దర్యాప్తుచేయటమే కాకుండా ఎంపీనే సూత్రదారుడని తీర్మానించేసింది. శిక్ష వేయటం ఒకటే చేయలేదు.





ఈ నేపధ్యంలోనే ఎంపీని పులివెందుల, కడప, హైదరాబాద్ లో ఎక్కడబడితే అక్కడ వెంటాడుతోంది. ఈ పద్దతిలోనే కర్నూలు ఆసుపత్రి దగ్గర కూడా వెంటాడింది. నిజానికి ఇదంతా ఎల్లోమీడియాకు అవసరంలేనిదే. ఎంపీ వ్యక్తిగత జీవితంలో కూడా కెమెరాలు పట్టుకుని దూరేసింది. అవినాష్ కే కాదు ఎవరికైనా ఎల్లోమీడియా ఓవరాక్షన్ తో  మండిపోతుంది. ఎంపీని సీబీఐ అరెస్టుచేస్తే అరెస్టుచేసినట్లు రాసుకోవాలి లేకపోతే లేదు. అంతే కానీ ఈరోజు అరెస్టు చేస్తుంది..ఇంకాసేపట్లో అరెస్టుచేస్తుందంటు బ్రేకింగ్ న్యూస్ పేరుతో న్యూసెన్స్ చేయాల్సిన అవసరంలేదు. అలాచేస్తోంది కాబట్టే ఎంపీ మద్దతుదారులకు కూడా మండుంటుంది. అందుకనే ఆసుపత్రి దగ్గర నుండి తరిమేశారు.






RRR Telugu Movie Review Rating

రామ్ చరణ్- ఆలియా భట్ ను కాదని మరో బ్రాండ్ కు రష్మిక..!!

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?

రేవంత్‌ రెడ్డి కోసం ఆ ఎల్లో మీడియా పని చేస్తోందా?

భారత్‌పై కుట్ర.. బయటపెట్టిన పాక్‌ యూట్యూబర్‌?

జగన్‌పై దూకుడు పెంచిన పవన్‌ కల్యాణ్‌?

కళకళలాడుతున్న కేసీఆర్‌ గల్లా పెట్టె?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>