PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/anam-nellore-ycp-tdp2a9af593-0e3c-4157-99ff-92e38e66aa9c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/anam-nellore-ycp-tdp2a9af593-0e3c-4157-99ff-92e38e66aa9c-415x250-IndiaHerald.jpgఇక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరో తిరుగుబాటు ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధరరెడ్డి తానే క్యాండిడేట్ అని ప్రకటించేసుకున్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కూడా మాజీమంత్రి పొంగూరు నారాయణ ఉన్నారు. సర్వేపల్లిలో మాజీమంత్రి సోమిరెడ్డిచంద్రమోహన్ రెడ్డిని పక్కనపెట్టి ఆనంకు టికెట్ ఇస్తారా ? అన్నది సందేహంగా ఉంది. ఈ కారణంగానే ఆనం నెల్లూరు ఎంపీగా పోటీచేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దాన్ని ఆనం కొట్టిపారేశారు. మరి ఎంఎల్ఏగా ఎక్కడినుండి పోటీచేస్తారన్నదే సస్పెన్సుగా మారింది. anam nellore ycp tdp{#}రాజీనామా;Nellore;MLA;YCP;ramakrishna;TDPకోస్తా : పోటీ విషయంలో ఆనం క్లారిటి ఇచ్చేశారా ?కోస్తా : పోటీ విషయంలో ఆనం క్లారిటి ఇచ్చేశారా ?anam nellore ycp tdp{#}రాజీనామా;Nellore;MLA;YCP;ramakrishna;TDPWed, 24 May 2023 07:00:00 GMT


రాబోయే ఎన్నికల్లో తాను పోటీచేసే విషయంపై మాజీమంత్రి, వైసీపీ రెబల్ ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డి క్లారిటి ఇచ్చేశారు. చంద్రబాబునాయుడు ఏ నియోజకవర్గంలో పోటీచేయమని చెబితే అక్కడినుండే ఎంఎల్ఏగానే పోటీచేస్తానని చెప్పారు. ఇంతవరకు తాను పోటీచేసే విషయమై ఆనం క్లారిటి ఇవ్వలేదు. మొదటిసారి మీడియాతో మాట్లాడుతు తాను ఎంపీగా పోటీచేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. తాను ఎంపీగా పోటీచేయటంలేదని కచ్చితంగా ఎంఎల్ఏగా మాత్రమే పోటీచేస్తానని చెప్పారు.





కాకపోతే ఎక్కడినుండి పోటీచేయబోతున్నాను అన్న విషయాన్ని మాత్రం సస్పెన్సులో ఉంచారు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఆనం పోటీచేయటానికి నియోజకవర్గం లేదు. వెంకటగిరిలో మాజీ ఎంఎల్ఏ కురగొండ్ల రామకృష్ణ ఉన్నారు. ఉదయగిరిలో మరో రెబల్ ఎంఎల్ఏ మేకపాటి చంద్రశేఖరరెడ్డే టీడీపీ అభ్యర్ధిగా ప్రచారం జరుగుతోంది. ఆత్మకూరులో ఆనం కూతురు కైవల్యారెడ్డి పోటీచేయబోతున్నట్లు ప్రచారంలో ఉంది.





ఇక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరో తిరుగుబాటు ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధరరెడ్డి తానే క్యాండిడేట్ అని ప్రకటించేసుకున్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో  కూడా మాజీమంత్రి పొంగూరు నారాయణ ఉన్నారు. సర్వేపల్లిలో మాజీమంత్రి సోమిరెడ్డిచంద్రమోహన్ రెడ్డిని పక్కనపెట్టి ఆనంకు టికెట్ ఇస్తారా ? అన్నది సందేహంగా ఉంది.  ఈ కారణంగానే ఆనం నెల్లూరు ఎంపీగా పోటీచేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దాన్ని ఆనం కొట్టిపారేశారు. మరి ఎంఎల్ఏగా ఎక్కడినుండి పోటీచేస్తారన్నదే సస్పెన్సుగా మారింది.





ఆనం చెప్పిన మరో మాట ఏమిటంటే వైసీపీలోని 60 శాతం ప్రజాప్రతినిధులు పార్టీని వదిలేసి టీడీపీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారట. రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయఢంకా మోగించటం ఖాయమని కూడా జోస్యం చెప్పేశారు. నిజంగానే విజయం అంత ఖాయమైతే ఆనం ఇంకా ఎందుకని వైసీపీలోనే ఉన్నారో అర్ధంకావటంలేదు. మిగిలిన వాళ్ళంటే జగన్మోహన్ రెడ్డికి భయపడి పార్టీలోనే ఉన్నారు. కానీ ఆనం ఓపెన్ అయిపోయారు కదా ? వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరటానికి ఇంకా భయందేనికి ? అన్న ప్రశ్నకు మాత్రం ఆనం సమాధానం చెప్పటంలేదు.







RRR Telugu Movie Review Rating

కోస్తా : పోటీ విషయంలో ఆనం క్లారిటి ఇచ్చేశారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>