EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu6a41d9d2-0393-46b7-bcb3-45554b480e20-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu6a41d9d2-0393-46b7-bcb3-45554b480e20-415x250-IndiaHerald.jpgకళ్ళ ముందు జరుగుతున్నది అంతా తెలిసినా కూడా, అందరి పద్ధతి తెలిసినా కూడా, రేపు ఏం జరగబోతుందో అన్నీ తెలిసి కూడా ఒక్కోసారి మౌనంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు జనసేన పార్టీ పరిస్థితి అదే అని తెలుస్తుంది. తెలుగుదేశం సంబంధించిన వ్యూహం అంతా కూడా పవన్ కళ్యాణ్ కి తెలిసినా కొంతమందినైనా అసెంబ్లీకి తన పార్టీ తరఫునుండి పంపాలని ధ్యేయంతో ఆయన తెలుగుదేశంతో ముందుకు వెళుతున్నట్లుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ వచ్చేవరకు ఒకరకంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని తెలుస్తుంది. గౌరవప్రదCHANDRABABU{#}Telugu Desam Party;Ayyannapatrudu;Maha;Avunu;Yevaru;kalyan;Janasena;CBN;Party;Telangana Chief Ministerటీడీపీ చేతిలో పవన్‌కు అవమానం తప్పదా?టీడీపీ చేతిలో పవన్‌కు అవమానం తప్పదా?CHANDRABABU{#}Telugu Desam Party;Ayyannapatrudu;Maha;Avunu;Yevaru;kalyan;Janasena;CBN;Party;Telangana Chief MinisterTue, 23 May 2023 07:00:00 GMTకళ్ళ ముందు జరుగుతున్నది అంతా తెలిసినా కూడా, అందరి పద్ధతి తెలిసినా కూడా, రేపు ఏం జరగబోతుందో అన్నీ తెలిసి కూడా ఒక్కోసారి మౌనంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు జనసేన పార్టీ పరిస్థితి అదే అని తెలుస్తుంది. తెలుగుదేశం సంబంధించిన వ్యూహం అంతా కూడా పవన్ కళ్యాణ్ కి తెలిసినా కొంతమందినైనా అసెంబ్లీకి తన పార్టీ తరఫునుండి పంపాలని ధ్యేయంతో ఆయన తెలుగుదేశంతో ముందుకు వెళుతున్నట్లుగా తెలుస్తుంది.


పవన్ కళ్యాణ్ వచ్చేవరకు ఒకరకంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని తెలుస్తుంది. గౌరవప్రదమైన సీట్లు కావాలన్న జనసేన లెక్కను కూడా పక్కకు పెట్టి వాళ్ళు కేవలం 20-25 సీట్లు మాత్రమే ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దానికి సజీవ సాక్ష్యం మొన్న అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు అని తెలుస్తుంది. మొన్న ఆయన ఏమన్నారంటే ఎక్కువ సీట్లు కావాలంటే ఇస్తాము, కానీ 40 వేల ఓట్లు గెలిచిన సీట్లను పట్టుకు రండి అన్నారట.


40వేల ఓట్లు వచ్చే స్థానాలు 7, 8 ఉన్నాయి జనసేన పార్టీకి. అంతేకాకుండా 30వేల ఓట్లు వచ్చే స్థానాలు కూడా కలుపుకుంటే ఒక ఆరు ఏడు ఉంటాయి. అంటే ఎనిమిది ఏడు కలిపితే మహా అయితే 15 సీట్లు మాత్రమే దక్కేలా ఉన్నాయని అంటున్నారు. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురుచూసిన పార్టీ శ్రేణులు, సీనియర్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి అన్న తరహాలో సాగుతున్నట్లుగా తెలుస్తుంది.


అయితే ఈ సీనియర్ల మాటను చంద్రబాబు నాయుడు పూర్తిగా కాదనరు. అలాగని అవును అనరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ముఖ్యమంత్రి పదవి షేరింగ్ లేదు. గౌరవప్రదమైన సీట్లు కూడా ఇచ్చేలా లేదు తెలుగుదేశం. అలాగని దీన్ని అవమానంలా భావించడానికి ఎవరు సిద్ధంగా లేరని అంటున్నారు. జనసేన పై అయ్యన్న లెక్కలు కూడా చంద్రబాబు మనసులోని మాటలేనని కొంతమంది అంటున్నారు



RRR Telugu Movie Review Rating

అమరావతి : పార్టీపై జగన్ పట్టుజారుతోందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>