Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle998757c8-936d-4744-a721-9d2bd4cb4ab3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle998757c8-936d-4744-a721-9d2bd4cb4ab3-415x250-IndiaHerald.jpgప్రముఖ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ తో ఎన్నో ఏళ్ల ప్రేమ బంధాన్ని ఏడడుగుల బంధంగా మార్చుకొని గత ఏడాది జూన్‌లో పెళ్లి పీటలెక్కింది నయనతార. అతిరథ మహారథుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఇటీవలే సరోగసి ద్వారా కవలలకు తల్లిదండ్రులయ్యారు ఈ జంట. పెళ్లి తర్వాత కూడా నటిగానే కాకుండా నిర్మాతగానూ సత్తాచాటుతోంది నయన్‌. తన భర్త విఘ్నేశ్‌ శివన్‌తో కలిసి రౌడీ పిక్చర్స్‌ బ్యానర్‌పై పలు సినిమాలను నిర్మిస్తోంది. అలాగే బయటి మూవీస్‌ను కూడా డిస్ట్రిబ్యూషన్‌ కూడా చేస్తోంది. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే పSocialstars lifestyle{#}agastya;atlee kumar;Joseph Vijay;cinema theater;Nijam;Husband;News;Darsakudu;bollywood;Director;prema;marriage;Love;Cinemaఅక్కడ థియేటర్ ను కొన్న లేడీ సూపర్ స్టార్ నయనతార....!!అక్కడ థియేటర్ ను కొన్న లేడీ సూపర్ స్టార్ నయనతార....!!Socialstars lifestyle{#}agastya;atlee kumar;Joseph Vijay;cinema theater;Nijam;Husband;News;Darsakudu;bollywood;Director;prema;marriage;Love;CinemaTue, 23 May 2023 11:50:40 GMTప్రముఖ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ తో ఎన్నో ఏళ్ల ప్రేమ బంధాన్ని ఏడడుగుల బంధంగా మార్చుకొని గత ఏడాది జూన్‌లో పెళ్లి పీటలెక్కింది నయనతార.

అతిరథ మహారథుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఇటీవలే సరోగసి ద్వారా కవలలకు తల్లిదండ్రులయ్యారు ఈ జంట. పెళ్లి తర్వాత కూడా నటిగానే కాకుండా నిర్మాతగానూ సత్తాచాటుతోంది నయన్‌. తన భర్త విఘ్నేశ్‌ శివన్‌తో కలిసి రౌడీ పిక్చర్స్‌ బ్యానర్‌పై పలు సినిమాలను నిర్మిస్తోంది.

అలాగే బయటి మూవీస్‌ను కూడా డిస్ట్రిబ్యూషన్‌ కూడా చేస్తోంది. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే పలు వ్యాపారాలు కూడా చేస్తూ మంచిగా సంపాదిస్తుంది ఈ లేడి సూపర్ స్టార్. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు మన స్టార్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండల బాటలోనే ఈ నటి కూడా వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఆ స్టార్ హీరోల మాదిరి గానే థియేటర్ నిర్మించనుందట నయన్.

ఈ మేరకు ఇటీవల చెన్నైలో మూతబడిన అగస్త్య థియేటర్‌ను (Nayanthara) నయన్‌ కొనుగోలు చేసినట్లు సినీ వర్గాలలో టాక్ నడుస్తుంది. ఆ థియేటర్ ని మంచిగా రెనోవేట్ చేయించి మల్టీ ప్లెక్స్‌ థియేటర్‌గా మార్చే ప్లాన్ చేస్తుందని అనుకుంటున్నారు. అయితే ఈ విషయంపై నయన్‌ కానీ ఆమె కుటుంబ సభ్యులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. చూడాలి మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో అని.

మరోవైపు బాలీవుడ్ లో షారుఖ్‌ ఖాన్‌తో కలిసి 'జవాన్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది నయనతార. అట్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం.. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ మూవీ సెప్టెంబర్‌ 7 న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. బాలీవుడ్‌లో నయన్‌కు ఇదే మొదటి సినిమా కావడం విశేషం.



RRR Telugu Movie Review Rating

వెనక్కి వెళ్లిన ట్రైన్.. బాలయ్య సినిమాలో కాదు.. ఇది నిజంగానే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>