TVChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/revanth-reddy4af5f005-41e1-484d-ba9b-1b29a558481d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/revanth-reddy4af5f005-41e1-484d-ba9b-1b29a558481d-415x250-IndiaHerald.jpgతెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి టీ న్యూస్ ఉంది. నమస్తే తెలంగాణ పత్రిక ఉంది. మిగతా పత్రికలు కూడా బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయనే విషయాలు ఆయా పత్రికలు చదివితే తెలుస్తుందని పలువరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆంధ్ర జ్యోతి పత్రిక ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ తరఫున వార్తలు అనుకూలంగా రాసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి సపోర్టుగా రాసి అధికారంలోకి తీసుకురావాలి. ఎందుకంటే గతంలో టీడీపీలో ఉండి చంద్రబాబుకు అనుకూలంగా పని చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. దీనికి తోడు తెలుగుదrevanth reddy{#}jyothi;revanth;Bharatiya Janata Party;Andhra Jyothi;Telugu;Pawan Kalyan;Telugu Desam Party;media;News;Reddy;Congress;Telanganaరేవంత్‌ రెడ్డి కోసం ఆ ఎల్లో మీడియా పని చేస్తోందా?రేవంత్‌ రెడ్డి కోసం ఆ ఎల్లో మీడియా పని చేస్తోందా?revanth reddy{#}jyothi;revanth;Bharatiya Janata Party;Andhra Jyothi;Telugu;Pawan Kalyan;Telugu Desam Party;media;News;Reddy;Congress;TelanganaTue, 23 May 2023 23:00:00 GMTతెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి టీ న్యూస్ ఉంది. నమస్తే తెలంగాణ పత్రిక ఉంది. మిగతా పత్రికలు కూడా బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయనే విషయాలు ఆయా పత్రికలు చదివితే తెలుస్తుందని పలువరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆంధ్ర జ్యోతి పత్రిక ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ తరఫున వార్తలు అనుకూలంగా రాసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


రేవంత్ రెడ్డికి సపోర్టుగా రాసి అధికారంలోకి తీసుకురావాలి. ఎందుకంటే గతంలో టీడీపీలో ఉండి చంద్రబాబుకు అనుకూలంగా పని చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. దీనికి తోడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ ఆంధ్రలో అనుకూలంగా లేదు. తెలంగాణలో అయితే ఒంటరిగానే పోరాడుతోంది. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ కు, టీడీపీకి అనుకూలంగా పత్రికలు మీడియా చానళ్లు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ కు అనుకూలంగా లేవు.  


ఆంధ్రజ్యోతి పత్రిక వ్యుహంలో భాగంగా బీజేపీని రెండు రాష్ట్రాల్లో దెబ్బతీసేలా చేస్తున్నారనే వాదన ఉంది. కాంగ్రెస్ నుంచి మొన్నటి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో చేరబోతున్నాడని ప్రచారం చేసింది. ఈ వార్తల్ని రాజగోపాల్ రెడ్డి ఖండించారు. రేవంత్ తో కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన వారు వెనక్కి తిరిగి రావాలని కోరేలా వెనక నుంచి ప్రోత్సహించింది ఆంధ్రజ్యోతేనని తెలుస్తోంది. బీజేపీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క చానల్ , పేపర్ లేవు.


దీంతో దీన్ని అదునుగా తీసుకుని ఆంధ్రజ్యోతి పూర్తిగా వ్యతిరేక వార్తలు రాస్తూ డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తోందని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కూడా తెలుగుదేశం వైపు మరలడానికి ఆంధ్రజ్యోతి కారణమని అంటున్నారు. ఏదైనా బలమైన మీడియా తోడుంటే ప్రజలకు వార్తలు చేరువగా వెళతాయి. కాబట్టి పవన్ కూడా టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏదేమైనా బీజేపీని తెలంగాణ, ఆంధ్రలో దెబ్బతీయాలని ఆంధ్రజ్యోతి ప్రయత్నాలు చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి.



RRR Telugu Movie Review Rating

తండ్రి పై సంచలన కామెంట్స్ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>