MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan2da846ea-53c7-424f-9585-2a00d993567c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan2da846ea-53c7-424f-9585-2a00d993567c-415x250-IndiaHerald.jpg సాధారణంగా టాప్ హీరోలు ఒక భారీ సినిమాను మొదలుపెట్టాక అది పూర్తి అవ్వకుండా మరొక సినిమాను చేయరు. సినిమాలను చాల నిదానంగా చేసే పవన్ తన పద్ధతికి భిన్నంగా వరసపెట్టి సినిమాలు చేయడం ఆశ్చర్యం. అయితే ఎప్పుడో మొదలుపెట్టిన ‘హరిహర వీరమల్లు’ ను మధ్యలో వదిలివేయడం ఎవరికీ అర్థంకాని విషయంగా మారింది.గత ఎన్నికలలో ఓడిపోయిన తరువాత పవన్ కు రీ ఎంట్రీ ఆలోచనలు వచ్చిన సమయంలో ఒప్పుకున్న మొట్టమొదటి సినిమాలలో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. ఈసినిమాతో మొదలుపెట్టిన ‘వకీల్ సాబ్’ ఎప్పుడో విడుదల అయిపోయింది. ఆతరువాత పవన్ వరసపెట్టి సినిpavankalyan{#}Athadu;kalyanపవన్ వ్యూహాలను అర్ధం చేసుకోలేకపోతున్న వీరమల్లు !పవన్ వ్యూహాలను అర్ధం చేసుకోలేకపోతున్న వీరమల్లు !pavankalyan{#}Athadu;kalyanMon, 22 May 2023 10:00:00 GMT
సాధారణంగా టాప్ హీరోలు ఒక భారీ సినిమాను మొదలుపెట్టాక అది పూర్తి అవ్వకుండా మరొక సినిమాను చేయరు. సినిమాలను చాల నిదానంగా చేసే పవన్ తన పద్ధతికి భిన్నంగా వరసపెట్టి సినిమాలు చేయడం ఆశ్చర్యం. అయితే ఎప్పుడో మొదలుపెట్టిన ‘హరిహర వీరమల్లు’ ను మధ్యలో వదిలివేయడం ఎవరికీ అర్థంకాని విషయంగా మారింది.



గత ఎన్నికలలో ఓడిపోయిన తరువాత పవన్ కు రీ ఎంట్రీ ఆలోచనలు వచ్చిన సమయంలో ఒప్పుకున్న మొట్టమొదటి సినిమాలలో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. ఈసినిమాతో మొదలుపెట్టిన ‘వకీల్ సాబ్’ ఎప్పుడో విడుదల అయిపోయింది. ఆతరువాత పవన్ వరసపెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ‘హరిహర వీరమల్లు’ ఒప్పుకునే సమయానికి ఇప్పుడు సినిమాలు చేస్తున్న పవన్ తీరుకు అతడి ఆలోచనా విధానంలో చాల మార్పులు కనిపిస్తున్నాయి అంటున్నారు.



ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాలకు సంబంధించి కేవలం 30 రోజుల డేట్స్ మాత్రమే ఇస్తున్నాడు. అతడికి మారిన ఆలోచనలకు అనుగుణంగా దర్శకులు కూడ కథలో అనేక మార్పులు చేసి పవన్ పాత్ర కీలకంగా ఉంటూనే అతడు నటించే సన్నివేశాలకు సంబంధించి పవన్ ఇవ్వవలసిన డేట్స్ ను కేవలం 30 రోజులకు సరిపడే విధంగా దర్శకులు డిజైన్ చేసుకుంటున్నారు.


పవన్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘బ్రో’ ‘ఓజీ’ సినిమాలలో పవన్ కేవలం 30 రోజులు మాత్రమే పనిచేసి 50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు అని అంటున్నారు.



అయితే ‘హరిహర వీరమల్లు’ విషయానికి వస్తే ఆసినిమాకు ఇప్పటివరకు పవన్ 50 రోజుల కాల్ షీట్స్ ఇచ్చినప్పటికీ క్రిష్ ఆసినిమాను రకరకాల కారణాలతో పూర్తి చేయలేక పోయాడు అని అంటారు. దీనితో ‘హరిహర వీరమల్లు’ పై పవన్ కళ్యాణ్ కు పూర్తిగా ఆశక్తి తగ్గిపోయింది అన్న గాసిప్పులు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈసినిమా చిత్రీకరణ 60 శాతం వరకు పూర్తి అయిన పరిస్థితులలో ఈసినిమాను ముందుకు తీసుకు వెళ్ళలేక అదేవిధంగా ఈసినిమా ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియక ఒక విచిత్రమైన కన్ఫ్యూజన్ లో క్రిష్ ఉన్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి..






RRR Telugu Movie Review Rating

హాట్ లుక్ ఉన్న స్కై బ్లూ కలర్ డ్రెస్లో హీట్ పుట్టిస్తున్న లావణ్య త్రిపాఠి..!

భారత్‌పై అంతర్జాతీయంగా వాణిజ్య కుట్ర?

రేవంత్‌ గేమ్‌ ప్లాన్‌తో బీజేపీ బేజార్‌?

బీజేపీపై మీడియా కుట్ర.. ఏం చేస్తున్నారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>