MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bichhagaadu-206e6b65e-1763-4162-a3ca-ba1e3780c463-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bichhagaadu-206e6b65e-1763-4162-a3ca-ba1e3780c463-415x250-IndiaHerald.jpg కొన్ని దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన మణిరత్నం చాళుక్యుల చరిత్ర పై ఎంతో పరిశోధన చేసి తన అనారోగ్యాన్ని కూడ లెక్కచేయకుండా నిర్మించిన ‘పొన్నియన్ సెల్వన్ 2’ సినిమాకు తెలుగులో విపరీతంగా ప్రమోట్ చేసారు. ఆసినిమా వెనుక దిల్ రాజ్ గోల్డెన్ హ్యాండ్ ఉన్నప్పటికీ ఆమూవీకి తెలుగు ప్రేక్షకుల నుండి అంతంత మాత్రంగానే కలక్షన్స్ వచ్చాయి.ఆమధ్య ‘పొన్నియన్ సెల్వన్ 2’ పరాజయం చెందిన తరువాత తమిళ మీడియా తెలుగు ప్రేక్షకులు తమ సినిమాలను తప్ప తమిళ సినిమాలను పెద్దగా పట్టించుకోరు అంటూ అక్కడి మీBICHHAGAADU-2{#}Mani Ratnam;history;vegetable market;Idea;Reddy;Dil;media;vijay antony;Telugu;Joseph Vijay;Tamil;News;Cinemaమణిరత్నం కు షాక్ ఇచ్చిన బిచ్చాగాడు 2 !మణిరత్నం కు షాక్ ఇచ్చిన బిచ్చాగాడు 2 !BICHHAGAADU-2{#}Mani Ratnam;history;vegetable market;Idea;Reddy;Dil;media;vijay antony;Telugu;Joseph Vijay;Tamil;News;CinemaMon, 22 May 2023 09:00:00 GMT
కొన్ని దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన మణిరత్నం చాళుక్యుల చరిత్ర పై ఎంతో పరిశోధన చేసి తన అనారోగ్యాన్ని కూడ లెక్కచేయకుండా నిర్మించిన ‘పొన్నియన్ సెల్వన్ 2’ సినిమాకు తెలుగులో విపరీతంగా ప్రమోట్ చేసారు. ఆసినిమా వెనుక దిల్ రాజ్ గోల్డెన్ హ్యాండ్ ఉన్నప్పటికీ ఆమూవీకి తెలుగు ప్రేక్షకుల నుండి అంతంత మాత్రంగానే కలక్షన్స్ వచ్చాయి.

 

 ఆమధ్య ‘పొన్నియన్ సెల్వన్ 2’ పరాజయం చెందిన తరువాత తమిళ మీడియా తెలుగు ప్రేక్షకులు తమ సినిమాలను తప్ప తమిళ సినిమాలను పెద్దగా పట్టించుకోరు అంటూ అక్కడి మీడియా తెలుగువారి పై నెగిటివ్ కామెంట్స్ చేసింది. అయితే మణిరత్నం సినిమాలను చాల ఎక్కువగా ఆదరించింది తెలుగు ప్రేక్షకులు మాత్రమే అన్న విషయాన్ని తమిళ మీడియా మర్చిపోయింది.

 

 ఇప్పుడు నందినీ రెడ్డి ఫ్యామిలీ ప్రేక్షకులను నమ్ముకుని కష్టపడి తీసిన ‘అన్నీ మంచి శకునములే’ మూవీ కంటే ‘బిచ్చగాడు 2’ కు మంచి కలక్షన్స్ రావడం పరిశీలిస్తే తెలుగు ప్రేక్షకులకు ఒక సినిమా నచ్చితే ఆసినిమా తమ భాష సినిమా కాకపోయినా నెత్తిన పెట్టుకుని కోట్లు కురిపిస్తారు అన్న విషయాన్ని ‘కాంతారా’ ‘కేజీ ఎఫ్’ సినిమాలు రుజువు చేసాయి. దీనితో మళ్ళీ తమిళ డబ్బింగ్ సినిమాలకు మంచి సీజన్ ప్రారంభం అయింది అనుకోవాలి.

 

 వాస్తవానికి ‘బిచ్చగాడు 2’ కథకు సంబంధించిన ఐడియా బాగున్నప్పటికీ ఆమూవీని విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు’ స్థాయిలో తీయలేకపోయాడు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే 8 సంవత్సరాలు క్రితం విడుదలైన ‘బిచ్చగాడు’ మూవీని తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేకపోవడంతో ‘బిచ్చగాడు 2’ మూవీకి టాక్ ఎలా ఉన్నప్పటికీ కలక్షన్స్ బాగానే ఉన్నాయి అన్న వార్తలు వస్తున్నాయి. సంవత్సరాల తరబడి ఒక హిట్ కోసం ఎదురు చూసిన విజయ్ యాంటోనీ కి మళ్ళీ ఈమూవీతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మార్కెట్ పెరిగే ఆస్కారం కనిపిస్తోంది. వచ్చేవారం కూడ సరైన సినిమాలు లేకపోవడంతో ‘బిచ్చగాడు 2’ బయ్యర్లు గట్టెక్కినట్లే అనుకోవాలి..

 





RRR Telugu Movie Review Rating

"టైగర్ నాగేశ్వరరావు" మూవీ ఫస్ట్ లుక్ విడుదల 5 భాషల్లో 5 గురు హీరోలు... ఎవరో తెలుసా..?

భారత్‌పై అంతర్జాతీయంగా వాణిజ్య కుట్ర?

రేవంత్‌ గేమ్‌ ప్లాన్‌తో బీజేపీ బేజార్‌?

బీజేపీపై మీడియా కుట్ర.. ఏం చేస్తున్నారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>