Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle2526d07f-2142-4b56-9052-6a72ecc10d83-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle2526d07f-2142-4b56-9052-6a72ecc10d83-415x250-IndiaHerald.jpgఅఖండ, వీర సింహారెడ్డి వరుస విజయాల తర్వాత నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, శ్రీలీల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలోకి తమన్నా భాటియాను కూడా తీసుకు రావడం అభిమానులకు జోష్ కలిగించింది. అయితే ఈ సినిమా చేస్తున్న పాత్ర కారణంగా తనపై వచ్చిన రూమర్లపై ఘాటుగా స్పందించింది. ఆ రూమర్లు ఏమిటి? తమన్నా ట్విట్టర్‌లో స్పందించడాSocialstars lifestyle{#}anil music;anil ravipudi;kajal aggarwal;KGF;Josh;Balakrishna;tamannaah bhatia;media;Chitram;Cinemaబాలయ్య బాబుతో రూమర్ల పై స్పందించిన మిల్కీ బ్యూటీ....!!బాలయ్య బాబుతో రూమర్ల పై స్పందించిన మిల్కీ బ్యూటీ....!!Socialstars lifestyle{#}anil music;anil ravipudi;kajal aggarwal;KGF;Josh;Balakrishna;tamannaah bhatia;media;Chitram;CinemaMon, 22 May 2023 11:52:07 GMTఅఖండ, వీర సింహారెడ్డి వరుస విజయాల తర్వాత నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, శ్రీలీల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలోకి తమన్నా భాటియాను కూడా తీసుకు రావడం అభిమానులకు జోష్ కలిగించింది. అయితే ఈ సినిమా చేస్తున్న పాత్ర కారణంగా తనపై వచ్చిన రూమర్లపై ఘాటుగా స్పందించింది. ఆ రూమర్లు ఏమిటి? తమన్నా ట్విట్టర్‌లో స్పందించడానికి కారణమేమిటనే విషయంలోకి వెళితే..

తమన్నా భాటియా విషయానికి వస్తే.. గతంలో కేజీఎఫ్ 1, జనతా గ్యారేజ్ లాంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి మెప్పించింది. అనిల్ రావిపూడి చిత్రాల్లో తరుచూ తమన్నా భాటియా కనిపిస్తుంటుంది. అనిల్ రావిపూడికి తమన్నా లక్కీ మస్కట్ అని సినీ వర్గాలు చెప్పుకొంటారు. అయితే బాలకృష్ణ సినిమాలో కూడా మూడో తారగా తమన్నాను ప్రాజెక్టులోకి అనిల్ పట్టుకొచ్చారు.
అయితే బాలకృష్ణ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులు వేయడానికి తమన్నా భారీగా రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేసిందనే రూమర్లు మీడియాలో కనిపించాయి. ఒక్క పాటలో నటించడానికి దాదాపు 1.5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని, అయితే ఆ రేంజ్‌లో పారితోషికం అడగడంతో ఆమెను తీసుకోవడానికి నిరాకరించారు అని మీడియాలో కథనాలు వచ్చాయి.

తమ చిత్రంలో నటిస్తున్న కాజల్, శ్రీలీలకు అంత రెమ్యునరేషన్ ఇవ్వడం లేదు. మీరు కోరినట్టు 1.5 కోట్లు ఇవ్వడం కుదరదు. మీ రెమ్యునరేషన్ తగ్గించుకొంటే.. మేము ఆలోచిస్తాం. కాబట్టి రెమ్యునరేషన్ విషయంలో మరోసారి ఆలోచించుకోవాలని నిర్మాతలు తమన్నాకు చెప్పారు అంటూ కథనంలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఫేడ్ అవుట్ హీరోయిన్‌కు అంత రెమ్యునరేషనా? అంటూ మీడియాలో కామెంట్స్ వినిపించాయి.

తనపై వచ్చిన రూమర్లు, కథనాలపై తమన్నా ఘాటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. అనిల్ రావిపూడి సార్ మీతో పని చేయడం ద్వారా చాలా ఎంజాయ్ చేశాను. మీరు, నందమూరి బాలకృష్ణ అంటే నాకు అమితమైన గౌరవం ఉంది. నా గురించి అవాస్తవాలు, మీడియాలో వచ్చిన కట్టుకథలు చదివిన తర్వాత చాలా అప్‌సెట్ అయ్యాను. పాటలో నటించడం లేదని మీడియా రాసింది. అయితే ఇలాంటి అసత్యాలు రాసే ముందు మీడియా రీసెర్చ్ చేసుకొని రాయాలి అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది.

తమన్నా భాటియాకు 2022 సంవత్సరం చేదు అనుభవాన్ని మిగిల్చింది. గని, బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బీ, గుర్తుందా శీతాకాలం సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం చిరంజీవితో భోళా శంకర్, రజనీకాంత్‌తో జైలర్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇంకా అరణ్‌మణై 4, భద్ర, బోలే చుడియాన్ చిత్రాల్లో తమన్నా భాటియా నటిస్తున్నది.



RRR Telugu Movie Review Rating

ఏంటి.. సౌందర్య కి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా..!?

భారత్‌పై అంతర్జాతీయంగా వాణిజ్య కుట్ర?

రేవంత్‌ గేమ్‌ ప్లాన్‌తో బీజేపీ బేజార్‌?

బీజేపీపై మీడియా కుట్ర.. ఏం చేస్తున్నారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>