EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/siddaramayyaa9b9eadf-cddc-48cb-a896-52a5ea9ad0d3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/siddaramayyaa9b9eadf-cddc-48cb-a896-52a5ea9ad0d3-415x250-IndiaHerald.jpgప్రజల అభిమానం, ప్రజాభిప్రాయమే ఎవరినైనా గెలిపించే ఫ్యాక్టర్ అవుతుంది. ఒకరకంగా ప్రజల్లో అంత బలమైన ముద్రను, మంచి అభిప్రాయాన్ని ఏర్పరిచి ఉంటే, ప్రజల అభిమానం అనేది రూపాయి ఖర్చు లేకుండానే దొరుకుతుంది. ఇప్పుడు కర్ణాటకలో ప్రజాభిప్రాయం ఇంకా సర్వేలు కూడా చెప్పేది సిద్ధరామయ్య గురించే. అసలు ఆయన వల్లే, సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారనే కారణంతోనే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనేది 60 శాతం వరకు కారణమని అంటున్నారు. మిగిలిన 40 శాతం వేరు వేరు ఫ్యాక్టర్స్ ఉండే అవకాశం ఉంది. డీకే శివకుమార్ వైపు SIDDARAMAYYA{#}Shiva;mallikarjun;Rahul Gandhi;Survey;lord siva;Siva Kumar;Congress;rahul;Rahul Sipligunj;Telangana Chief Minister;SoniaGandhiసిద్ధరామయ్యను సీఎం చేసిన అంశం ఇదే?సిద్ధరామయ్యను సీఎం చేసిన అంశం ఇదే?SIDDARAMAYYA{#}Shiva;mallikarjun;Rahul Gandhi;Survey;lord siva;Siva Kumar;Congress;rahul;Rahul Sipligunj;Telangana Chief Minister;SoniaGandhiSat, 20 May 2023 05:00:00 GMTప్రజల అభిమానం, ప్రజాభిప్రాయమే ఎవరినైనా గెలిపించే ఫ్యాక్టర్ అవుతుంది. ఒకరకంగా ప్రజల్లో అంత బలమైన ముద్రను, మంచి అభిప్రాయాన్ని ఏర్పరిచి ఉంటే, ప్రజల అభిమానం అనేది రూపాయి ఖర్చు లేకుండానే దొరుకుతుంది. ఇప్పుడు కర్ణాటకలో ప్రజాభిప్రాయం ఇంకా సర్వేలు కూడా చెప్పేది సిద్ధరామయ్య గురించే. అసలు ఆయన వల్లే, సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారనే కారణంతోనే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనేది 60 శాతం వరకు కారణమని అంటున్నారు. మిగిలిన 40 శాతం వేరు వేరు ఫ్యాక్టర్స్ ఉండే అవకాశం ఉంది.


డీకే శివకుమార్ వైపు ఎమ్మెల్యేలు ఉన్నారన్నమాట నిజమే. కానీ ఎంత డబ్బులు పెట్టి ప్రయత్నించినా ఫలితం రాబట్టుకోలేకపోయారని అంటున్నారు. తన దగ్గర ఉన్న డబ్బుతో ఎమ్మెల్యేలను కొన్నా సరే పర్సన్ టు పర్సన్ వాళ్ళని సర్వే చేసినప్పుడు వాళ్లలో 80% మంది సిద్ధరామయ్య వైపే  మొగ్గు చూపించారు అన్నట్లుగా తెలిసింది. దాంతో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అని రాహుల్ గాంధీతో పాటు, సోనియా గాంధీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారట.


ఈ విషయంపైనే రాహుల్ గాంధీ డీకే శివకుమార్ తో ఒక గంట పైనే చర్చించారట. అయితే దీనికి అప్పుడైతే రాహుల్ తో డీకే శివకుమార్ సరేనని చెప్తూనే మల్లికార్జున్ కార్గే దగ్గరకు వెళ్లి ఇదే ప్రతిపాదనను తీసుకొచ్చారని తెలుస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఎదురు చూడాలి. అయితే ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రజల అభిప్రాయానికే ఎక్కువ మద్దతునిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రజాభిప్రాయం ప్రకారం సిద్ధరామయ్య తమకు ముఖ్యమంత్రి కావాలన్నది వాళ్ళ ఉద్దేశం అని తెలుస్తుంది.


కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలంటే సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఆ లెక్క ప్రకారం ముఖ్యమంత్రిగా సిద్ధ రామయ్యని, డిప్యూటీ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ని ప్రకటించింది. డీకే శివ కుమార్‌ చివరి వరకూ పోటీ ఇచ్చినా చివరకు హైకమాండ్ నిర్ణయానికి ఓకే చెప్పాల్సి వచ్చింది. మొత్తానికి కర్ణాటక కథ సుఖాంతం అయ్యింది.



RRR Telugu Movie Review Rating

"మహావీరుడు" తెలుగు థియేటర్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

థమన్ బ్రో.. మళ్లీ ఇరగదీశావ్ పో..!

మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?

ఇంత చేసినా.. అఖిలప్రియకు టికెట్‌ వస్తుందా?

పవన్‌కు జగన్ అంటే అంత కోపం ఎందుకంటే?

జగన్ సాధించిన అతి పెద్ద గెలుపు ఇదేనా?

అమెరికా అప్పుల్లో.. ఇప్పుడు ఇండియానే బెస్ట్‌?

ఆ దేశంలో కొట్టుకుంటున్న ఇండియన్లు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>