PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/karakatta-lingamaneni-chandrababu-jagan127d72d6-01f5-411d-8dea-c65ac39b9b61-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/karakatta-lingamaneni-chandrababu-jagan127d72d6-01f5-411d-8dea-c65ac39b9b61-415x250-IndiaHerald.jpgకరకట్టమీద చంద్రబాబునాయుడు నివాసముంటున్న అక్రమ నిర్మాణాన్ని ప్రభుత్వం జప్తుచేసిన విషయం తెలిసిందే. దానిదెబ్బ చంద్రబాబుకు బాగా గట్టిగానే తగిలినట్లుంది. ఎప్పుడైతే భవనాన్ని ప్రభుత్వం జప్తుచేసినట్లు ప్రకటించిందో అప్పటినుండో విడతలవారీగా తమ్ముళ్ళు జగన్మోహన్ రెడ్డిపైన విరుచుకుపడుతున్నారు. వాళ్ళకి ఎల్లోమీడియా తోడై ప్రముఖంగా ప్రచురిస్తోంది. కరకట్టమీద అక్రమనిర్మాణాన్ని ప్రభుత్వం జప్తుచేసిందంటే అందులో చంద్రబాబు అక్రమంగా ఉంటున్నారు కాబట్టే. భవనమే అక్రమ నిర్మాణమంటే అందులో ఉండటం కూడా అక్రమంగానే. karakatta lingamaneni chandrababu jagan{#}Jagan;Government;media;CBNఅమరావతి : కరకట్ట దెబ్బ ఇంత గట్టిగా తగిలిందా ?అమరావతి : కరకట్ట దెబ్బ ఇంత గట్టిగా తగిలిందా ?karakatta lingamaneni chandrababu jagan{#}Jagan;Government;media;CBNFri, 19 May 2023 05:00:00 GMT


కరకట్టమీద చంద్రబాబునాయుడు నివాసముంటున్న అక్రమ నిర్మాణాన్ని ప్రభుత్వం జప్తుచేసిన విషయం తెలిసిందే. దానిదెబ్బ చంద్రబాబుకు బాగా గట్టిగానే తగిలినట్లుంది. ఎప్పుడైతే భవనాన్ని ప్రభుత్వం జప్తుచేసినట్లు ప్రకటించిందో అప్పటినుండో విడతలవారీగా తమ్ముళ్ళు జగన్మోహన్ రెడ్డిపైన విరుచుకుపడుతున్నారు. వాళ్ళకి ఎల్లోమీడియా తోడై ప్రముఖంగా ప్రచురిస్తోంది. కరకట్టమీద అక్రమనిర్మాణాన్ని ప్రభుత్వం జప్తుచేసిందంటే అందులో చంద్రబాబు అక్రమంగా ఉంటున్నారు కాబట్టే. భవనమే అక్రమ నిర్మాణమంటే అందులో ఉండటం కూడా అక్రమంగానే.





జప్తు విషయంలో జగన్ ప్రభుత్వం ఏదన్నా తప్పుచేస్తోందంటే ఆ విషయమై ఆరోపణలు చేయచ్చు లేదా విమర్శించచ్చు. అయితే ఆ పనిచేయకుండా జగన్ వేసుకునే చెప్పులు, వాడే పెన్ను, ఉంటున్న ఇల్లు, తాగే మంచినీళ్ళ గురించి మాట్లాడుతున్నారంటేనే అర్ధమవుతోంది తమ్ముళ్ళు, ఎల్లోమీడియా అక్కసు. జగన్ వేసుకునే చెప్పుల ధర రు. 1.34 లక్షలట. పెన్ను ఖరీదు లక్ష రూపాయలని అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. లోటస్ పాండ్, తాడేపల్లి, పులివెందుల, బెంగుళూరులో ఇళ్ళని చెప్పి కొన్ని ఫొటోలు చూపించి ఇవి జగన్ వి కాకపోతే తమ్ముళ్ళకి రాసిచ్చేయాలని డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది.





కరకట్ట ఇంటిని జప్తుచేసిన విషయమై ప్రతిరోజు వంతులవారీగా తమ్ముళ్ళు మీడియా సమావేశాలు పెట్టి జగన్ ను నోటికొచ్చినట్లు విమర్శిస్తున్నారు. కరకట్ట ఇంటిలో చంద్రబాబు నివాసం ఉంటున్నది సక్రమమా ? అక్రమమా అని చెప్పమంటే మాత్రం చెప్పటంలేదు. పొంతనలేని మాటలు, ఆరోపణలతో జగన్ పైన తమకున్న కసినంతా తీర్చుకుంటున్నారు. వాటికి సహజంగానే ఎల్లోమీడియా బాగా ప్రచారం కల్పిస్తోంది.





విచిత్రం ఏమిటంటే ఇప్పటివరకు కరకట్ట ఇంటి విషయమై చంద్రబాబు డైరెక్టుగా మీడియాతో మాట్లాడలేదు. తాను మీడియా ముందుకు రాకుండా ప్రతిరోజు తమ్ముళ్ళతో మాట్లాడిస్తున్నారు. వాళ్ళేమో పొంతనలేని మాటలు మాట్లాడి చంద్రబాబును మరింత ఇరికించేస్తున్నారు. చిన్నపుడు రబ్బర్ చెప్పులేసుకుని, కుళాయి నీళ్ళు తాగిన జగన్ ఇపుడు బ్రాండెడ్ నీళ్ళు తాగేస్ధాయికి ఎలా ఎదిగారంటు ఆనం ప్రశ్నించటమే విచిత్రం. చిన్నపుడు జగన్ రబ్బర్ చెప్పులేసుకున్నారా ? కుళాయి నీళ్ళు తాగారో లేకపోతే బాటిల్ నీళ్ళు తాగారో ఆనంకు తెలుసా ?




RRR Telugu Movie Review Rating

నేషనల్ క్రష్ ఛాన్స్ ను కొట్టేసిన కృతి శెట్టి..!

అన్నీ మంచి శకునములే.. అంతా మంచి లాభాలే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>