Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplbf41f137-9a28-400e-95fe-69616d10033d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplbf41f137-9a28-400e-95fe-69616d10033d-415x250-IndiaHerald.jpgసన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 2023 ఐపీఎల్ సీజన్లో ఎంత దారుణమైన ప్రస్తానాన్ని కొనసాగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాదే చెత్త ప్రదర్శన చేసింది అనుకుంటే.. ఇక ఈ ఏడాది అంతకుమించి అనేలాగే వైఫల్యాన్ని కొనసాగించింది. వరుస ఓటములతో సతమతమవుతూ ఇక ప్లే ఆఫ్ అవకాశాలను క్రమక్రమంగా దూరం చేసుకుంది. గెలిచే మ్యాచ్లో కూడా ఓడిపోతూ సన్రైజర్స్ తీవ్రంగా నిరాశపరిచింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈసారైనా టైటిల్ గెలుస్తుంది ఏమో అని అభిమానులు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. అయితేIpl{#}Hyderabadఐపీఎల్ : అంతా అయిపోయాక.. ఇప్పుడు మెరుపులెందుకో?ఐపీఎల్ : అంతా అయిపోయాక.. ఇప్పుడు మెరుపులెందుకో?Ipl{#}HyderabadFri, 19 May 2023 09:24:40 GMTసన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 2023 ఐపీఎల్ సీజన్లో ఎంత దారుణమైన ప్రస్తానాన్ని కొనసాగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాదే చెత్త ప్రదర్శన చేసింది అనుకుంటే.. ఇక ఈ ఏడాది అంతకుమించి అనేలాగే  వైఫల్యాన్ని కొనసాగించింది. వరుస ఓటములతో సతమతమవుతూ ఇక ప్లే ఆఫ్ అవకాశాలను క్రమక్రమంగా దూరం చేసుకుంది. గెలిచే మ్యాచ్లో కూడా ఓడిపోతూ సన్రైజర్స్ తీవ్రంగా నిరాశపరిచింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈసారైనా టైటిల్ గెలుస్తుంది ఏమో అని అభిమానులు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.



 అయితే ఇక ఇటీవలే ప్లే ఆఫ్ అవకాశాలను కోల్పోయిన సన్రైజర్స్ జట్టు ఇక ఆ తర్వాత జరుగుతున్న మ్యాచ్లలో కూడా ఒత్తిడితో కనిపిస్తుంది.. తప్ప ఎక్కడ స్వేచ్ఛగా ఆడినట్లు మాత్రం కనిపించడం లేదు. అయితే ఇటీవల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో మరోసారి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఓటమి తప్పలేదు. అయితే సన్రైజర్స్ తక్కువ పరుగులకే పరిమితమవుతుంది అనుకుంటున్నా సమయంలో జట్టులో స్టార్ బాట్స్మన్ గా ఉన్న క్లాసెస్ సూపర్ సెంచరీ తో మెరిసాడు. ఒకవేళ అతను సెంచరీ చేయకపోయి ఉంటే మాత్రం సన్రైజర్స్ దారుణమైన స్కోర్ కే పరిమితం అయ్యేది అని చెప్పాలి.



 కేవలం 51 బంతుల్లోనే 8 ఫోర్లు 6 సిక్సర్ల సహాయంతో 14 పరుగులు చేశాడు క్లాసెస్. ఇతనికి తోడుగా బ్రూక్స్ 27 పరుగులు మార్కరమ్ 18 పరుగులతో సహకారం అందించారు అని చెప్పాలి. దీంతో 20 ఓవర్లు ముగిసేసరికి సన్రైజర్స్ 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.  కానీ ఆ తర్వాత బెంగళూరు జట్టు మాత్రం సన్రైజర్స్ బౌలర్ల పై వీర విహారం చేసి ఇక ఎంతో ఆలవోకగా టార్గెట్ చేదించి ఘన విజయాన్ని అందుకుంది అని చెప్పాలి. అయితే క్లాసెస్ సెంచరీ పై స్పందిస్తున్న సన్రైజర్స్ అభిమానులు అంత అయిపోయాక ఇప్పుడు బ్యాటింగ్లో మెరుపులు మెరూపించడం ఎందుకు అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

రవితేజ లాస్ట్ 5 మూవీస్ బాక్సాఫీస్ క్లోసింగ్ కలెక్షన్స్ వివరాలు ఇవే..!

మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?

ఇంత చేసినా.. అఖిలప్రియకు టికెట్‌ వస్తుందా?

పవన్‌కు జగన్ అంటే అంత కోపం ఎందుకంటే?

జగన్ సాధించిన అతి పెద్ద గెలుపు ఇదేనా?

అమెరికా అప్పుల్లో.. ఇప్పుడు ఇండియానే బెస్ట్‌?

ఆ దేశంలో కొట్టుకుంటున్న ఇండియన్లు?

పవన్ మాటలో మార్పు అంతరార్థం ఇదే?

అన్నీ మంచి శకునములే.. అంతా మంచి లాభాలే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>