MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-and-allu-arjundd2a89bf-864b-49eb-9194-ff3117b90604-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-and-allu-arjundd2a89bf-864b-49eb-9194-ff3117b90604-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా చిన్న స్థాయి నుండి ఎదుగుతూ వస్తున్న రాజమౌళి ఆయనతోపాటు ఆయనతో సినిమాలు చేస్తున్న హీరోలకు కూడా గుర్తింపును తీసుకొస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన బాహుబలి సినిమాను తెరకెక్కించాడు అప్పటినుండి రాజమౌళి రేంజ్ మారిపోయింది. రాజమౌళి ఇంతలా సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం ఒక బాహుబలి సినిమా మాత్రమే కాదు. ఆయన కుటుంబ సభ్యులు అని కూడా చెప్పడంలో సందేహం లేదు. ఆయన భార్య కొడుకు వదిన అన్న తండ్రి ఇలా ప్రతి ఒక్కరు కూడా తన సినిమాలో ఏదో ఒక పని చేస్తూ ఉంRajamouli And Allu Arjun{#}Allu Aravind;Allu Arjun;geetha;Jr NTR;kalyan;Rajamouli;Bahubali;Arjun;Magadheera;Success;Prabhas;Wife;Father;Director;Cinema;Indiaచచ్చినా అల్లు అర్జున్ తో సినిమా చేయను అంటున్న రాజమౌళి.. కారణం అతనేనా..!?చచ్చినా అల్లు అర్జున్ తో సినిమా చేయను అంటున్న రాజమౌళి.. కారణం అతనేనా..!?Rajamouli And Allu Arjun{#}Allu Aravind;Allu Arjun;geetha;Jr NTR;kalyan;Rajamouli;Bahubali;Arjun;Magadheera;Success;Prabhas;Wife;Father;Director;Cinema;IndiaThu, 18 May 2023 14:40:00 GMTటాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా చిన్న స్థాయి నుండి ఎదుగుతూ వస్తున్న రాజమౌళి ఆయనతోపాటు ఆయనతో సినిమాలు చేస్తున్న హీరోలకు కూడా గుర్తింపును తీసుకొస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన బాహుబలి సినిమాను తెరకెక్కించాడు అప్పటినుండి రాజమౌళి రేంజ్ మారిపోయింది. రాజమౌళి ఇంతలా సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం ఒక బాహుబలి సినిమా మాత్రమే కాదు. ఆయన కుటుంబ సభ్యులు అని కూడా చెప్పడంలో  సందేహం లేదు. ఆయన భార్య కొడుకు వదిన అన్న తండ్రి ఇలా ప్రతి ఒక్కరు కూడా తన సినిమాలో ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. ఆయనకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అందుకే రాజమౌళి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు అని చెప్పొచ్చు. ఇక రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నాలుగు సినిమాలు చేశాడు. 

ఇక ప్రభాస్ మూడు సినిమాలు రాంచరణ్ రెండు సినిమాలు చేశారు.టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా ఉన్న వారందరితో రాజమౌళి సినిమాలు చేశారు. కేవలం పవన్ కళ్యాణ్ మరియు అల్లు అర్జున్ లతో మాత్రమే ఇప్పటివరకు సినిమా చేయలేదు. తాజాగా ఇప్పుడు మహేష్ బాబుతో కూడా ఒక సినిమా చేస్తున్నాడు రాజమౌళి. గతంలో రాజమౌళి పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఒక సినిమా అనుకున్నప్పటికీ అవి చర్చలు జరిగే సమయంలోనే ఆగిపోయాయి. కానీ రాజమౌళి అల్లు అర్జున్ తో మాత్రం చచ్చిన సినిమాను తీయను అని అంటున్నారట. అయితే రాజమౌళి అల్లు అర్జున్ పై అంత కోపంగా ఉండడానికి ముఖ్య కారణం అల్లు అరవింద్ అని అంటున్నారు. దానికి ఒక కారణం కూడా ఉందట. 

అయితే అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించిన మగధీర సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలుసు. ఇక ఆ సినిమా తెరకెక్కించే సమయంలో రాజమౌళికి అల్లు అరవింద్ కి మధ్య ఏదో గొడవ జరిగింది. కనీసం మాట్లాడుకోరట. అంతేకాదు రాజమౌళి ఇప్పటివరకు గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఒక్క సినిమా కూడా చేసింది లేదు. దీన్నిబట్టి చూస్తే వీరిద్దరి మధ్య ఎంత కోపం ఉందో తెలుసుకోవచ్చు. అందుకే తండ్రి చేసిన తప్పుకి రాజమౌళి అల్లు అర్జున్ తో సినిమా తీసే అవకాశాలు లేవట. కానీ అల్లు అర్జున్ మాత్రం తనకున్న టాలెంట్ తో పుష్ప సినిమాతో ఫ్యాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న బన్నీ అభిమానులు తండ్రి చేసిన తప్పుకి కొడుకుని ఎందుకు శిక్షిస్తున్నారు అంటూ రాజమౌళిని ప్రశ్నిస్తున్నారు ..!!



RRR Telugu Movie Review Rating

లియో సినిమా తర్వాత ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్న విజయ్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>