Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiru8b1ca2b2-9e6e-4ea8-a5f7-3a5a2c705a53-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiru8b1ca2b2-9e6e-4ea8-a5f7-3a5a2c705a53-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి 60 ఏళ్లు దాటిపోయిన తర్వాత కూడా ఇంకా యువ హీరోలకు పోటీ ఇస్తూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అంతేకాదు సూపర్ హిట్ లు అందుకుంటూ రికార్డులు సృష్టిస్తున్నాడు. అయితే 60 ఏళ్లు దాటిన తర్వాతే చిరంజీవి క్రేజ్ ఇలా ఉందంటే.. ఇక పాతికేళ్ల ప్రాయంలో చిరంజీవి క్రేజ్ ఏ రేంజ్ లో ఉండి ఉంటుందో మాటల్లో వర్ణించడం చాలా కష్టం. ఇక అప్పట్లో చిరంజీవి అనే పేరు కేవలం ఒక హీరో పేరు మాత్రమే కాదు ఇది ఒక ప్రభంజనం అన్న విధంగానే చిత్ర పరిశ్రమలో హవా కొనసాగింది. చిరంజీవి కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు ఉన్నాయిChiru{#}Narasimhanaidu;Mrugaraju;Venkatesh;Yuva;Hero;Chiranjeevi;Balakrishna;Cinemaచిరు మృగరాజు డిజాస్టర్.. కానీ ఆ రోజుల్లోనే ఎంత వసూళ్లు వచ్చాయంటే?చిరు మృగరాజు డిజాస్టర్.. కానీ ఆ రోజుల్లోనే ఎంత వసూళ్లు వచ్చాయంటే?Chiru{#}Narasimhanaidu;Mrugaraju;Venkatesh;Yuva;Hero;Chiranjeevi;Balakrishna;CinemaThu, 18 May 2023 09:30:00 GMTమెగాస్టార్ చిరంజీవి 60 ఏళ్లు దాటిపోయిన తర్వాత కూడా ఇంకా యువ హీరోలకు పోటీ ఇస్తూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అంతేకాదు సూపర్ హిట్ లు అందుకుంటూ రికార్డులు సృష్టిస్తున్నాడు. అయితే 60 ఏళ్లు దాటిన తర్వాతే చిరంజీవి క్రేజ్ ఇలా ఉందంటే.. ఇక పాతికేళ్ల ప్రాయంలో చిరంజీవి క్రేజ్ ఏ రేంజ్ లో ఉండి ఉంటుందో మాటల్లో వర్ణించడం చాలా కష్టం. ఇక అప్పట్లో చిరంజీవి అనే పేరు కేవలం ఒక హీరో పేరు మాత్రమే కాదు ఇది ఒక ప్రభంజనం అన్న విధంగానే చిత్ర పరిశ్రమలో హవా కొనసాగింది. చిరంజీవి కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు ఉన్నాయి.



 అదే సమయంలో ఫ్లాప్ లు, డిజాస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే చిరంజీవి కెరియర్ లో ఫ్లాప్ గా మిగిలిపోయిన సినిమా తోటి హీరోల సినిమాతో పోల్చి చూస్తే కలెక్షన్స్ విషయంలో మాత్రం ముందు వరుసలోనే ఉండేది అని అప్పట్లో సినీ పండితులు చెప్పేవారు. అయితే చిరంజీవి కెరియర్ లో పెద్ద డిజాస్టర్ సినిమా ఏది అంటే అందులో మృగరాజు పేరు మొదట గుర్తుకు వస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో మెగాస్టార్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ సినిమా ఒక పీడకల లాంటిది అని చెప్పాలి. అయితే కంటెంట్ పరంగా ఈ సినిమా ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. కానీ కమర్షియల్ గా మాత్రం అప్పట్లో మంచి రికార్డులు సృష్టించిందట మృగరాజు.



 అప్పట్లో చిరంజీవి మృగరాజు సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ నరసింహారాయుడు, విక్టరీ వెంకటేష్ దేవి పుత్రుడు సినిమాలు కూడా ఒకేసారి విడుదలయ్యాయి. అయితే నందమూరి బాలయ్య నరసింహనాయుడు కి ఒక రేంజ్ లో పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ దేవీపుత్రుడు, మృగరాజు సినిమాలకు మాత్రం మొదటి రోజు నుంచే డిజాస్టర్ టాక్ వచ్చింది. అయితే ఫుల్ రన్ లో నరసింహనాయుడు మృగరాజు కంటే ఎక్కువ వసూళ్ళే సాధించింది. కానీ మొదటి రోజు మొదటివారం మరియు మొదటి రెండు వారాల వసూళ్ళల్లో మాత్రం మృగరాజు  కొన్ని సెంటర్లలో నరసింహనాయుడు కంటే ఎక్కువ గ్రాస్ రాబట్టిందట. ఫుల్ రన్ లో మాత్రం మృగరాజుకి 14 కోట్లు నరసింహనాయుడు కి 24 కోట్ల వసూళ్లు వచ్చాయట.



RRR Telugu Movie Review Rating

పవిత్ర తో పెళ్లి పై షాకింగ్ నిజాన్ని బయటపెట్టిన నరేశ్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>