Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/aa-gang-valla-chala-pogottukunnanu-kangana76339807-0243-4443-a600-1a20d830514a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/aa-gang-valla-chala-pogottukunnanu-kangana76339807-0243-4443-a600-1a20d830514a-415x250-IndiaHerald.jpgబీటౌన్ నటి కంగనా రనౌత్ తాజాగా ట్విట్టర్ సీఈఓ ఎలన్ మస్క్ ఇటీవల చేసిన ‘నాకు నచ్చిందే చెప్తాను’ కామెంట్‌ను ప్రశంసించింది. బుధవారం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కంగన మాట్లాడుతూ.. తాను యాంటి నేషనల్స్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల తనకు 25 బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు చేజారిపోయాయని చెప్పింది. ఈ ప్రాజెక్ట్‌ల నుంచి రాత్రికి రాత్రే తొలగించారని.. దీని వల్ల ఏడాదికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని తెలిపింది. విషయానికొస్తే.. ఎలన్ మస్క్ లేటెస్ట్ ఇంటర్వ్యూకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కంగనా షేర్ చేసింది. ‘ఎలన్Socialstars lifestyle {#}p vasu;Hinduism;Corporate;Legend;Kangana Ranaut;wednesday;media;Audience;Chitram;Cinema;Indianఆ గ్యాంగ్ వల్ల చాలా పోగొట్టుకున్నాను ::కంగనఆ గ్యాంగ్ వల్ల చాలా పోగొట్టుకున్నాను ::కంగనSocialstars lifestyle {#}p vasu;Hinduism;Corporate;Legend;Kangana Ranaut;wednesday;media;Audience;Chitram;Cinema;IndianThu, 18 May 2023 23:07:10 GMTబీటౌన్ నటి కంగనా రనౌత్  తాజాగా సోషల్సీ మీడియా సిఈఓ ఎలన్ మస్క్  ఇటీవల చేసిన ‘నాకు నచ్చిందే చెప్తాను’ కామెంట్‌ను ప్రశంసించింది. బుధవారం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కంగన మాట్లాడుతూ.. తాను యాంటి నేషనల్స్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల తనకు 25 బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు  చేజారిపోయాయని చెప్పింది. ఈ ప్రాజెక్ట్‌ల నుంచి రాత్రికి రాత్రే తొలగించారని.. దీని వల్ల ఏడాదికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని తెలిపింది.

విషయానికొస్తే.. ఎలన్ మస్క్ లేటెస్ట్ ఇంటర్వ్యూకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కంగనా షేర్ చేసింది. ‘ఎలన్ మస్క్: నాకు నచ్చిందే చెబుతాను. పర్యవసానంగా డబ్బు కోల్పోయినా పర్వాలేదు’ అనే హెడ్డింగ్‌తో కూడిన ఈ పిక్‌ను షేర్ చేస్తూ కంగన సైతం తన అభిప్రాయాన్ని పంచుకుంది. ‘ఇదీ నా క్యారెక్టర్. హిందుత్వం కోసం.. నిజమైన స్వేచ్ఛ, విజయం కోసం.. రాజకీయ నాయకులు/దేశ వ్యతిరేకులు/తుక్డే గ్యాంగ్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు 20-25 బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ పోయాయి. వారు నన్ను రాత్రికి రాత్రే వదిలేశారు. దీంతో ఏడాదికి రూ. 30-40 కోట్లు నష్టపోయినట్లు తెలిపింది.

ఇప్పుడు భారతదేశ సంస్కృతి, సమగ్రతను ద్వేషించే ఎజెండాతో నడిచే మల్టి నేషనల్ కంపెనీలు, వారి కార్పొరేట్ బ్రాండ్ హెడ్‌ల మాట వినట్లేదు కాబట్టి తాను స్వేచ్ఛగా ఉన్నానని తెలిపింది. నిజానికి ప్రతి ఒక్కరూ బలహీనతలను మాత్రమే ప్రదర్శిస్తారు. అందుకే నేను ఎలన్‌ను అభినందిస్తున్నాను. కనీసం ధనవంతులైనా డబ్బు గురించి పట్టించుకోకూడదు’ అని పేర్కొంది.

ఇదిలా ఉంటే, కంగన.. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో రెగ్యులర్‌గా ఎలన్‌ను ప్రశంసిస్తుంటుది. గతలోనూ ఒక  యూజర్ఇం మీడియా డియన్ డిషెస్‌తో విందు చేస్తున్న ఫొటోను షేర్ చేశారు. దీనికి క్యాప్షన్‌గా ‘నేను బేసిక్ b****** ఇండియన్ ఫుడ్‌ను ప్రేమిస్తున్నాను, ఇది చాలా చాలా బాగుంది’ అని శీర్షిక పెట్టారు. దీనిపై ఎలన్ ‘నిజం’ అంటూ కామెంట్ చేశాడు. అంతేకాదు ‘నువ్వు మరింతగా నచ్చడానికి మాకు ఇంకా ఎన్ని కారణాలు చెబుతావు’ అంటూ ఎమోజీస్ జత చేసింది.

ఇక కంగన ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.. పి వాసు దర్శకత్వంతో ‘చంద్రముఖి 2’ చిత్రంలో కనిపించనుంది. మరొకొద్ది రోజుల్లో కంగనాను ప్రేక్షకులు ‘మణికర్ణిక రిటర్న్స్: ది లెజెండ్ ఆఫ్ దిద్దా, ‘ది అవతార్: సీత’లో కూడా చూడనున్నారు. మరోవైపు ‘తేజస్’ చిత్రంలో కంగన.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రలో నటిస్తోంది. అలాగే తన లిస్టులో పీరియాడికల్ డ్రామా మూవీ ‘ఎమర్జెన్సీ’ కూడా ఉంది. ఇది తను సోలోగా దర్శకత్వం వహించిన చిత్రం కావడం విశేషం.



RRR Telugu Movie Review Rating

ఆ మూవీ ప్రభాస్ ను అంతలా భయపెట్టిందా...?

అన్నీ మంచి శకునములే.. అంతా మంచి లాభాలే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>