Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-e39e387b-d9cb-4b21-a03f-2952a92881fe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-e39e387b-d9cb-4b21-a03f-2952a92881fe-415x250-IndiaHerald.jpgనిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా ఫిల్మ్ 'స్పై'. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి గ్యారీ బీహెచ్ దర్శకుడు. జూన్ 29న ఈ సినిమా విడుదల కానుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమా కథ, కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న 'డెవిల్' కథ ఒకటేననే ఆసక్తికర చర్చ జరుగుతోంది. కళ్యాణ్ రామ్ హీరోగా నవీన్ మేడారం దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'డెవిల్'. ఇందులో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ కనిపించనున్నాడుSocialstars lifestyle {#}chandra bose;chandrabose;Subhas Chandra Bose;Medaram;Press;Chitram;kalyan ram;ram pothineni;Audience;India;June;Cinema;mediaఒకే స్టోరీ లైన్ తో రాబోతున్న రెండు తెలుగు మూవీస్...!!ఒకే స్టోరీ లైన్ తో రాబోతున్న రెండు తెలుగు మూవీస్...!!Socialstars lifestyle {#}chandra bose;chandrabose;Subhas Chandra Bose;Medaram;Press;Chitram;kalyan ram;ram pothineni;Audience;India;June;Cinema;mediaWed, 17 May 2023 11:43:31 GMTనిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా ఫిల్మ్ 'స్పై'. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి గ్యారీ బీహెచ్ దర్శకుడు. జూన్ 29న ఈ సినిమా విడుదల కానుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమా కథ, కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న 'డెవిల్' కథ ఒకటేననే ఆసక్తికర చర్చ జరుగుతోంది.

కళ్యాణ్ రామ్ హీరోగా నవీన్ మేడారం దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'డెవిల్'. ఇందులో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ కనిపించనున్నాడు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ నేపథ్యంలోనే తెరకెక్కుతోందని తెలుస్తోంది. దీంతో 'స్పై', 'డెవిల్' సినిమాల కథ ఒకటేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా ఈ విషయంపై నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు.

'స్పై' టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో తాజాగా మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించి, తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా నిఖిల్ కి మీడియా నుంచి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. "సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ పాయింట్ మీదే 'డెవిల్' సినిమా తీస్తున్నారు. ఆ విషయం తెలుసా మీకు?" అని మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు నిఖిల్ సమాధానమిచ్చాడు. "అది డిఫరెంట్ స్టోరీ. 1900లలో జరిగిన కథ. మాది మోడ్రన్ లో జరిగిన కథ. రెండు సినిమాల టీమ్స్ ఇప్పటికే కథ గురించి మాట్లాడుకున్నారు. రెండూ డిఫరెంట్ గా ఉంటాయి. మీరు రెండు సినిమాలను ఎంజాయ్ చేస్తారు.. అది మాత్రం గ్యారెంటీగా చెప్పగలను" అని నిఖిల్ అన్నాడు.

నిఖిల్ మాటలను బట్టి చూస్తే రెండు సినిమాల పాయింట్ ఒకటే గానీ, సెటప్ వేరుగా ఉంటుందని అర్థమవుతోంది. 1945 లో జరిగిన విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ మరిణించారని ప్రకటించినప్పటికి, ఆయన ప్రమాదం నుంచి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్ళారని పలువురు నమ్ముతారు. ఇదే పాయింట్ తో ఈ రెండు సినిమాలు వస్తున్నాయి అనిపిస్తోంది. అయితే 'డెవిల్' కథ 1945 లో నేతాజీ మిస్ అయిన సమయంలో జరిగినట్టు చూపించే అవకాశముండగా.. 'స్పై'లో మాత్రం ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కొందరు స్పైలు ఆ డెత్ మిస్టరీని ఛేదించే ప్రయత్నం చేసినట్లు చూపించబోతున్నారు అనిపిస్తోంది. ఒకే తరహా పాయింట్ తో రెండు విభిన్న కోణాల్లో వస్తున్న ఈ సినిమాలను ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తారో చూడాలి.



RRR Telugu Movie Review Rating

తరుణ్ గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రోజారమణి...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>