Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janaki1aefb646-c63a-4c10-967e-f0024fad5454-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janaki1aefb646-c63a-4c10-967e-f0024fad5454-415x250-IndiaHerald.jpgనిన్నటి తరం ప్రేక్షకులకు డబ్బింగ్ జానకి అంటే ఎవరో దాదాపు తెలిసే ఉంటుంది . ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది డబ్బింగ్ జానకి. అయితే నేటితరం ప్రేక్షకులకు కూడా ఈమె సుపరిచితురాలు. ఎందుకంటే ప్రస్తుతం సినిమాలకు దూరమైన.. ఈ వయసులో కూడా సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అయితే సౌత్ ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో కలిపి దాదాపు 600కు పైగా చిత్రాల్లో నటించింది డబ్బింగ్ జానకి. ఒక రకంగా చెప్పాలంటే సినిమా నే ఊపిరిగా బ్రతికింది ఆమె. 9 ఏళ్ల వయసులోనే నాటకJanaki{#}Mohandas Karamchand Gandhi;Heroine;Cinemaతినే క్యారేజ్ బాక్స్ ని.. హీరోయిన్ కాలితో తన్నింది : డబ్బింగ్ జానకితినే క్యారేజ్ బాక్స్ ని.. హీరోయిన్ కాలితో తన్నింది : డబ్బింగ్ జానకిJanaki{#}Mohandas Karamchand Gandhi;Heroine;CinemaWed, 17 May 2023 10:00:00 GMTనిన్నటి తరం ప్రేక్షకులకు డబ్బింగ్ జానకి అంటే ఎవరో దాదాపు తెలిసే ఉంటుంది . ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది డబ్బింగ్ జానకి. అయితే నేటితరం ప్రేక్షకులకు కూడా ఈమె సుపరిచితురాలు. ఎందుకంటే ప్రస్తుతం సినిమాలకు దూరమైన.. ఈ వయసులో కూడా సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అయితే సౌత్ ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో కలిపి దాదాపు 600కు పైగా చిత్రాల్లో నటించింది డబ్బింగ్ జానకి. ఒక రకంగా చెప్పాలంటే సినిమా నే ఊపిరిగా బ్రతికింది ఆమె.


 9 ఏళ్ల వయసులోనే నాటక రంగంలోకి అడుగుపెట్టి మెప్పించింది డబ్బింగ్ జానకి. భూకైలాష్ అనే సినిమా ద్వారా వెండితెరపై అడుగు పెట్టింది. అయితే మొదటి సినిమానే సూపర్ హిట్ అవడంతో ఆమెకి వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇక కనీసం మూడు పూటలా తిండి లేక ఆకలితో అలమటించిన రోజుల నుంచి ప్రతి రోజు 700 రూపాయలు  సినిమాకి పారితోషకం తీసుకునే స్థాయికి ఎదిగింది. ఇక అప్పట్లో గాంధీ సినిమాలో కస్తూరిబా పాత్రకి డబ్బింగ్ చెప్పినందుకుగాను ఈమెకు డబ్బింగ్ జానకి అనే పేరు వచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జానకి తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.


 అప్పట్లో ఒక సినిమా షూటింగ్ సమయంలో హీరోయిన్ తో పాటు జానకికి కూడా రూమ్ బుక్ చేశారట చిత్ర బృందం. అయితే ఆమెకు మొదటి నుంచి త్వరగా తిని పడుకునే అలవాటు ఉందట. ఆ సమయంలో ఇక బాక్స్ లో కొంత తిని ఇక నిద్రపోయారట జానకి. అయితే హీరోయిన్ అక్కడికి వచ్చి తాను రాకముందే క్యారేజ్ బాక్స్ ఓపెన్ చేసినందుకు.. కోపంతో క్యారేజ్ బాక్స్ ను కాలితో ఒక్కతన్ను తన్నిందట. కానీ ఆమె అలా ప్రవర్తించినప్పటికీ నేను మాత్రం అవేవీ పట్టించుకోకుండా నా పని తాను చేసుకుపోయాను అంటూ జానకి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.



RRR Telugu Movie Review Rating

తరుణ్ గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రోజారమణి...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>