PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-tdp-chandrababuf81294cd-a312-4e10-9941-3c686ea7433e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-tdp-chandrababuf81294cd-a312-4e10-9941-3c686ea7433e-415x250-IndiaHerald.jpgవైఎస్ ఫ్యామిలి కన్వర్టడ్ క్రిస్తియన్లన్న విషయం అందరికీ తెలుసు. తాము క్రిస్తియన్లని చెప్పుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఏముంది ? ఆనం ఏడుపు ఏమిటంటే విజయవాడలో జరుగుతున్న రాజశ్యామల యాగానికి ప్రభుత్వ ఖర్చులు పెడుతోందట. సమాజ హితంకోసం ప్రభుత్వం తరపున చేస్తున్న యాగం కాబట్టి ఖర్చును ప్రభుత్వమే పెట్టుకుంటోంది ఇందులో తప్పేముంది ? తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు జగన్ వ్యక్తిగతంగా యాగం చేయిస్తు అందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వంతో పెట్టిస్తున్నారట. jagan tdp chandrababu{#}Tirumala Tirupathi Devasthanam;Jagan;TDP;Telangana Chief Minister;Party;Governmentఅమరావతి : జగన్ పై మతకోణంలో కుట్రలు మొదలుపెట్టిందా ?అమరావతి : జగన్ పై మతకోణంలో కుట్రలు మొదలుపెట్టిందా ?jagan tdp chandrababu{#}Tirumala Tirupathi Devasthanam;Jagan;TDP;Telangana Chief Minister;Party;GovernmentWed, 17 May 2023 09:00:00 GMT


ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాదా అందుకనే జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ మతపరమైన కుట్రలు మళ్ళీ మొదలుపెట్టింది. జగన్ తాను హిందువునని బహిరంగంగా ప్రకటించగలరా ? అని చాలెంజ్ చేశారు. పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడుతు ఒకవైపు జగన్ క్రిస్తియన్ అని చెబుతునే మరోవైపు హిందువునని ప్రకటించగలరా అని చాలెంజ్ చేయటంలోనే తెలుస్తోంది వాళ్ళ కుట్ర. జగన్ హిందువైతే ఏమిటి ? క్రిస్తియన్ అయితే ఏమిటి ?





వైఎస్ ఫ్యామిలి కన్వర్టడ్ క్రిస్తియన్లన్న విషయం అందరికీ తెలుసు. తాము క్రిస్తియన్లని చెప్పుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఏముంది ? ఆనం ఏడుపు ఏమిటంటే విజయవాడలో జరుగుతున్న రాజశ్యామల యాగానికి ప్రభుత్వ ఖర్చులు పెడుతోందట. సమాజ హితంకోసం ప్రభుత్వం తరపున చేస్తున్న యాగం కాబట్టి ఖర్చును ప్రభుత్వమే పెట్టుకుంటోంది ఇందులో తప్పేముంది ? తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు జగన్ వ్యక్తిగతంగా యాగం చేయిస్తు అందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వంతో పెట్టిస్తున్నారట.





ఇక్కడ విషయం ఏమిటంటే క్రిస్తియన్ అయిన జగన్ రాజశ్యామల యాగం చేయించటం ఏమిటనేది ఆనం గోల. హిందువైన చంద్రబాబునాయుడు అవసరార్ధం చర్చీలకు, మసీదులకు వెళ్ళి ప్రార్ధనలు చేస్తే సర్వమతం కోసమంటారు. అదే పద్దతిలో ఇపుడు జగన్ కూడా ప్రజలందరు బాగుండాలని, రాష్ట్రం బాగుండాలని యాగం చేయిస్తుంటే క్రిస్తియన్-హిందువు అంటు నానా గోలచేస్తున్నారు.





ఒకపుడు ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత జనాల్లో మైలేజీ పెంచుకునేందుకు, మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు రాష్ట్రంలోని 13 జిల్లాలతో పాటు ఢిల్లీలో నవనిర్మాణ దీక్షలు చేయలేదా ? దానికి టీడీపీ లేదా చంద్రబాబే ఖర్చులు పెట్టుకున్నారా ? అప్పుడు కూడా ప్రభుత్వ డబ్బే కదా వాడింది. పైగా అప్పట్లో టీటీడీ నిధులు కూడా ఖర్చులు చేశారని ఆరోపణలున్నాయి కదా. ముఖ్యమంత్రి హోదాలో ఏ కార్యక్రమం చేసినా అందుకు ప్రభుత్వ డబ్బే వాడుతారు. ప్రభుత్వం చేయిస్తున్న రాజశ్యామల యాగాన్ని తట్టుకోలేక జగన్ క్రిస్తియన్ అని హిందువు కాదంటు గోల మొదలుపెట్టారు. జగన్ కు హిందువులను దూరంచేయాలన్న కుట్రలకు టీడీపీ తెరలేపిందన్న విషయం అర్ధమవుతోంది.





RRR Telugu Movie Review Rating

బాలయ్య సినిమా కోసం.. బిగ్ ప్లాన్ వేసిన డైరెక్టర్ అనిల్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>