HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health3ba6af2f-8b50-429f-85d1-c3e4bed2e38d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health3ba6af2f-8b50-429f-85d1-c3e4bed2e38d-415x250-IndiaHerald.jpgప్రతి రోజు పండ్లని తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఈ పండ్లను తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య దరి చేరకుండా ఉంటుంది. అలాగే పోషకాల లోపం రాకుండా ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ప్రతిరోజూ ఏదో ఒక పండును తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ పండ్లను తీసుకోవడం వల్ల మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వారు చెబుతున్నారు.పండ్లల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల మలబద్దకhealth{#}Cholesterol;Heart;Manamరోజు పండ్లు తింటే ఇంత ఆరోగ్యమా?రోజు పండ్లు తింటే ఇంత ఆరోగ్యమా?health{#}Cholesterol;Heart;ManamWed, 17 May 2023 13:48:31 GMTప్రతి రోజు పండ్లని తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఈ పండ్లను తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య దరి చేరకుండా ఉంటుంది. అలాగే పోషకాల లోపం రాకుండా ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ప్రతిరోజూ ఏదో ఒక పండును తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ పండ్లను తీసుకోవడం వల్ల మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వారు చెబుతున్నారు.పండ్లల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల మలబద్దకం ఇంకా మొలలు వంటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. ఇంకా అదే విధంగా ప్రతిరోజూ పండ్లను తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ పండ్లల్లో ఉండే ప్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను ఇంకా ట్రై గ్లిజరాయిడ్స్ ను తగ్గించడంలో చాలా సహాయపడతాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల మనం బరువు పెరగకుండా ఉండగలము. ఇంకా అలాగే ప్రతిరోజూ పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినన్ని పోషకాలు లభిస్తాయి.


అయితే కొన్ని రకాల పోషకాలను మనం ప్రతిరోజూ శరీరానికి అందిచాల్సి ఉంటుంది. కాబట్టి పండ్లను తీసుకోవడం వల్ల శరీరం కోల్పోయిన పోషకాలను మనం తిరిగి అందిచవచ్చు.పండ్లను తీసుకోవడం వల్ల శరీరం బాగా శుభ్రపడుతుంది. శరీరంలో ఉండే మలినాలు ఇంకా విష పదార్థాలు తొలగిపోతాయి. కాలేయం, మూత్రపిండాలు అలాగే ఊపిరితిత్తులు వంటి ముఖ్యమైన అవయవాలు శుభ్రపడతాయి. పండ్లల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని శుభ్రపరచడంలో బాగా సహాయపడతాయి. ఇంకా అదే విధంగా ప్రతిరోజూ పండ్లను తీసుకోవడం వల్ల వీటిలో ఉండే ప్లేవనాయిడ్స్ ఇంకా పాలీఫినాల్స్ రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. దీంతో చర్మ ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. చర్మ సమస్యలు ఈజీగా దూరమవుతాయి. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.ఇంకా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ప్రతిరోజూ పండ్లను తీసుకోవడం వల్ల మనం ఈ ప్రయోజనాలన్నింటిని సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ప్రతిరోజూ పండ్లను ఆహారంలో భాగంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలని వారు చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆ ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండ వదులు కోవడానికి కారణం....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>