EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/lokesh361cc028-2933-46fc-bab7-42d63d7e7099-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/lokesh361cc028-2933-46fc-bab7-42d63d7e7099-415x250-IndiaHerald.jpgగతంలో టీడీపీలో చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరని అడిగితే లోకేశ్ అని కొంతమంది మాత్రమే చెప్పేవారు. తిని కూర్చోవడం తప్ప లోకేశ్ కు రాజకీయాలు చేతగావని.. చంద్రబాబు లా రాజకీయ చాణక్యుడు కాలేడు అని చాలా మంది విమర్శలు చేసేవారు. అలాంటి వారికి ఇప్పుడు తన యువగళం పాదయాత్రతో విమర్శించిన వారి నోళ్లు మూయిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తర్వాత లోకేశ్ మాత్రమే టీడీపీకి ప్రత్యామ్నాయం అనేలా 1200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల్లోకి దూసుకెళ్లిపోతున్నాడు. అక్కడక్కడ ఉపన్యాసాల్లో తప్పులు దొర్లినా.. వాటిని సవరించుకుlokesh{#}Nara Lokesh;TDP;Yatra;CBN;Jr NTR;NTR;politicsఇక లోకేశ్‌ ఫ్యాన్స్‌లో ఆ భయం పోయినట్టేనా?ఇక లోకేశ్‌ ఫ్యాన్స్‌లో ఆ భయం పోయినట్టేనా?lokesh{#}Nara Lokesh;TDP;Yatra;CBN;Jr NTR;NTR;politicsMon, 15 May 2023 23:00:00 GMTగతంలో టీడీపీలో చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరని అడిగితే లోకేశ్ అని కొంతమంది మాత్రమే చెప్పేవారు.  తిని కూర్చోవడం తప్ప లోకేశ్ కు రాజకీయాలు చేతగావని.. చంద్రబాబు లా రాజకీయ చాణక్యుడు కాలేడు అని చాలా మంది విమర్శలు చేసేవారు. అలాంటి వారికి ఇప్పుడు తన యువగళం పాదయాత్రతో విమర్శించిన వారి నోళ్లు మూయిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తర్వాత లోకేశ్ మాత్రమే టీడీపీకి ప్రత్యామ్నాయం అనేలా 1200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల్లోకి దూసుకెళ్లిపోతున్నాడు.


అక్కడక్కడ ఉపన్యాసాల్లో తప్పులు దొర్లినా.. వాటిని సవరించుకుంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఆయా నియోజకవర్గాల్లో ఉన్న రాజకీయ నాయకుల శైలిని విమర్శిస్తూ వారి పనితనాన్ని ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. ఉపన్యాసం విషయంలో టీడీపీలో  చాలా మందికి లోకేశ్ మాట్లాడుతుంటే ఎక్కడ తప్పులు దొర్లుతాయోనని భయపడేవారు. అలాంటిది ప్రజల్లోకి వెళ్లి మంచి నాయకుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీ కార్యకర్తల్లో అభిమానులు ఎక్కువ. చంద్రబాబు తర్వాత ఎన్టీఆర్ రావాలని చాలా మంది కోరుకుంటున్నారు.


ఇలా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నఎన్టీఆర్ ఎలాగూ పార్టీలో లేరు కాబట్టి  టీడీపీలో ఉన్న ప్రజా ప్రతినిధులు మాత్రం లోకేశ్ వైపు చూస్తున్నారు. లోకేశ్ ను తమ నాయకుడిగా ఊహించుకుంటున్నారు. వారాహి యాత్ర నారావారి యాత్ర రెండు ఒకసారి ప్రారంభమయ్యాయి. అయితే వారాహి యాత్ర ఆగిపోయింది. కానీ నారా లోకేశ్ యువగళం యాత్ర మాత్రం 1200 కిలోమీటర్లు పూర్తి చేసుకుని ముందుకు సాగుతోంది.


ఈ సందర్భంగా అలూరు దగ్గర 1200 కిలోమీటర్ల మైలు రాయి వేశారు. మిడుతూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఈ శిలాఫలకం వేశారు. ఎత్తిపోతల ద్వారా మిడుతూరు, కలమండం, మాదిగుండం, పారామంచలా గ్రామాల వారికి తాగునీరు ఇస్తాం, 60 వేల మందికి తాగునీరు, 20 వేల మందికి సాగు నీరు ఇస్తామనే వివరాలతో ఈ ప్రాంతంలో శిలాఫలకం వేశారు.



RRR Telugu Movie Review Rating

కాజల్ అగర్వాల్ హవ తగ్గిపోయిందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>