MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijayacca3457-2c49-4dd4-8d88-106ef28a2bc5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijayacca3457-2c49-4dd4-8d88-106ef28a2bc5-415x250-IndiaHerald.jpgతమిళ స్టార్ తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లియో.ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.తమిళ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో పతాకంపై ఎస్‌ ఎస్‌ లలిత్‌కుమార్‌ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇక ఇందులో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌, అర్జున్‌, కదిర్‌, మన్సూర్‌ అలీఖాన్‌, దర్శకుడు మిష్కిన్‌, గౌతమ్‌ మీనన్‌ ఇంకా మలయాళం నటుడు మ్యాథ్యూ థామస్‌ వంటి నటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.మాస్టర్‌ వంటి సూపర్ హిట్ చిత్రం తరువVIJAY{#}gowtam;Joseph Vijay;Darsakudu;Chitram;News;Trisha Krishnan;Tamil;Blockbuster hit;Director;Cinemaలియో: డబుల్ రోల్ లో తలపతి?లియో: డబుల్ రోల్ లో తలపతి?VIJAY{#}gowtam;Joseph Vijay;Darsakudu;Chitram;News;Trisha Krishnan;Tamil;Blockbuster hit;Director;CinemaMon, 15 May 2023 19:07:32 GMTలియో : డబుల్ రోల్ లో తలపతి?

తమిళ స్టార్ తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లియో.ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.తమిళ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో పతాకంపై ఎస్‌ ఎస్‌ లలిత్‌కుమార్‌ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇక ఇందులో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌, అర్జున్‌, కదిర్‌, మన్సూర్‌ అలీఖాన్‌, దర్శకుడు మిష్కిన్‌, గౌతమ్‌ మీనన్‌ ఇంకా మలయాళం నటుడు మ్యాథ్యూ థామస్‌ వంటి నటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.మాస్టర్‌ వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత విజయ్‌, లోకేష్‌ కనకరాజ్‌ కాంబోలో రూపొందుతున్న లియో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికి కొంత షూటింగ్‌ కూడా పూర్తయింది. ప్రస్తుత ఈ సినిమా షూటింగ్‌ చైన్నెలో ముమ్మరంగా జరుగుతోంది. 20 రోజుల పాటు జరిగే ఈ చిత్ర షూటింగ్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఇంకా క్లైమాక్స్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు యూనిట్‌ వర్గాలు తెలిపాయి. 


లియో సినిమాని అక్టోబర్‌ 19వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాలో విజయ్‌ రెండు గెటప్‌లలో కనిపించబోతున్నట్లు తాజాగా సమాచారం తెలుస్తుంది.ఒకటి లియో అనే గ్యాంగ్‌స్టర్‌ గెటప్‌ కాగా, మరొకటి చాక్లెట్లు తయారు చేసే పార్తీపన్‌ అనే సాధారణ యువకుడు గెటప్‌లో కూడా కనిపించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. అయితే ఇందులో విజయ్‌ రెండు గెటప్‌లలో కనిపిస్తారా, లేక రెండు పాత్రలో నటిస్తున్నారా..? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమాకి తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్‌ సంగీతాన్ని ఇంకా మనోజ్‌ పరమహంస ఛాయాగ్రహణం అందిస్తున్నారు.ఈ కాంబినేషన్ పై అభిమానుల్లో ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

ఆ విషయంలో రాజమౌళి గ్రేట్ అంటున్న నెటిజన్స్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>