HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/coriander-seeds-usescd48d7fc-6828-45f4-af24-7c22dd9f6562-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/coriander-seeds-usescd48d7fc-6828-45f4-af24-7c22dd9f6562-415x250-IndiaHerald.jpgభారతీయ వంటకాల్లో ధనియాలకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ఇందులో ఉన్న సుగుణాలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి.ముఖ్యంగా పరగడుపున ధనియాల నీరు త్రాగడం ఉత్తమం.ధనియాల నీరు తాగడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. డీ హైడ్రేట్.. వేసవిసీజన్ లో ధనియాల నీరు మనకి అమృతం అని చెప్పవచ్చు.దీనిని తరుచూ త్రాగడం వల్ల,శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది.అలాగే,నీరసంతో బాధపడేవారు తీసుకోవడం వల్ల,వారికి తాజాదనాన్ని మరియు తక్షణశక్తిని అందిస్తుంది.వేసవిలో క్రమం తప్పకుండCORIANDER SEEDS;USES{#}Coffee;Shakti;Vitaminధనియాల నీరుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా..?ధనియాల నీరుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా..?CORIANDER SEEDS;USES{#}Coffee;Shakti;VitaminSun, 14 May 2023 06:00:00 GMTభారతీయ వంటకాల్లో ధనియాలకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ఇందులో ఉన్న సుగుణాలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి.ముఖ్యంగా పరగడుపున ధనియాల నీరు త్రాగడం ఉత్తమం.ధనియాల నీరు తాగడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

డీ హైడ్రేట్..
వేసవిసీజన్ లో ధనియాల నీరు మనకి అమృతం అని చెప్పవచ్చు.దీనిని తరుచూ త్రాగడం వల్ల,శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది.అలాగే,నీరసంతో బాధపడేవారు తీసుకోవడం వల్ల,వారికి తాజాదనాన్ని మరియు తక్షణశక్తిని అందిస్తుంది.వేసవిలో క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా ఉత్తమం.

అధిక బరువు..
ధనియాల నీరు అధికబరువు తగ్గించడంలో సహాయపడుతుంది.మరియు గుండెఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.పొట్ట చుట్టూ కొవ్వుతో బాధపడేవారు వారు రోజూ ధనియాల నీటిని తాగటం వల్ల,ఇది చెడుకొలెస్ట్రాల్ ను ఈజీగా కరిగించుకోవచ్చు.

జీర్ణ సమస్యలు..
ధనియాల నీటిని తరుచు తీసుకోవడం వల్ల,పొట్టసమస్యలకు విరుగుడుగా పని చేస్తుంది. ముఖ్యంగా గ్యాస్,అజీర్ణం,ఉబ్బరం వంటి ఇతర సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది.దీన్ని పరగడుపున తీసుకోవడం వల్ల,మలబద్ధకం వంటి సమస్యలను తొందరగా తగ్గించుకోవచ్చు.

చర్మ సమస్యలు..
ఈ నీటిని రోజువారి డైట్ లో భాగంగా తీసుకోవడం వల్ల కూడా చర్మ సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. ఇందులో యాంటీ ఫంగల్ మరియు యాంటీబ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.ఇది చర్మంపై జిడ్డును తొలగించి,శుభ్రంగా ఉంచడంలో చాలా బాగా సహాయపడుతుంది.ఈ నీటిని రోజూ తీసుకుంటే మొటిమలు మచ్చలు కూడా అదుపులో ఉంటాయి.

ఆర్థరైటిస్ నొప్పులు..
కీళ్ళు లేదా ఆర్థరైటిస్ నొప్పితో ఇబ్బందిపడేవారు క్రమం తప్పకుండా ధనియాల నీటిని తాగితే,ఇందులోనే ఆంటీ ఇన్ఫల్మషన్ గుణాలు,నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.ధనియాల నీరు శరీరంలో మెటబాలిజం రేటును పెంచుతుంది.దీనిని తరచూ తీసుకోవడం వల్ల,బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చు.

రోగనిరోధక శక్తి..
ఇందులో విటమిన్ ఎ,విటమిన్ సి,పైబర్ పోషకాలను పుష్కలంగా లభిస్తాయి.ధనియాల పొడిని చాలా ఇళ్లలో టీ మరియు కాఫీ చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ధనియాల నీటిని తరుచు తీసుకోవడం వల్ల,రోగనిరోధక శక్తి పెరుగుతుంది.మరియు రోగనిరోధక శక్తి సీజనల్ వ్యాధుల నుండి కాపాడుతుంది



RRR Telugu Movie Review Rating

ఢిల్లీ : ‘నిన్ హైడ్రేట్’ వల్ల ఏమన్నా లాభముందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>