ViralDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/apcm-pregnant-ladies4cb248d1-d91a-4686-8500-c363063748a9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/apcm-pregnant-ladies4cb248d1-d91a-4686-8500-c363063748a9-415x250-IndiaHerald.jpgతాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా శిశు మరణాల రేటును తగ్గించడానికి తల్లి ఆరోగ్యాన్ని పెంచడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే గర్భిణీ స్త్రీల కోసం ఒక వినూత్నమైన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపోతే మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో ఇలా తాజాగా గర్భిణీ స్త్రీల కోసం మరొక సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలోని గర్భిణీలకు అత్యాధునిక టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్ (టిఫా) స్కానింగ్ సేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. అయితAPCM;PREGNANT LADIES{#}Doctor;Arogyasri;Y. S. Rajasekhara Reddy;Pregnant;Andhra Pradesh;sree;Governmentగర్భిణీ స్త్రీల కోసం కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం..!గర్భిణీ స్త్రీల కోసం కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం..!APCM;PREGNANT LADIES{#}Doctor;Arogyasri;Y. S. Rajasekhara Reddy;Pregnant;Andhra Pradesh;sree;GovernmentSun, 14 May 2023 15:59:10 GMTతాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా శిశు మరణాల రేటును తగ్గించడానికి తల్లి ఆరోగ్యాన్ని పెంచడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే గర్భిణీ స్త్రీల కోసం ఒక వినూత్నమైన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపోతే మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో ఇలా తాజాగా గర్భిణీ స్త్రీల కోసం మరొక సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలోని గర్భిణీలకు అత్యాధునిక టార్గెటెడ్
 ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్ (టిఫా) స్కానింగ్ సేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. అయితే ఈ స్కాన్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం కార్డుదారులైన పేద,మధ్యతరగతి కుటుంబాలకు చెందిన గర్భిణీ స్త్రీలకు ఉచితంగా అందించబోతున్నారు.

ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గతంలో అందిస్తున్న చికిత్సను ఇప్పుడు భారీగా విస్తరింప చేసి అనేక మార్పులు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పలు రకాల జబ్బులను కూడా ఈ పథకం పరిధిలోకి చేర్చింది రాష్ట్ర ప్రభుత్వం. అదే సమయంలో నవరత్నాలతో పాటు అనేక సంక్షేమ పథకాలు మహిళలకు అందిస్తున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఈ నిర్ణయాన్ని ప్రకటించడం హర్షదాయకమని చెప్పాలి.  ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు చేసే పరీక్షలను ఉచితంగా అందించాలని అందులోనూ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద అందివ్వడం నిజంగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు భారీ ఊరట కలుగుతోందని చెప్పవచ్చు.

ఇకపోతే ఈ టిఫా స్కాన్ కోసం ఏపీ ప్రభుత్వం రూ.1100, అల్ట్రా సోనోగ్రామ్ స్కాన్ కు రూ.250 చొప్పున ఖర్చు చేయబోతోంది. అయితే ఈ స్కానింగ్ పరీక్షలను గర్భం దాల్చిన 18 నుంచీ 22 వారాల గర్భస్థ దశలో మాత్రమే నిర్వహిస్తారు.  లేకపోతే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులలో లబ్ధిదారులైన గర్భిణీలకు ఏదైనా సమస్యలు ఉంటే వైద్యుల సూచన మేరకు ఈ టిఫా స్కాన్ ,2 అల్ట్రా సోనోగ్రామ్ పరీక్షలను ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇక ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని వారికి కేవలం 3 అల్ట్రా సోనోగ్రామ్ స్కాన్లు మాత్రమే చేస్తారు. అయితే ఈ స్కానింగ్లు చేయించుకోవడానికి ముందుగా ఆన్లైన్లో నమోదు చేసుకునే వీలుగా కసరత్తు ను కూడా పూర్తి చేయడం జరిగింది.



RRR Telugu Movie Review Rating

ఓటీటి లోకి రాబోతున్న నాగచైతన్య కస్టడీ చిత్రం..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>