Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/social-stars-life-style4975ba1a-646d-432d-9950-0595c6d4b0de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/social-stars-life-style4975ba1a-646d-432d-9950-0595c6d4b0de-415x250-IndiaHerald.jpgపుష్ప సినిమా ఐటమ్ సాంగ్ "ఊ అంటావా మావ ఊ ఊ అంటావా' పాటలో సమంత అద్భుతంగా డ్యాన్స్‌ చేసిందని నటి కృతిశెట్టిఅన్నారు. అయితే తాను అలాంటి పాటలు చేయడానికి ఆసక్తిగా లేనని వెల్లడించింది. 'కస్టడీ' ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కృతిశెట్టిని.. ''ఊ అంటావా మావ' వంటి స్పెషల్‌ సాంగ్‌లో మీకు అవకాశం వస్తే చేస్తారా?'' అని విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా స్పందించింది. ''ప్రస్తుతానికి నేను అలాంటివి అస్సలు అంగీకరించాలనుకోవడం లేదు. దానిపై నాకు ఎలాంటి అవగాహన కూడా లేదు. ఎప్పుడూ కూడా అస్సలు ఆలోచింsocial stars life style{#}Naga Chaitanya;Samantha;Cinemaఅలాంటి పాటల్లో నటించాలని అనుకోవడం లేదు : కృతి శెట్టిఅలాంటి పాటల్లో నటించాలని అనుకోవడం లేదు : కృతి శెట్టిsocial stars life style{#}Naga Chaitanya;Samantha;CinemaSat, 13 May 2023 15:59:08 GMTపుష్ప సినిమా ఐటమ్ సాంగ్ "ఊ అంటావా మావ ఊ ఊ అంటావా' పాటలో సమంత అద్భుతంగా డ్యాన్స్‌ చేసిందని నటి కృతిశెట్టిఅన్నారు.

అయితే తాను అలాంటి పాటలు చేయడానికి ఆసక్తిగా లేనని వెల్లడించింది. 'కస్టడీ' ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కృతిశెట్టిని.. ''ఊ అంటావా మావ' వంటి స్పెషల్‌ సాంగ్‌లో మీకు అవకాశం వస్తే చేస్తారా?'' అని విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా స్పందించింది.

''ప్రస్తుతానికి నేను అలాంటివి అస్సలు అంగీకరించాలనుకోవడం లేదు. దానిపై నాకు ఎలాంటి అవగాహన కూడా లేదు. ఎప్పుడూ కూడా అస్సలు ఆలోచించలేదు. ఇప్పటివరకూ నా సినీ ప్రయాణంలో నేను తెలుసుకున్నది ఒక్కటే. సౌకర్యంగా అనిపించనప్పుడు చేయకపోవడ మే మంచిది. ఇక, ఆ పాటలో సమంత అద్భుతంగా అయితే డ్యాన్స్‌ చేశారు. ఆమె ఒక ఫైర్‌'' అని కూడా అన్నారు. అనంతరం ఆమె 'శ్యామ్‌ సింగరాయ్‌' గురించి మాట్లాడుతూ.. ''శ్యామ్‌ సింగరాయ్‌'లోని కొన్ని రొమాంటిక్‌ సీన్స్‌లో నేను వంద శాతం మనస్ఫూర్తిగా అయితే నటించలేకపోయాను. హార్ట్‌ఫుల్‌గా చేయాలనిపించనప్పుడు వాటిని చేయకపోవడమే బెటర్‌ అనే విషయాన్ని కూడా అప్పుడే తెలుసుకున్నా. భవిష్యత్తులోనూ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని ముందుకు సాగుతా'' అని కృతిశెట్టి చెప్పుకొచ్చిందట.

ఇక, ఇదే ఇంటర్వ్యూలో నాగచైతన్య గురించి మాట్లాడుతూ.. ''చైతన్యతో ఇది నా రెండో ప్రాజెక్ట్‌. ఆయన చాలా మంచి వ్యక్తి అని పరిశ్రమలో ఆయనే నాకు స్ఫూర్తి అని ఏదైనా విషయంలో నాకు సందేహం వస్తే వెంటనే ఆయనకే ఫోన్‌ చేసి నేను సలహాలు అడుగుతాను. ''నన్ను అస్సలు అడగవద్దు'' అని అంటూనే ఆయన మంచి సలహాలను ఇస్తుంటారు'' అని తెలిపింది కృతి శెట్టి.కస్టడీ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా నాగచైతన్య కెరీర్ లోనే పెద్ద హిట్ అవుతుందని చెప్పుకొచ్చింది. తనకు కూడా మంచి హిట్ లభిస్తుంది అని కృతి చెప్పుకొచ్చింది.



RRR Telugu Movie Review Rating

ఆ విషయంలో అల్లు అర్జున్, సమంత ఇద్దరూ ఒక్కటే : నందిని రెడ్డి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>