EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/usacfd05ad4-b085-49d4-847b-0d443c4e7e3e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/usacfd05ad4-b085-49d4-847b-0d443c4e7e3e-415x250-IndiaHerald.jpgఅమెరికాలో ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే నెలలోపు ఆర్ఠిక సంక్షోభం ముదిరిపోనుంది. అప్పులు ఎంత వరకు తీసుకోవచ్చో ఉభయ సభలు నిర్ణయించాయి. దాని ప్రకారం బ్యాంకుల నుంచి అమెరికా లో 31.4 ట్రిలియన్ డాలర్ల అప్పు తీసుకోవచ్చు. దాని కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువగా అప్పు చేయరాదని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నెలాఖరులోపు జీతాలు చెల్లించాలన్న, బిల్లులు కట్టాలన్న, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలన్నా 31. 4 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ జీతాలు చెల్లించాలి. అయిUSA{#}American Samoa;Republican Party;Newsఅమెరికాను ఆర్థిక సంక్షోభం ముంచెత్తనుందా?అమెరికాను ఆర్థిక సంక్షోభం ముంచెత్తనుందా?USA{#}American Samoa;Republican Party;NewsSat, 13 May 2023 09:00:00 GMTఅమెరికాలో ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే నెలలోపు ఆర్ఠిక సంక్షోభం ముదిరిపోనుంది. అప్పులు ఎంత వరకు తీసుకోవచ్చో ఉభయ సభలు నిర్ణయించాయి. దాని ప్రకారం బ్యాంకుల నుంచి అమెరికా లో  31.4 ట్రిలియన్ డాలర్ల అప్పు తీసుకోవచ్చు. దాని కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువగా అప్పు చేయరాదని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు.


అయితే ఈ నెలాఖరులోపు జీతాలు చెల్లించాలన్న, బిల్లులు కట్టాలన్న, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలన్నా 31. 4 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ జీతాలు చెల్లించాలి. అయితే దీనికి అమెరికా చట్ట సభలో చేసిన తీర్మానం అడ్డుపడుతోంది. ప్రస్తుతం 31.4 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువనే అప్పు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అప్పు 35 ట్రిలియన్ డాలర్ల వరకు పెంచాలి.


దీన్ని పెంచాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ కోరుతున్నారు. అయితే అమెరికాలోని దిగువ సభలో బైడెన్ కు సంఖ్య తగ్గింది. దిగువ సభలో రిపబ్లికన్ పార్టీలోని ట్రంపు వర్గానికి ఎక్కువ సభ్యులు ఉన్నారు. ఇప్పుడు వారు ఒప్పుకుంటేనే ఎక్కువ అప్పు వస్తుంది. లేకుంటే అమెరికాలో ఆర్థిక సంక్షోభం ముంచుకు రానుంది. డెమొక్రాట్లు అర్జంటుగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. వచ్చే నెలలో ఆసుపత్రుల బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి వస్తుందని డెమొక్రాట్లు అంటున్నారు. కానీ రిపబ్లికన్లు దానికి ఒఫ్పుకోవడం లేదు.


బైడెన్ వచ్చి మాతో చర్చలు జరిపితేనే దానికి మేం అంగీకరిస్తామని రిపబ్లికన్లు చెబుతున్నారు. 1960 నుంచి ఎనిమిది సార్లు ఈ స్థితి వచ్చింది. చిట్ట చివరి కి అమెరికాను అగ్రస్థానంలో నిలపడానికే అందరూ ట్రై చేశారు. కానీ ఇప్పుడు రిపబ్లికన్ చేతుల్లో అమెరికా ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయి. ప్రతిపక్ష రిపబ్లికన్లు ఓకే చేస్తేనే ఎక్కువ అప్పులు వచ్చి సంక్షోభం నుంచి బయటపడతారు. అయితే డెమొక్రాట్లకు రిపబ్లికన్ పార్టీ వారు ఒక రకంగా భయపెడుతున్నారు. ఏం జరుగుతుందో చివరి వరకు చూడాలి.



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ : హైదరాబాద్ లో టెన్షన్ టెన్షన్




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>