Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl509da377-cca2-4a9a-a394-c830bb51f44f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl509da377-cca2-4a9a-a394-c830bb51f44f-415x250-IndiaHerald.jpgసాధారణంగా రాజకీయాల్లో, సినిమాల్లో వారసులు ఎంట్రీ ఇవ్వడం చూస్తూ ఉంటాం. సినిమాల్లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారి వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి రాణిస్తూ ఉంటారు. ఇక రాజకీయాల్లో కీలక పదవుల్లో కొనసాగుతున్న వారి వారసులు కూడా పాలిటిక్స్ లోకి రావడం చేస్తూ ఉంటారు. అయితే క్రీడల్లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. స్టార్ క్రికెటర్ల పిల్లలు ఇక తండ్రుల్లాగానే క్రికెట్ ని ప్రొఫెషన్ గా ఎంచుకొని ముందుకు సాగుతూ ఉంటారు. ఇప్పటికే సచిన్ కొడుకు అర్జున్ క్రికెట్లో రాణిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే స్టారIpl{#}you tube;Piyush Chawla;Athadu;Arjun;Cricket;Mumbaiనా కొడుకు కోసం.. 20 కోట్లు పక్కన పెట్టుకోండి : పియూష్ చావ్లానా కొడుకు కోసం.. 20 కోట్లు పక్కన పెట్టుకోండి : పియూష్ చావ్లాIpl{#}you tube;Piyush Chawla;Athadu;Arjun;Cricket;MumbaiSat, 13 May 2023 08:23:51 GMTసాధారణంగా రాజకీయాల్లో, సినిమాల్లో వారసులు ఎంట్రీ ఇవ్వడం చూస్తూ ఉంటాం. సినిమాల్లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారి వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి రాణిస్తూ ఉంటారు. ఇక రాజకీయాల్లో కీలక పదవుల్లో కొనసాగుతున్న వారి వారసులు కూడా పాలిటిక్స్ లోకి రావడం చేస్తూ ఉంటారు. అయితే క్రీడల్లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. స్టార్ క్రికెటర్ల పిల్లలు ఇక తండ్రుల్లాగానే క్రికెట్ ని ప్రొఫెషన్ గా ఎంచుకొని ముందుకు సాగుతూ ఉంటారు. ఇప్పటికే సచిన్ కొడుకు అర్జున్ క్రికెట్లో రాణిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.



 అయితే స్టార్ స్పిన్నర్ ఫియూస్ చావ్ల సైతం తన కొడుకు త్వరలో క్రికెట్లో అడుగు పెట్టబోతున్నాడు అంటూ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అంటూ అశ్విన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం లేటు వయసులో కూడా ముంబై ఇండియన్స్ తరఫున సత్తా చాటుతూ ఉన్నాడు చావ్లా. అయితే బౌలర్ కొడుకు బౌలర్ అవుతాడు. కానీ  చావ్లా మాత్రం తన కొడుకుని బౌలర్ అవ్వకుండా చూసుకుంటాను అని నాతో చెప్పాడు అంటూ ఈ విషయాన్ని రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ లో పంచుకున్నాడు. నాతో పీయూష్ చావ్లా అన్నాడు.. నా ఏడేళ్ల తనయుడు.. ప్రతి క్రికెట్ మ్యాచ్ చూస్తాడు. నా కొడుక్కి క్రికెట్ అంటే ఇష్టం.



 అయితే ఇక తన కొడుకు ఒక్కడే క్రికెట్ మ్యాచ్ చూడడమే కాదు.. మ్యాచ్ వస్తుందంటే చాలు ఇంట్లో ఉన్న అందరిని కూడా సోఫాలో కూర్చోబెడతాడు. నేనేమో నా కొడుకుని బౌలర్ కావొద్దు అంటూ ఎప్పుడూ చెబుతూ ఉంటాను. అతడు బంతి ముట్టుకుంటే చేతి మీద కొడతా. ఎందుకంటే అతను బ్యాట్స్మెన్ కావాలనేదే నా కల. అతనికి ప్రతిరోజు కూడా శిక్షణ ఇప్పిస్తున్న. నెట్స్ లో నేనే బౌలింగ్ చేస్తా. ఇప్పుడు ఐపీఎల్ లో నేను బౌలింగ్ చేస్తున్నందుకు 50 లక్షలు ఇస్తున్నారు. ఒకవేళ అతను మంచి బ్యాట్స్మెన్ గా మారితే మాత్రం ఓ పదేళ్లలో 20 కోట్లు అయినా ఇస్తారు. నా కొడుకు కోసం 20 కోట్లు పక్కన పెట్టుకోండి అంటూ ముంబై ఇండియన్స్ కు చెప్పాను అని చావ్లా తనతో అన్నాడని అశ్విన్ ఇటీవల తన యూట్యూబ్ ఛానల్ లో వెల్లడించాడు.



RRR Telugu Movie Review Rating

ఉ అంటావా మావ లాంటి పాటలను.. నేను అస్సలు చేయను : కృతిశెట్టి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>