MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/game-changer3eedcde5-983e-43c3-a2fe-60415ebf412c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/game-changer3eedcde5-983e-43c3-a2fe-60415ebf412c-415x250-IndiaHerald.jpgమన తెలుగు డైరెక్టర్లు పాన్ ఇండియా రేంజ్ లో సందడి చేస్తున్న సంగతి తెల్సిందే. తెలుగులో సినిమాలు చేస్తే ఖచ్చితంగా పాన్ ఇండియా స్థాయి లో పాపులారిటీ వస్తుందనే ఉద్దేశ్యంతో కొంతమంది తమిళ దర్శకులు తెలుగు లో సినిమాలు చేసేందుకు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు.తాజాగా తమిళ దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు చేస్తున్నారు.తమిళ హీరోలతో తెలుగు దర్శకులు కూడా సినిమాలు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని పర్వాలేదు అన్నట్లుగా ఉంటే కొన్ని మాత్రం నిరాశ పరిచాయి.అయితే తెలుగు హీరోలతో మాత్రం తమిళ దర్శకులు చేస్తున్న సినిమాలు బాక్సాGAME CHANGER{#}dhanush;vamsi paidipally;Blockbuster hit;anand shankar;GEUM;shankar;naga;Pawan Kalyan;mahesh babu;ram pothineni;Variar;Chitram;vijay deverakonda;venkat prabhu;Telugu;Tamil;Darsakudu;Success;Director;India;Cinemaగేమ్ చేంజర్: ఆ సెంటిమెంట్ ని శంకర్ బ్రేక్ చేస్తాడా?గేమ్ చేంజర్: ఆ సెంటిమెంట్ ని శంకర్ బ్రేక్ చేస్తాడా?GAME CHANGER{#}dhanush;vamsi paidipally;Blockbuster hit;anand shankar;GEUM;shankar;naga;Pawan Kalyan;mahesh babu;ram pothineni;Variar;Chitram;vijay deverakonda;venkat prabhu;Telugu;Tamil;Darsakudu;Success;Director;India;CinemaSat, 13 May 2023 17:31:00 GMTఇండియా రేంజ్ లో సందడి చేస్తున్న సంగతి తెల్సిందే. తెలుగులో సినిమాలు చేస్తే ఖచ్చితంగా పాన్ ఇండియా స్థాయి లో పాపులారిటీ వస్తుందనే ఉద్దేశ్యంతో కొంతమంది తమిళ దర్శకులు తెలుగు లో సినిమాలు చేసేందుకు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు.తాజాగా తమిళ దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు చేస్తున్నారు.తమిళ హీరోలతో తెలుగు దర్శకులు కూడా సినిమాలు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని పర్వాలేదు అన్నట్లుగా ఉంటే కొన్ని మాత్రం నిరాశ పరిచాయి.అయితే తెలుగు హీరోలతో మాత్రం తమిళ దర్శకులు చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. గత కొన్నాళ్లుగా తమిళ దర్శకులు తెలుగు హీరోలతో చేస్తున్న సినిమాలు అన్ని కూడా ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి.పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన 'స్పైడర్' సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.


అలాగే విజయ్ దేవరకొండ హీరో గా తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ద్వి భాష చిత్రం నోటా కూడా బాగా నిరాశ పరిచింది. ఇక రామ్ హీరో గా లింగు స్వామి దర్శకత్వంలో వచ్చిన ది వారియర్ సినిమా కూడా ఫ్లాప్ గానే నిలిచిన విషయం తెల్సిందే.ఇక నాగ చైతన్యతో చేసిన కస్టడీ సినిమాతో తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కస్టడీ సినిమా కూడా  నిరాశ పరిచింది. కస్టడీ సినిమా ఫ్లాప్ తో తమిళ దర్శకులు తెలుగు లో సక్సెస్ అవ్వలేరు అనే సెంటిమెంట్ ఇంకా కంటిన్యూ అవుతోంది.తెలుగులో ప్రస్తుతం తమిళ స్టార్ దర్శకుడు శంకర్ కూడా ఒక సినిమాను చేస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమాపై అభిమానులు టెన్షన్ గా ఉన్నారు. మరి ఈ సినిమాతో శంకర్ ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడేమో చూడాలి.దర్శకుడు శంకర్ తెలుగు తో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను రిచ్ గా రూపొందిస్తున్నాడు.

కానీ తెలుగు దర్శకులు మాత్రం తమిళ హీరోలతో సినిమాలు చేసి హిట్లు కొడుతున్నారు. తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి విజయ్ కి "వారిసు" లాంటి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ని ఇచ్చాడు. ఇక యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కూడా ధనుష్ కి "సార్" లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని ఇచ్చాడు. ఈ రెండు సినిమాలు తమిళనాడుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వసూళ్ళని నమోదు చేసాయి. కానీ తమిళ డైరెక్టర్లు మాత్రం మన తెలుగు హీరోలకి ప్లాప్స్ ఇస్తున్నారు. ఈసారి శంకర్ ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి.


RRR Telugu Movie Review Rating

ఆ విషయంలో అల్లు అర్జున్, సమంత ఇద్దరూ ఒక్కటే : నందిని రెడ్డి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>