EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan789a88dd-7b71-44fa-ad09-db532c2f9828-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan789a88dd-7b71-44fa-ad09-db532c2f9828-415x250-IndiaHerald.jpgవైయస్ జగన్మోహన్ రెడ్డి గత ఎలక్షన్లో అత్యధిక స్థానాల్లో గెలుపొంది రికార్డు సృష్టించారు. అయితే ఇదే తరహా విజయం వచ్చే ఎలక్షన్లో కూడా వస్తుందా అంటే కొన్ని లెక్కల ప్రకారం అయితే కష్టమని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు వ్యతిరేకించే వర్గాల లెక్క అది అని తెలుస్తుంది. మరి ఎవరు ఆ వ్యతిరేకించే వర్గం అంటే ఆ లెక్కలోకి చాలామంది కనిపిస్తున్నారు. ఆయన వ్యతిరేకించే వర్గంలో మొట్టమొదటిగా సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కనిపిస్తున్నారు. టికెట్ రేట్ల విషయంలో, అదనపు షోల విషయంలో గతంలో ఆయన చేసిన రూల్స్ వల్ల సిJAGAN{#}Janasena;Yevaru;Cinema;Government;Jagan;Reddyజగన్‌కు.. ఆ మూడు వర్గాలు చుక్కలు చూపిస్తారా?జగన్‌కు.. ఆ మూడు వర్గాలు చుక్కలు చూపిస్తారా?JAGAN{#}Janasena;Yevaru;Cinema;Government;Jagan;ReddySat, 13 May 2023 00:00:00 GMTవైయస్ జగన్మోహన్ రెడ్డి గత ఎలక్షన్లో అత్యధిక స్థానాల్లో గెలుపొంది రికార్డు సృష్టించారు. అయితే ఇదే తరహా విజయం వచ్చే ఎలక్షన్లో కూడా వస్తుందా అంటే కొన్ని లెక్కల ప్రకారం అయితే కష్టమని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు వ్యతిరేకించే వర్గాల లెక్క అది అని తెలుస్తుంది. మరి ఎవరు ఆ వ్యతిరేకించే వర్గం అంటే ఆ లెక్కలోకి చాలామంది కనిపిస్తున్నారు.


ఆయన వ్యతిరేకించే వర్గంలో మొట్టమొదటిగా సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కనిపిస్తున్నారు. టికెట్ రేట్ల విషయంలో, అదనపు షోల విషయంలో గతంలో ఆయన చేసిన రూల్స్ వల్ల సినిమా వాళ్లు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. అప్పటినుండి ఆయన పై సినిమా ఇండస్ట్రీలో కొంత వ్యతిరేకత అనేది పెరిగిందని తెలుస్తుంది. అలాగని ఆయనను అభిమానించే వాళ్లు కూడా సినిమా ఇండస్ట్రీలో లేకపోలేదు. వ్యతిరేకించే వాళ్ళు తక్కువ ఉన్నా సరే వాళ్ళ అభిమానులు ఓటింగ్ టైంలో ఇన్ఫ్లూయన్స్ అవుతారని తెలుస్తుంది.


ఇక గవర్నమెంట్ ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి ఐఆర్ 18 నుండి తాను వస్తే 27 కి పెంచుతానాని చెప్పారు గతంలో. కానీ దాన్ని 23 కే సెటిల్ చేశారు ఇప్పుడు. అంతేకాకుండా ఉద్యోగుల డ్యూటీ టైం విషయంలో ఫోటోలు తీయడం, సరిగ్గా జాబ్స్ చేసుకోమని చెప్పడం వీటిపై కూడా వాళ్ళు గుర్రుగా ఉన్నారని తెలుస్తుంది. జీతాలు ఫస్ట్ తారీఖున పడకపోవడం, పెన్షన్లు కూడా సరిగ్గా అందకపోవడంతో వాళ్లు కొంత అసంతృప్తితో ఉన్నారని తెలుస్తుంది.


ఇక రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే బ్రోకర్ నుండి బిల్డర్ వరకు ఆయనపై అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇసుక రేట్లు పెరగడం, వాళ్ల బిజినెస్ సరిగ్గా జరగకపోవడంతో వాళ్లు కూడా తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నట్లుగా తెలుస్తుంది. గతంలో భారతీయ జనతా పార్టీ, జనసేన వర్గాలలోని టిడిపిని వ్యతిరేకించే వాళ్ళు జగన్ కి ఓట్లు వేసి మరి గెలిపించారు. కానీ ఈసారి ఆ అవకాశం ఉండదని తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

క్లీవేజ్ అందంతో మతి పోగుడుతున్న తెలుగమ్మాయి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>