Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/social-strs-life-stylede419a94-1975-43d2-a03b-497898e347f9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/social-strs-life-stylede419a94-1975-43d2-a03b-497898e347f9-415x250-IndiaHerald.jpgబెల్లంకొండ శ్రీనివాస్ గురించి మనందరికీ బాగా తెలుసు.అల్లుడు శీను సినిమాతో హీరోగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాతో భారీగా పాపులారిటీని అయితే సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాత ఎక్కువ సినిమాలలో మాత్రం నటించలేకపోయాడు బెల్లంకొండ శ్రీనివాస్. తెలుగులో నటించిన తక్కువ సినిమాలే అయినప్పటికీ కూడా హీరోగా మంచి గుర్తింపుని కూడా ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా నటించిన చిత్రం ఛత్రపతి. ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేsocial strs life style{#}Varsham;Chatrapathi;Chitram;Remake;bellamkonda sai sreenivas;srinivas;Prabhas;prema;bollywood;Love;Blockbuster hit;Tollywood;Hindi;Telugu;Cinemaబాలీవుడ్ ప్రేక్షకులకు థాంక్స్ చెప్పిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్...!!బాలీవుడ్ ప్రేక్షకులకు థాంక్స్ చెప్పిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్...!!social strs life style{#}Varsham;Chatrapathi;Chitram;Remake;bellamkonda sai sreenivas;srinivas;Prabhas;prema;bollywood;Love;Blockbuster hit;Tollywood;Hindi;Telugu;CinemaSat, 13 May 2023 16:16:48 GMTబెల్లంకొండ శ్రీనివాస్  గురించి మనందరికీ బాగా తెలుసు.అల్లుడు శీను సినిమాతో హీరోగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాతో భారీగా పాపులారిటీని అయితే సంపాదించుకున్నాడు.

కానీ ఆ తర్వాత ఎక్కువ సినిమాలలో మాత్రం నటించలేకపోయాడు బెల్లంకొండ శ్రీనివాస్. తెలుగులో నటించిన తక్కువ సినిమాలే అయినప్పటికీ కూడా హీరోగా మంచి గుర్తింపుని కూడా ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా నటించిన చిత్రం ఛత్రపతి. ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేశాడట బెల్లంకొండ శ్రీనివాస్.

ప్రభాస్  నటించిన ఈ ఛత్రపతి సినిమా అప్పట్లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇకపోతే బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ఛత్రపతి సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా నిన్న అనగా మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ అయితే వినిపిస్తోంది. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందు బెల్లంకొండ శ్రీనివాస్ వరుసగా ఇంటర్వ్యూలకు హాజరైన సంగతి తెలిసిందే. అంతేకాకుండా బాలీవుడ్ పై భారీగా ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ..

నేను ఇప్పటి వరకు నటించిన తెలుగు సినిమాలను హిందీ ఆడియన్స్ బాగా ఆదరించారు. వారంతా నా మీద చూపిస్తున్న ప్రేమ అభిమానాలకు చాలా కృతజ్ఞతలు. అందుకే పూర్తి స్థాయి సినిమాని వారికీ అందిచాలనుకున్నాను. దానికోసం ఛత్రపతి సినిమాను నేను రీమేక్ చేశాను. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులకు దగ్గరవ్వాలని నటీనటులంతా కూడా అనుకుంటారు. అలా జరగాలంటే హిందీ సినిమా ఒక్కటే మార్గం. 2015లో ఉత్తమ నటుడిగా నేను ఫిల్మ్ ఫేర్ అవార్డు ను కూడా గెలుచుకున్నాను. ఇప్పుడు మళ్లీ ఈ సినిమాకు కూడా అందుకుంటానని చెప్పుకొచ్చాడు.. టాలీవుడ్ కి చెందిన ఎంతో మంది నటీనటులు బాలీవుడ్ లో విజయం సాధించారు. అ క్కడ కూడా అభిమానులను వారు సొంతం చేసుకున్నారు. నేనూ అదే ట్రెండ్ను అయితే కొనసాగిస్తాను అని చెప్పుకొచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్. కాగా ఛత్రపతి సినిమా కంటే ముందు బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన కొన్ని సినిమాలను బాలీవుడ్ లోకి డబ్బింగ్ చేసిన సంగతి తెలిసిందే. తన డబ్బింగ్ సినిమాలతో అభిమానులను సొంతం చేసుకున్నాడు.



RRR Telugu Movie Review Rating

ఆ విషయంలో అల్లు అర్జున్, సమంత ఇద్దరూ ఒక్కటే : నందిని రెడ్డి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>