HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health51fc9736-77ac-45a2-aaea-2aff2afc34a9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health51fc9736-77ac-45a2-aaea-2aff2afc34a9-415x250-IndiaHerald.jpgఇక మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో తోక మిరియాలు కూడా ఒకటి. వీటిని వివిధ రకాల మసాలా వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ తోక మిరియాలను చలువ మిరియాలు అని, ఇంగ్లీష్ లో టెయిల్డ్ పెప్పర్ అని అంటారు. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఆస్థమాను నివారించడంలో ఇవి చాలా అద్భుతంగా పని చేస్తాయి.ఇంకా అలాగే జలుబు, దగ్గు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఇవి చాలా చక్కగా ఉపయోగపడతాయి. అర టీ స్పూన్ తోక మిరియాలకు పటికhealth{#}Jaggery;Cholesterol;Manam;Masalaతోక మిరియాలు: ఆరోగ్యానికి బోలెడు లాభాలు..?తోక మిరియాలు: ఆరోగ్యానికి బోలెడు లాభాలు..?health{#}Jaggery;Cholesterol;Manam;MasalaFri, 12 May 2023 14:35:00 GMTఇక మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో తోక మిరియాలు కూడా ఒకటి. వీటిని వివిధ రకాల మసాలా వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ తోక మిరియాలను చలువ మిరియాలు అని, ఇంగ్లీష్ లో టెయిల్డ్ పెప్పర్ అని అంటారు. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఆస్థమాను నివారించడంలో ఇవి చాలా అద్భుతంగా పని చేస్తాయి.ఇంకా అలాగే జలుబు, దగ్గు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఇవి చాలా చక్కగా ఉపయోగపడతాయి. అర టీ స్పూన్ తోక మిరియాలకు పటిక బెల్లం కలిపి వాటిని పొడిగా చేయాలి.ఇక ఈ పొడిని రోజుకు రెండు పూటలా తీసుకోవడం వల్ల మూత్రంలో మంట సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది. ఇంకా అలాగే మొలల సమస్యను తగ్గించడంలో కూడా ఈ తోక మిరియాలు మనకు చాలా బాగా సహాయపడతాయి. ఈ అర టీ స్పూన్ తోక మిరియాల పొడిని ఒక గ్లాస్ వేడి పాలల్లో కలిపి తీసుకోవాలి. ఇలా రోజుకు రెండు పూటలా తీసుకోవడం వల్ల మొలల సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది. ఇక మలబద్దకం సమస్య ఉన్నవారు ఇందులోనే త్రిఫలా చూర్ణాన్ని కలిపి తీసుకోవాలి.


ఈ విధంగా తీసుకోవడం వల్ల మొలల సమస్య నుండి ఈజీగా ఉపవమనం కలుగుతుంది. అలాగే అర టీ స్పూన్ తోక మిరియాల పొడిలో తేనె కలిపి మూడుపూటలా తీసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా వేధిస్తున్న దగ్గు ఈజీగా తగ్గుతుంది.ఇంకా అలాగే ఈ పొడిని తరచూ వాసన చూస్తూ ఉంటే జలుబు చాలా త్వరగా తగ్గుతుంది.తోక మిరియాలను నోట్లో వేసుకుని నములుతూ ఉండడం వల్ల నోటి దుర్వాసన ఇంకా అలాగే నోట్లో పుండ్లు వంటి సమస్యలు చాలా ఈజీగా తగ్గుతాయి. ఇంకా అలాగే తగిన మోతాదులో ఈ తోక మిరియాలను వాడడం వల్ల మన శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ కూడా వేగవంతం అవుతుంది. శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి. అలాగే తోక మిరియాలతో చేసిన కషాయాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల నోటి సమస్యలు చాలా సింపుల్ గా తగ్గుతాయి. దంతాలు కూడా చాలా ధృడంగా తయారవుతాయి. ఈ విధంగా తోక మిరియాలు మనకు చాలా బాగా ఉపయోగపడతాయని వీటిని తగిన మోతాదులో వాడడం వల్ల మనం మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆ స్టార్ హీరో కూతురిని దారుణంగా అవమానించిన బాలయ్య..!?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>