MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-pawan-sai-dharam-tej-movie-ki-english-titlee54fc3d5-2dd3-475a-8b41-5d422f9ca106-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-pawan-sai-dharam-tej-movie-ki-english-titlee54fc3d5-2dd3-475a-8b41-5d422f9ca106-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో త్వరలోనే ఓ మెగా మల్టీస్టారర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. తమిళంలో హిట్ అయిన 'వినోదయ సీతం' అన్ని సినిమాని దర్శకుడు సముద్రఖని పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ లతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ రీమేక్ కి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఫిబ్రవరి నుండి షూటింగ్ మొదలవగా.. రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ కి సంబంధించPawan Kalyan And Sai Tej{#}priya prakash varrier;sai dharam tej;teja;trivikram srinivas;Remake;February;Posters;media;Darsakudu;kalyan;News;Directorపవన్ - సాయి ధరమ్ తేజ్ మూవీకి ఇంగ్లీష్ టైటిల్..?పవన్ - సాయి ధరమ్ తేజ్ మూవీకి ఇంగ్లీష్ టైటిల్..?Pawan Kalyan And Sai Tej{#}priya prakash varrier;sai dharam tej;teja;trivikram srinivas;Remake;February;Posters;media;Darsakudu;kalyan;News;DirectorFri, 12 May 2023 17:01:44 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో త్వరలోనే ఓ మెగా మల్టీస్టారర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. తమిళంలో హిట్ అయిన 'వినోదయ సీతం' అన్ని సినిమాని దర్శకుడు సముద్రఖని పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ లతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్రీమేక్ కి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఫిబ్రవరి నుండి షూటింగ్ మొదలవగా.. రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేశారు. దాదాపు షూటింగ్ కూడా చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. 

ఇక మిగిలిన షూటింగ్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి జూలై 28న ఈ సినిమాని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ రీమేక్ సంబంధించిన టైటిల్ గురించి ఇప్పటికే ఎన్నో రకాల వార్తల వినిపించాయి.ఈ సినిమాకి దేవర, దేవుడే దిగి దిగివచ్చిన, కాలుడు అనే టైటిల్స్ ఇప్పటికే తెరపైకి వచ్చాయి. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఈ టైటిల్స్ పై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో రాబోతున్న ఈ మెగా మల్టీ స్టారర్ కి ఓ ఇంగ్లీష్ టైటిల్ ని కన్ఫర్మ్ చేశారట. ఈ చిత్రానికి 'బ్రో '(BRO) అనే టైటిల్ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఇదే టైటిల్ ని తాజాగా ఫిలిం ఛాంబర్ లో కూడా రిజిస్టర్ చేయించారట. ఇక టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని మే మూడో వారంలో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సాయి తేజ ని బ్రో అని పిలుస్తాడట. అందుకే ఈ టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టైటిల్ గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మెగా ఫాన్స్ అయితే ఈ టైటిల్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ టైటిల్ ఏమాత్రం బాలేదంటూ ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు కూడా పెడుతున్నారు. మరి ఫాన్స్ కోరిక మేరకు వేరే టైటిల్ ని పెడతారా? లేక ఇదే టైటిల్ ని కన్ఫర్మ్ చేస్తారా? అనేది చూడాలి...!!



RRR Telugu Movie Review Rating

ఖుషి : ఆ ముగ్గురి జాతకాలను మారుస్తుందా..?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>