MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan8910a1f3-8f5f-4a37-aa2d-e0e42dec5c4b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan8910a1f3-8f5f-4a37-aa2d-e0e42dec5c4b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ అగ్ర హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. అతి తక్కువ సమయంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అప్పట్లో యూత్లో పవన్ కళ్యాణ్ కి ఉండే క్రేజే వేరు. తొలిప్రేమ,తమ్ముడు, బద్రి, ఖుషి వంటి సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ కి యూత్లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. దీంతో సినిమాలతో పాటు అప్పుడు కొన్ని యాడ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించడం పవన్ కళ్యాణ్. ముఖ్యంగా అప్పట్లో సౌత్ ఇండియా మPawan Kalyan{#}Chiranjeevi;kushi;Kushi;India;kalyan;Manam;Hero;Cinema;News20 ఏళ్ల క్రితం పెప్సీ యాడ్ కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?20 ఏళ్ల క్రితం పెప్సీ యాడ్ కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?Pawan Kalyan{#}Chiranjeevi;kushi;Kushi;India;kalyan;Manam;Hero;Cinema;NewsFri, 12 May 2023 17:37:32 GMTటాలీవుడ్ అగ్ర హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. అతి తక్కువ సమయంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అప్పట్లో యూత్లో పవన్ కళ్యాణ్ కి ఉండే క్రేజే వేరు. తొలిప్రేమ,తమ్ముడు, బద్రి, ఖుషి వంటి సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ కి యూత్లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. దీంతో సినిమాలతో పాటు అప్పుడు కొన్ని యాడ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించడం పవన్ కళ్యాణ్. ముఖ్యంగా అప్పట్లో సౌత్ ఇండియా మొత్తంలోనే పెప్సీ యాడ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన మొట్టమొదటి హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే. 

అతని తర్వాత చిరంజీవి థమ్సప్ కూల్ డ్రింక్ యాడ్ చేశాడు. ఇక పవన్ కళ్యాణ్ ఫోటో చూసి అప్పట్లో పెప్సీ కూల్ డ్రింక్స్ సేల్స్ ఓ రేంజ్ లో ఉండేవి. అయితే అప్పట్లోనే పవన్ కళ్యాణ్ కి  ఈ పెప్సి యాడ్ లో నటించినందుకుగాను ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారట. నిజానికి అప్పట్లో ఓ అగ్ర హీరో ఒక సినిమా చేస్తే రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు మాత్రమే రెమ్యూనరేషన్ గా ఇచ్చేవారు. అలాంటిది అప్పట్లో పవన్ కళ్యాణ్ కేవలం ఒక్క నిమిషం యాడ్ చేసినందుకే కోటి రూపాయలకు పైగా పారితోషకం ఇచ్చారంటే ఆ రోజుల్లో ఆయన క్రేజ్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు కమర్షియల్ యాడ్ చేస్తున్న హీరోలకు కేవలం కోటి నుంచి రెండు కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. కానీ ఇదే రెమ్యునరేషన్ ని 20 సంవత్సరాల కింద పవన్ కళ్యాణ్ అందుకోవడం విశేషం. అయితే ఈ యాడ్ చేసిన తర్వాత కూల్ డ్రింక్స్ లో విష పదార్థాలు కలుస్తున్నాయని కూల్ డ్రింక్స్ తాగడం వల్లే చాలామంది చనిపోతున్నారని వార్తలు రావడంతో పవన్ కళ్యాణ్ యాడ్స్ లో నటించడం మానేశాడు. ఇక 20 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ కి ఏ రేంజ్ లో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఇప్పటికి కూడా అదే కంటిన్యూ అవుతూ ఉండడం విశేషం. ఇక ఈ మధ్య రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి...!!



RRR Telugu Movie Review Rating

ఖుషి : ఆ ముగ్గురి జాతకాలను మారుస్తుందా..?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>