HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health7bf774d4-7d39-4387-8745-29edf149e5d6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health7bf774d4-7d39-4387-8745-29edf149e5d6-415x250-IndiaHerald.jpgనువ్వులను మనం వంటల్లో ఉపయోగించడం వల్ల వంటల రుచి పెరగడంతో పాటు మనకు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. నువ్వుల నుండి తీసిన నూనెను కూడా ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే చాలా పోషకాలు ఉన్నాయి. నువ్వులు మనకు తెలుపు ఇంకా నలుపు రంగుల్లో లభిస్తూ ఉంటాయి. ఇవి రెండు కూడా ఔషధ గుణాలను ఇంకా పోషకాలను కలిగి ఉన్నాయి. నువ్వుల్లో ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి చాలా పోషకాలు ఉన్నాయి. నువ్వులను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్health{#}Iron;Ayurveda;Manamనువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు అంతాఇంత కాదు?నువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు అంతాఇంత కాదు?health{#}Iron;Ayurveda;ManamFri, 12 May 2023 15:05:00 GMTనువ్వులను మనం వంటల్లో ఉపయోగించడం వల్ల వంటల రుచి పెరగడంతో పాటు మనకు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. నువ్వుల నుండి తీసిన నూనెను కూడా ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే చాలా పోషకాలు ఉన్నాయి. నువ్వులు మనకు తెలుపు ఇంకా నలుపు రంగుల్లో లభిస్తూ ఉంటాయి. ఇవి రెండు కూడా ఔషధ గుణాలను ఇంకా పోషకాలను కలిగి ఉన్నాయి. నువ్వుల్లో ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి చాలా పోషకాలు ఉన్నాయి. నువ్వులను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది.అలాగే నువ్వులను, బెల్లాన్ని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య కూడా చాలా ఈజీగా తగ్గుతుంది. వీటిలో ఐరన్ రక్తహీనతను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. వీటిని కలిపి తీసుకోవడం వల్ల స్త్రీలల్లో నెలసరి సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి. ఎదిగే పిల్లలకు నువ్వులను తప్పకుండా ఆహారంలో  ఇవ్వాలి. ఎందుకంటే నువ్వులను ఆహారంగా ఇవ్వడం వల్ల పిల్లల్లో ఎదుగుదల చక్కగా ఉంటుంది. శరీరం చాలా ధృడంగా తయారవుతుంది.


అదే విధంగా ప్రతి రోజూ ఉదయం ఒక టీ స్పూన్ నువ్వులను నోట్లో వేసుకుని నమిలి తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా జుట్టు సమస్యలతో బాధపడే వారు నువ్వులను తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.నువ్వుల్లో ఉండే పోషకాలు జుట్టును ఒత్తుగా, నల్లగా ఇంకా అలాగే ధృడంగా ఉంచడంలో సహాయపడతాయి.అలాగే ఈ నువ్వుల నూనెను వంటల్లో వాడడం వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఈ నూనెను రోజూ స్నానం చేయడానికి 10 నిమిషాల ముందు శరీరానికి రాసుకుని ఎండలో కూర్చోని ఆ తరువాత వేడి నీటితో స్నానం  చేయడం వల్ల చర్మ సమస్యలు త్గగడంతో పాటు మళ్ళీ అవి రాకుండా ఉంటాయి. అలాగే శరీరం కూడా చాలా బలంగా తయారవుతుంది. నువ్వులు ఈ విధంగా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని వీటిని తప్పకుండా ఏదో ఒక రూపంలో ప్రతిరోజూ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే నువ్వులను తీసుకునే ముందు వీటిని కొద్దిగా వేయించి తీసుకోవడం వల్ల పైత్యం చేయకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆ స్టార్ హీరో కూతురిని దారుణంగా అవమానించిన బాలయ్య..!?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>