EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/bjp8a4f1e66-2877-45aa-9549-73509f0d8089-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/bjp8a4f1e66-2877-45aa-9549-73509f0d8089-415x250-IndiaHerald.jpgరాజస్థాన్ ఎన్నికలు దాదాపు ఏడాది లోపే ఉన్నాయి. అంతలోపే అక్కడ రాజకీయ దుమారం కాంగ్రెస్ లో మళ్లీ మొదలైంది. గతంలో ఎన్నికల్లో గెలిచిన తర్వాత అశోక్ గెహ్లట్, సచిన్ పైలెట్ మధ్య సీఎం కుర్చీ వివాదం రాజుకుంది. అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం పిలిచి ఇద్దరిని కన్విన్స్ చేసి అశోక్ గెహ్లట్ ను సీఎం గా ప్రకటించింది. సీనియర్ కే ప్రాధాన్యతనిచ్చింది. కానీ సచిన్ పైలెట్ కారణంగానే కాంగ్రెస్ గెలిచిందనే టాక్ రాజస్తాన్ లో వచ్చింది. మధ్య ప్రదేశ్ లో కూడా జ్యోతిరాధిత్య సిందియా కు సంబంధించిన విషయంలో సీఎం పదవి ఇస్తామని చెప్పిBJP{#}ashok;Rahul Gandhi;Vasundhara Raje;CM;contract;local language;central government;Punjab;Party;Bharatiya Janata Party;Congress;rahul;Rahul Sipligunj;Electionsరాజస్థాన్‌లో కమలం కోవర్ట్‌ ఆపరేషన్‌ ఫలిస్తుందా?రాజస్థాన్‌లో కమలం కోవర్ట్‌ ఆపరేషన్‌ ఫలిస్తుందా?BJP{#}ashok;Rahul Gandhi;Vasundhara Raje;CM;contract;local language;central government;Punjab;Party;Bharatiya Janata Party;Congress;rahul;Rahul Sipligunj;ElectionsFri, 12 May 2023 10:00:00 GMTరాజస్థాన్ ఎన్నికలు దాదాపు ఏడాది లోపే ఉన్నాయి. అంతలోపే అక్కడ రాజకీయ దుమారం కాంగ్రెస్ లో మళ్లీ మొదలైంది. గతంలో ఎన్నికల్లో గెలిచిన తర్వాత అశోక్ గెహ్లట్, సచిన్ పైలెట్ మధ్య సీఎం కుర్చీ వివాదం రాజుకుంది. అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం పిలిచి ఇద్దరిని కన్విన్స్ చేసి అశోక్ గెహ్లట్ ను సీఎం గా ప్రకటించింది. సీనియర్ కే ప్రాధాన్యతనిచ్చింది.


కానీ సచిన్ పైలెట్ కారణంగానే కాంగ్రెస్ గెలిచిందనే టాక్ రాజస్తాన్ లో  వచ్చింది.  మధ్య ప్రదేశ్ లో కూడా జ్యోతిరాధిత్య సిందియా కు సంబంధించిన విషయంలో సీఎం పదవి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ఇవ్వలేదు. దీంతో విసిగి వేసారిపోయిన జ్యోతిరాధిత్య సింధియా బీజేపీ లో చేరి కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. ఇలాంటి ఘటనల వల్లే పంజాబ్ కాంగ్రెస్ లో అధికారంలో ఉన్న పార్టీ కాస్త నామరూపాల్లేకుండా చిత్తు చిత్తుగా ఓడి పోయింది.


అంటే పంజాబ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లాంటి ఇంపార్టెన్స్ ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ తనకు తానే ఓటమి దిశగా కొనసాగుతోంది. ఇదే సమయంలో ఆయా ప్రాంతాల్లో బీజేపీ పుంజుకుంటోంది. అశోక్ గెహ్లట్ కు వ్యతిరేకంగా సచిన్ ఫైలెట్ రోడ్డెక్కారు. రాహుల్ గాంధీ పర్యటన ఉన్న సమయంలో నిరసనకు దిగడం ఇక్కడ సంచలనంగా మారింది. సోనియా, రాహుల్ చెప్పినా కూడా వినని పరిస్థితి.. బీజేపీ రాజస్తాన్ లో కీలక విజయం సాధించింది. స్థానిక లోకల్ బాడీ ఎన్నికల్లో 14 స్థానాల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది.


కాంగ్రెస్ కేవలం 4 స్థానాలకే పరిమితమైంది. ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎక్కడా కూడా కాంగ్రెస్ ఓడిపోలేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనకబడటం ఊహించని పరిణామం. అలాగే సచిన్ పైలెట్ వసుంధర రాజే తో ఉన్న ఒప్పందం ప్రకారమే ఇలాా చేస్తున్నారని కాంగ్రెస్ లోని అశోక్ గెహ్లట్ వర్గం ఆరోపణలు చేస్తోంది.



RRR Telugu Movie Review Rating

ఆ స్టార్ హీరోని ఘాడంగా ప్రేమించిన సౌందర్య.. కానీ..!?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>