MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopichand3a12cd5a-84a4-4bf4-b864-49fd98f0ff4d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopichand3a12cd5a-84a4-4bf4-b864-49fd98f0ff4d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ గత కొంతకాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్నాడు. ఈసారి ఎలాగైనా గట్టి కం బ్యాక్ ఇవ్వాలని తనకు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందించిన దర్శకుడు శ్రీవాస్ తో హ్యాట్రిక్ మూవీ చేశాడు. వీరిద్దరి కాంబినేషన్లో ఇటీవల వచ్చిన 'రామబాణం' ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కంప్లీట్ ఫ్యామిలీ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో జగపతిబాబు, కుష్బూ, శుభలేఖ సుధాకర్, అలీ, నాజర్ వంటి అగ్ర నటీనటులు సైతం నటించారు. మే 5న విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుందిGopichand{#}Kumaar;Kannada;Box office;Darsakudu;Success;vegetable market;Hero;Director;Cinema'రామబాణం' ప్లాప్ తో గోపిచంద్ సంచలన నిర్ణయం..?'రామబాణం' ప్లాప్ తో గోపిచంద్ సంచలన నిర్ణయం..?Gopichand{#}Kumaar;Kannada;Box office;Darsakudu;Success;vegetable market;Hero;Director;CinemaFri, 12 May 2023 16:05:00 GMTటాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ గత కొంతకాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్నాడు. ఈసారి ఎలాగైనా గట్టి కం బ్యాక్ ఇవ్వాలని తనకు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందించిన దర్శకుడు శ్రీవాస్ తో హ్యాట్రిక్ మూవీ చేశాడు. వీరిద్దరి కాంబినేషన్లో ఇటీవల వచ్చిన 'రామబాణం' ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కంప్లీట్ ఫ్యామిలీ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో జగపతిబాబు, కుష్బూ, శుభలేఖ సుధాకర్, అలీ, నాజర్ వంటి అగ్ర నటీనటులు సైతం నటించారు. మే 5న విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద రామబాణం భారీ ప్లాప్ ను మూట గట్టుకుంది. 

ఇక ఈ సినిమాతో గోపీచంద్ ఇమేజ్ తో పాటు మార్కెట్ కూడా భారీగా పడిపోయింది. ఇక రామబాణం ప్లాప్ తో గోపీచంద్ తాజాగా ఓసంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే.. ప్రస్తుతం తాను తీసుకుంటున్న రెమ్యూనరేషన్ లో ఏకంగా సగం తగ్గించుకోవాలని డిసైడ్ అయ్యాడట గోపీచంద్. తనతో సన్నిహితంగా ఉండే నిర్మాతల సూచన మేరకే గోపీచంద్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. ఓ మంచి హిట్ పడేంత వరకు రెమ్యునరేషన్ తగ్గించుకుంటే మంచిదని, హిట్టు వస్తే ఆ తర్వాత నిర్మాతలే ఎక్కువ మొత్తం ఆఫర్ చేస్తారని గోపీచంద్ ఈ డెసిషన్ తీసుకున్నారట.

ప్రస్తుతం గోపీచంద్ ఒక్క సినిమాకు 15 నుంచి 20 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక రామబాణం ప్లాప్ తో తన రెమ్యూనరేషన్లో సగం తగ్గించుకోవడంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఈ హీరో సుమారు 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇక రామబాణం తర్వాత గోపీచంద్ ప్రజెంట్ హర్ష అనే దర్శకుడి తో ఓ సినిమా చేస్తున్నాడు  కన్నడ అగ్ర హీరో శివరాజ్ కుమార్ తో 'వేద' సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ఈ డైరెక్టర్ ఇప్పుడు గోపీచంద్ తో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది...!!



RRR Telugu Movie Review Rating

ఖుషి : ఆ ముగ్గురి జాతకాలను మారుస్తుందా..?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>