AutoPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/epluto-7g-pro2fd8162e-8195-4ef5-be84-e60b0c840577-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/epluto-7g-pro2fd8162e-8195-4ef5-be84-e60b0c840577-415x250-IndiaHerald.jpgప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్ ధరలు తట్టుకోలేక మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఈవీ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో స్టార్టప్ కంపెనీల దగ్గర నుంచి టాప్ కంపెనీల దాకా ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ ఈవీ స్కూటర్లతో వినియోగదారులను పలుకరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఈవీ రంగంలో అమ్మకాల్లో దూసుకుపోతున్నాయి. వీటిగా పోటీగా కొన్ని కంపెనీలు వస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈవీ కంపెనీ ఓలాకు పోటీగా ప్యూర్ ఈవీ కంపెనీ ఈప్లూటో 7 జీ ప్రో పేరుతో ఓ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ ని రిలీజ్ చేసింది. సూపర్ డిజైన్‌తో అధePluto 7G Pro{#}Petrol;NewsePluto 7G Pro: సింపుల్ డిజైన్.. సూపర్ ఫీచర్స్?ePluto 7G Pro: సింపుల్ డిజైన్.. సూపర్ ఫీచర్స్?ePluto 7G Pro{#}Petrol;NewsFri, 12 May 2023 18:14:36 GMTప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్ ధరలు తట్టుకోలేక  మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఈవీ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో స్టార్టప్ కంపెనీల దగ్గర నుంచి టాప్ కంపెనీల దాకా ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ ఈవీ స్కూటర్లతో వినియోగదారులను పలుకరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఈవీ రంగంలో అమ్మకాల్లో దూసుకుపోతున్నాయి. వీటిగా పోటీగా కొన్ని కంపెనీలు వస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈవీ కంపెనీ ఓలాకు పోటీగా ప్యూర్ ఈవీ కంపెనీ ఈప్లూటో 7 జీ ప్రో పేరుతో ఓ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ ని రిలీజ్ చేసింది. సూపర్ డిజైన్‌తో అధునాతన ఫీచర్లతో ఉన్న ఈ స్కూటర్ కచ్చితంగా వినియోగదారులని ఆకట్టుకుంటుందని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఈ స్కూటర్ బుకింగ్స్‌ను కంపెనీ తమ వెబ్‌సైట్‌లో ఓపెన్ చేయడం జరిగింది. అలాగే బుక్ చేసుకున్న కస్టమర్లకు మే నెలాఖరకు మొదటి బ్యాచ్ స్కూటర్లను అందిస్తామని కంపెనీ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక ఇప్లూటో 7 జీ ప్రో స్కూటర్ ధర ఫీచర్ల గురించి  తెలుసుకుందాం.


ఇక ఈవీ ప్యూర్ కంపెనీ రిలీజ్ చేసిన ఇప్లూటో 7 జీ ప్రో ధర రూ.94,999(ఎక్స్ షోరూమ్)గా ఉంటుందని కంపెనీ వర్గాలు తెలుపుతున్నాయి. అలాగే ఇప్పటికే ఉన్న ఇప్లూటో 7 జీ స్కూటర్ లాగా ఈ స్కూటర్‌ కూడా రెట్రో డిజైన్‌తో వస్తుందని తెలుస్తోంది. ఇంకా అలాగే బాడీ ప్యానెల్‌తో పాటు ఎల్ఈడీ లైట్లు కూడా 7 జీలానే ఉంటాయని కంపెనీ రిలీజ్ చేసిన చిత్రాలను బట్టి తెలుస్తుంది. మ్యాట్ బ్లాక్, గ్రే, వైట్ రంగుల్లో ఈ స్కూటర్ అందరికీ అందుబాటులో ఉంటుందని సమాచారం తెలుస్తోంది. 3.0 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో పాటు స్మార్ట్ బీఎంఎస్‌తో వచ్చే ఈ స్కూటర్‌లో మూడు వేర్వేరు మోడ్స్ కూడా ఉంటాయి. ఇంకా అలాగే ఈ స్కూటర్ ఓ సారి చార్జి చేస్తే 100-150 కిలో మీటర్ల మైలేజ్‌ను కూడా ఇస్తుంది. ఈ స్కూటర్ 2.4 కేడబ్ల్యూ కంట్రోల్ యూనిట్‌తో 1.5 కేడబ్ల్యూ మోటర్‌తో వస్తుందని కంపెనీ వర్గాలు తెలుపుతున్నాయి. ఇంకా అలాగే ఈ స్కూటర్ లాంచ్ అయిన మొదటి నెలలోనే రెండు వేలకు పైగా బుకింగ్స్ ఆశిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు.



RRR Telugu Movie Review Rating

ఖుషి : ఆ ముగ్గురి జాతకాలను మారుస్తుందా..?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>