EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jaganede57300-ffd1-4b01-b95d-6b7f18d2de61-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jaganede57300-ffd1-4b01-b95d-6b7f18d2de61-415x250-IndiaHerald.jpgరాజకీయాలు ప్రజాస్వామ్య యుతంగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవాలి. కానీ వైసీపీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అనుభవించిన స్వేచ్ఛ ప్రస్తుతం టీడీపీ నాయకులకు ఇవ్వడం లేదు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార టీడీపీ వారికి సంబంధించిన పాదయాత్రలకు అనుమతినిచ్చింది. వారు ఎక్కడ సభలు సమావేశాలు పెట్టుకున్న కాదని అనలేదు. కాబట్టి ఇబ్బంది పడలేదు. కానీ రాజకీయంగా చేసిన విమర్శలను మంత్రులు, ఎమ్మెల్యేలు తిప్పి కొట్టేవారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఎక్కడ సమావేశం ఏర్పాటు చేసిన వైసీపీ నాయకులు నల్ల బెలూన్లతో నిJAGAN{#}CBN;Jagan;Nara Lokesh;politics;TDP;Party;YCPజగన్‌.. ఈ పద్ధతి మార్చుకోవాల్సిందే?జగన్‌.. ఈ పద్ధతి మార్చుకోవాల్సిందే?JAGAN{#}CBN;Jagan;Nara Lokesh;politics;TDP;Party;YCPFri, 12 May 2023 11:00:00 GMTరాజకీయాలు ప్రజాస్వామ్య యుతంగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవాలి. కానీ వైసీపీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అనుభవించిన స్వేచ్ఛ ప్రస్తుతం టీడీపీ నాయకులకు ఇవ్వడం లేదు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార టీడీపీ వారికి సంబంధించిన పాదయాత్రలకు అనుమతినిచ్చింది. వారు ఎక్కడ సభలు సమావేశాలు పెట్టుకున్న కాదని అనలేదు. కాబట్టి ఇబ్బంది పడలేదు.


కానీ రాజకీయంగా చేసిన విమర్శలను మంత్రులు, ఎమ్మెల్యేలు తిప్పి కొట్టేవారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఎక్కడ సమావేశం ఏర్పాటు చేసిన వైసీపీ నాయకులు నల్ల బెలూన్లతో నిరసన తెలపడం, సమావేశాలను అడ్డగించడం లాంటివి చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. ఎందుకుంటే తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా అడ్డుకుంటే సభలు పెట్టేవారా అని టీడీపీ ప్రశ్నిస్తోంది.


ఇది నిజమే ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు అనేవి ప్రశ్నించే గొంతుకలు ప్రజలకు కావాల్సిన విషయాలను ప్రభుత్వాలను అడిగి మరీ తెలుసుకుంటాయి. రాజకీయాలు వేరు ప్రజాస్వామ్యంలో స్వేచ్చ వేరు. ఇలాంటి స్వేచ్ఛను అనుభవించాల్సిన టీడీపీకి వైసీపీ అడుగుడుగునా అడ్డు తగులుతోంది. దీని వల్ల ఆ పార్టీ పై సానుభూతి పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. సభలు, సమావేశాలు నేరుగా నిర్వహించడానికి అనుమతి ఇస్తేనే కదా వారి అభిప్రాయాలను చెప్పగలరు. లేదు మాట్లాడకూడదు అంటే మరింత వ్యతిరేకత వస్తుందని వైసీపీ నాయకులు తెలుసుకోలేక పోతున్నారా?  


చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా ఆ ప్రాంతంలో వైసీపీ మీటింగ్ కు సంబంధించి ప్లెక్సిలు పెట్టడం, అంతే కాకుండా అక్కడ నిరసనలకు దిగడం, అక్కడక్కడ దాడులు చేస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆ పార్టీ అనుసరిస్తున్నతీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా కర్నూల్ జిల్లాలో లోకేశ్ యువగళం పాదయాత్ర ఉంది. దీనికి సంబంధించి ఏర్పాటు జరుగుతుండగా లోకేశ్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెట్టుకొచ్చారు. మేం అధికారంలో ఉన్నప్పుడు జగన్ కు స్వేచ్ఛనిచ్చాం. కానీ దాన్ని మీరు పొగొట్టుకుంటున్నారని టీడీపీ విమర్శిస్తోంది.



RRR Telugu Movie Review Rating

ఆ స్టార్ హీరోని ఘాడంగా ప్రేమించిన సౌందర్య.. కానీ..!?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>