MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kushia18ee224-8f7d-4c3a-a66b-e603d9317aa3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kushia18ee224-8f7d-4c3a-a66b-e603d9317aa3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత కాంబినేషన్లో లేటెస్ట్ మూవీ 'ఖుషి'.ప్రెజెంట్ ఈ సినిమా పైనే ఓ ముగ్గురు జాతకాలు ముడిపడి ఉన్నాయి. ఆ ముగ్గురు మరెవరో కాదు. ఈ సినిమా హీరో, హీరోయిన్, డైరెక్టర్. ఈ ముగ్గురికి ఖుషి మూవీ హిట్ అవడం చాలా ముఖ్యం. ఖుషి కంటే ముందు విజయ్ దేవరకొండ 'లైగర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. సినిమా కోసం విజయ్ చాలా కష్టపడ్డాడు. కానీ ఫలితం మాత్రం జీరో. లైగKushi{#}Nani;gunasekhar;kushi;Pawan Kalyan;puri jagannadh;Samantha;siva nirvana;Kushi;Majili;Joseph Vijay;World Famous Lover;vijay deverakonda;vegetable market;March;Chitram;India;Love Story;kalyan;Darsakudu;Love;Heroine;Tollywood;Hero;Director;Cinemaఖుషి : ఆ ముగ్గురి జాతకాలను మారుస్తుందా..?ఖుషి : ఆ ముగ్గురి జాతకాలను మారుస్తుందా..?Kushi{#}Nani;gunasekhar;kushi;Pawan Kalyan;puri jagannadh;Samantha;siva nirvana;Kushi;Majili;Joseph Vijay;World Famous Lover;vijay deverakonda;vegetable market;March;Chitram;India;Love Story;kalyan;Darsakudu;Love;Heroine;Tollywood;Hero;Director;CinemaFri, 12 May 2023 17:58:33 GMT టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత కాంబినేషన్లో లేటెస్ట్ మూవీ 'ఖుషి'.ప్రెజెంట్ ఈ సినిమా పైనే ఓ ముగ్గురు జాతకాలు ముడిపడి ఉన్నాయి. ఆ ముగ్గురు మరెవరో కాదు. ఈ సినిమా హీరో, హీరోయిన్, డైరెక్టర్. ఈ ముగ్గురికి ఖుషి మూవీ హిట్ అవడం చాలా ముఖ్యం. ఖుషి కంటే ముందు విజయ్ దేవరకొండ 'లైగర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. సినిమా కోసం విజయ్ చాలా కష్టపడ్డాడు. కానీ ఫలితం మాత్రం జీరో. లైగర్ కంటే ముందు రౌడీ హీరో చేసిన నోట, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. 

వాటికన్నా లైగర్ విజయ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. ఇలా వరుస ప్లాప్స్ తర్వాత వస్తున్న సినిమానే ఖుషి. విజయ్ దేవరకొండ క్రేజ్ తో పాటు అతని మార్కెట్ కూడా నిలవాలంటే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాల్సిందే. ఇక స్టార్ హీరోయిన్ సమంత కూడా ఇప్పుడు సేమ్ సిచువేషన్ లో ఉంది. ఇటీవల ఈ హీరోయిన్ నటించిన
'శాకుంతలం' సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. గుణశేఖర్ పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో సమంత ఆశలన్నీ ఖుషి సినిమా పైనే ఉన్నాయి. ఇక అటు దర్శకుడు శివ నిర్వాణ కూడా మంచి కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు.


కెరీర్ ప్రారంభంలో నిన్ను కోరి, మజిలీ వంటి చక్కటి విషయాలను అందుకున్న ఈ డైరెక్టర్ ఇటీవల న్యాచురల్ స్టార్ నానితో 'టక్ జగదీష్' అనే సినిమా తీసి మొదటి ప్లాప్ అందుకున్నాడు. ఎప్పుడూ లవ్ స్టోరీస్ ని తీసే శివ నిర్వాణ కాస్త రూటు మార్చి నానితో కమర్షియల్ ఫిలిం చేశాడు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. దాంతో మళ్లీ విజయ్, సమంతలతో మంచి లవ్ స్టోరీ తీస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకి పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ మూవీ ఖుషి టైటిల్ పెట్టడం మొదటి పాజిటివ్. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఖుషి ఎవర్ గ్రీన్ మూవీ. అలాంటి ఎవర్ గ్రీన్ టైటిల్ తో మస్తున్న 'ఖుషి' ఈ ముగ్గురి జాతకాలను మారుస్తుందో? లేదో చూడాలి...!!
 



RRR Telugu Movie Review Rating

ఖుషి : ఆ ముగ్గురి జాతకాలను మారుస్తుందా..?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>