MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tiger-nageshwar-raodcb06cc9-8ab6-47f1-951c-5cedc6570224-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tiger-nageshwar-raodcb06cc9-8ab6-47f1-951c-5cedc6570224-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ లో హిట్టు,ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఇటీవల 'రావణాసుర' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. నిజానికి క్రాక్ మూవీతో భారీ కం బ్యాక్ అందుకున్న రవితేజ ఆ తర్వాత ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ వంటి ప్లాప్స్ తో డీలాపడ్డాడు. ఇక ఈ రెండు ఫ్లాప్స్ తర్వాత 'ధమాకా' సినిమాతో 100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. ధమాకా సెన్సేషనల్ హిట్ అయింది. ధమాకా తో మళ్ళీ ఊపు అందుకున్న రవితేజ రావణాసుర సినిమాTiger Nageshwar rao{#}abhishek;vamsi;Dussehra;Akkineni Nageswara Rao;Krack;kushi;Kushi;ravi teja;Ravi;Vijayadashami;Jammu and Kashmir - Srinagar/Jammu;Wife;October;Tollywood;Mass;Cinema;Indiaమాస్ రాజా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'టైగర్ నాగేశ్వరరావు' టీజర్ వచ్చేస్తోంది..?మాస్ రాజా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'టైగర్ నాగేశ్వరరావు' టీజర్ వచ్చేస్తోంది..?Tiger Nageshwar rao{#}abhishek;vamsi;Dussehra;Akkineni Nageswara Rao;Krack;kushi;Kushi;ravi teja;Ravi;Vijayadashami;Jammu and Kashmir - Srinagar/Jammu;Wife;October;Tollywood;Mass;Cinema;IndiaThu, 11 May 2023 16:07:22 GMTప్రస్తుతం టాలీవుడ్ లో హిట్టు,ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఇటీవల 'రావణాసుర' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. నిజానికి క్రాక్ మూవీతో భారీ కం బ్యాక్ అందుకున్న రవితేజ ఆ తర్వాత ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ వంటి ప్లాప్స్ తో డీలాపడ్డాడు. ఇక ఈ రెండు ఫ్లాప్స్ తర్వాత 'ధమాకా' సినిమాతో 100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. ధమాకా సెన్సేషనల్ హిట్ అయింది. ధమాకా తో మళ్ళీ ఊపు అందుకున్న రవితేజ రావణాసుర సినిమాతో నిరాశపరిచాడు. అయితే హిట్స్  వచ్చినా,ప్లాప్స్ వచ్చినా రవితేజ మార్కెట్ ఏమాత్రం డౌన్ అవలేదు. 

అందుకే ఈసారి పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో ఇండియా వైడ్ గా  గురి పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. 'టైగర్ నాగేశ్వరావు' అనే సినిమాతో రవితేజ పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొన్నాయి. టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. కార్తికేయ2, కాశ్మీర్ ఫైల్స్ వంటి భారీ పాన్ ఇండియా హిట్లను అందుకున్న అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 20 న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. టైగర్ నాగేశ్వరావు టీజర్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమా టీజర్ ప్రివ్యూని కొంతమందికి ప్రదర్శించగా సౌత్ తో పాటు నార్త్ సినీ ప్రముఖుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చినట్లు సమాచారం. ఇక సినిమా రషెష్ చూసిన వాళ్లు కూడా అవుట్ ఫుట్ అదిరిపోయింది అని కామెంట్స్ చేస్తున్నారట. దీంతో అతి త్వరలోనే టైగర్ నాగేశ్వరరావు టీజర్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇక ఈ న్యూస్ తో మాస్ మహారాజా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అన్నట్టు ఈ సినిమాతో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తోంది..!!



RRR Telugu Movie Review Rating

అదరగోడుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?

రష్యాపై చైనా, ఇండియా వ్యూహం మారిందా?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>