SportsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl-2023ae16fc59-d927-4680-9caf-1cd053afeeb7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl-2023ae16fc59-d927-4680-9caf-1cd053afeeb7-415x250-IndiaHerald.jpgఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 2023 సీజన్‌ ఇక చివరి దశకు చేరుకుంది. సీజన్ ప్రారంభంలో బాగా ఆడిన టీమ్స్ మలి దశలో వెనుకబడగా మొదట్లో ఆడని టీమ్స్ పుంజుకోవడంతో ప్లే ఆఫ్స్ రేసు చాలా రసవత్తరంగా మారింది.ఇక ఈ నేపథ్యంలో నేడు ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌ ఇంకా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ అనేది జరగనుంది. ఈ సీజన్‌లో రెండు జట్లు చెరో 11 మ్యాచులు ఆడగా మొత్తం ఐదు మ్యాచుల్లో గెలిచాయి.పాయింట్ల పట్టికలో రాజస్థాన్ టీం ఐదో స్థానంలో కేకేఆర్ టీం ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి. ఈ రెండు టీమ్స్ మిగిలిIPL 2023{#}Rajasthan;Yashasvi Jaiswal;varun sandesh;varun tejKKR vs RR: నేడు ఆ టీం ఓడితే ఇక ఇంటికే?KKR vs RR: నేడు ఆ టీం ఓడితే ఇక ఇంటికే?IPL 2023{#}Rajasthan;Yashasvi Jaiswal;varun sandesh;varun tejThu, 11 May 2023 17:23:24 GMTఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 2023 సీజన్‌ ఇక చివరి దశకు చేరుకుంది. సీజన్ ప్రారంభంలో బాగా ఆడిన టీమ్స్ మలి దశలో వెనుకబడగా మొదట్లో ఆడని టీమ్స్ పుంజుకోవడంతో ప్లే ఆఫ్స్ రేసు చాలా రసవత్తరంగా మారింది.ఇక ఈ నేపథ్యంలో నేడు ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌ ఇంకా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ అనేది జరగనుంది. ఈ సీజన్‌లో రెండు జట్లు చెరో 11 మ్యాచులు ఆడగా మొత్తం ఐదు మ్యాచుల్లో గెలిచాయి.పాయింట్ల పట్టికలో రాజస్థాన్ టీం ఐదో స్థానంలో కేకేఆర్ టీం ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి. ఈ రెండు టీమ్స్ మిగిలిన మూడు మ్యాచుల్లో విజయం సాధిస్తే తప్ప ప్లే ఆఫ్స్‌కు చేరే పరిస్థితి అసలు కనిపించడం లేదు. ఈ తరుణంలో నేటి మ్యాచ్ బాగా కీలకంగా మారింది. గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్ వైపు అడుగులు వేయనుండగా ఓడిన టీం దాదాపుగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినట్లే. దీంతో రెండు జట్లు హోరా హోరీగా పోరాడనున్నాయి.అయితే ఈ సీజన్‌లో ఆరంభంలో అద్భుత ప్రదర్శన చేసిన రాజస్థాన్ టీం గత 6 మ్యాచుల్లో ఐదింటిలో ఓడి కష్టాల్లో పడింది. చివరి మూడు మ్యాచుల్లో హ్యాట్రిక్ పరాజయాలు ఆ టీంని పలకరించాయి. ఈ ఓటముల పరంపర నుంచి ఈ జట్టు బయటపడాలని ఎంతగానో భావిస్తోంది.


ఇంపాక్ట్ ప్లేయర్‌ను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం ఇంకా వ్యూహ్యాల్లో లోపాలు ఉన్నాయి. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్‌ ఇంకా హెట్‌మైయర్ ఫామ్‌లో ఉండగా చివరి మ్యాచ్‌లో బట్లర్ జోరు అందుకోవడం ఇక్కడ ఊరటనిచ్చే అంశం.ఇక గత మ్యాచ్‌కు దూరం ఉన్న బౌల్ట్ కోల్‌కతా మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు.ఇక ఓటములతో సీజన్‌ను మొదలు పెట్టిన కోల్‌కతా టీం సెకండాఫ్‌లో వరుస విజయాలను సాధిస్తోంది. గత నాలుగు మ్యాచుల్లో అయితే మూడింటిలో గెలిచింది. వరుస విజయాలు కోల్‌కతా టీం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయనడంలో సందేహం లేదు.జేసన్ రాయ్ రాకతో బ్యాటింగ్ విభాగం బాగా పటిష్టంగా మారింది. నితీశ్ రాణా, వెంకటేశ్ అయ్యర్‌ ఇంకా రింకూ సింగ్‌లు సందర్భానుసారంగా రాణిస్తున్నారు. బౌలింగ్‌లో ఉమేశ్‌, శార్దూల్‌ ఇంకా రసెల్‌లు పేస్ బాధ్యతలు మోస్తుండగా సుయాశ్‌ అలాగే వరుణ్ చక్రవర్తి తమ స్పిన్‌తో ప్రత్యర్థులను ఎంతగానో ముప్పు తిప్పలు పెడుతున్నారు.ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి దాకా రెండు జట్లు 26 మ్యాచుల్లో ముఖాముఖిగా తలపడగా కోల్‌కతా నైట్ రైడర్స్ టీం 14 మ్యాచుల్లో రాజస్థాన్ రాయల్స్ టీం 12 మ్యాచుల్లో విజయం సాధించాయి.కోల్‌కతా పిచ్ అనేది బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్.అందువల్ల అక్కడ భారీ స్కోరు నమోదు అయ్యే అవకాశం ఉంది. మ్యాచ్ సాగే కొద్దీ స్పిన్నర్లు కూడా బాగా రాణించొచ్చు. ఇక టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం కూడా ఉంది.



RRR Telugu Movie Review Rating

అదరగోడుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?

రష్యాపై చైనా, ఇండియా వ్యూహం మారిందా?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>