MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-and-sumanthc25f6aa5-92c8-4aae-b748-77dc9c5e56fd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-and-sumanthc25f6aa5-92c8-4aae-b748-77dc9c5e56fd-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ ఈమధ్య అక్కినేని హీరోలను బాగా వాడేస్తున్నాడు. మొన్నటికి మొన్న 'రావణాసుర' సినిమాలో అక్కినేని హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. కథలో సుశాంత్ పాత్ర చాలా కీలకమైనప్పటికీ.. సినిమా మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. సుధీర్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన రావణాసుర బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది.దాంతో రావణాసుర కోసం సుశాంత్ పడ్డ కష్టం అంతా వృధా అయిపోయింది. అయితే రవితేజ మాత్రం మరోసారి అక్కినేని హీరోకే తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ Raviteja And Sumanth{#}dhanush;sudheer varma;sushanth;sumanth;Karthik;Box office;ravi teja;Ravi;Hero;Cinemaరవితేజ సినిమాలో అక్కినేని హీరో..?రవితేజ సినిమాలో అక్కినేని హీరో..?Raviteja And Sumanth{#}dhanush;sudheer varma;sushanth;sumanth;Karthik;Box office;ravi teja;Ravi;Hero;CinemaThu, 11 May 2023 16:46:39 GMTమాస్ మహారాజా రవితేజ ఈమధ్య అక్కినేని హీరోలను బాగా వాడేస్తున్నాడు. మొన్నటికి మొన్న 'రావణాసుర' సినిమాలో అక్కినేని హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. కథలో సుశాంత్ పాత్ర చాలా కీలకమైనప్పటికీ.. సినిమా మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. సుధీర్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన రావణాసుర బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది.దాంతో రావణాసుర కోసం సుశాంత్ పడ్డ కష్టం అంతా వృధా అయిపోయింది. అయితే రవితేజ మాత్రం మరోసారి అక్కినేని హీరోకే తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఈగల్'. 

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలోనే అక్కినేని హీరో సుమంత్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఒకప్పుడు హీరోగా సినిమాలు చేసిన సుశాంత్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. అలా 'సీతారామం' సినిమాలో సుమంత్ ఓ మంచి పాత్రను పోషించాడు. నిజానికి ఈ సినిమాతోనే సుమంత్ కి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి బ్రేక్ వచ్చింది. దాని తర్వాత సుమంత్ కి చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ అతను మాత్రం ఆచితూచి క్యారెక్టర్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. సీతారామం తర్వాత ఇటీవల ధనుష్ హీరోగా నటించిన 'సార్' సినిమాలో నటించాడు సుమంత్.

సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక సార్ తర్వాత మళ్లీ ఇప్పుడు రవితేజ ఈగల్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. సీతారామం సినిమాలో సుమంత్ పాత్రలో పాజిటివ్, నెగిటివ్ రెండు కోణాలు ఉంటాయి. ఇప్పుడు రవితేజ ఈగిల్ లోనూ రెండు షేడ్స్ ఉండే పాత్రలో సుమంత్ నటిస్తున్నాడట. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కావ్య తాపర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా నుంచి రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు...!!



RRR Telugu Movie Review Rating

అదరగోడుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?

రష్యాపై చైనా, ఇండియా వ్యూహం మారిందా?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>