Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohith8c538668-9513-483b-a0dd-36983fd07b61-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohith8c538668-9513-483b-a0dd-36983fd07b61-415x250-IndiaHerald.jpgగత కొంతకాలం నుంచి రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు అనే విషయం తెలిసిందే. అయితే రోహిత్ అద్భుతంగా రానించి ఈసారైనా అటు ముంబై ఇండియన్స్ ని ఐపీఎల్ టైటిల్ విన్నర్గా నిలుపుతాడని అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. అయితే జట్టులోకి కొత్తగా సార్ ప్లేయర్లు వచ్చి చేరడంతో అటు ముంబై ఇండియన్స్ కూడా పటిష్టంగా మారిపోయింది అని చెప్పాలి. కానీ ఈ ఏడాది ముంబై ఇండియన్స్ ప్రస్థానం పెద్దగా చెప్పుకోదగ్గ విధంగా లేదు అని చెప్పాలి. ఐపీఎల్ ప్రారంభం సమయంలో వరుసగా మ్యాచ్ లలో ఓడిపోయిన ముంబై ఇండియన్స్.. ఆ తరRohith{#}Prasthanam;Rohit Sharma;Mumbaiపాపం.. రోహిత్ కెరియర్లో ఇదే మొదటిసారి?పాపం.. రోహిత్ కెరియర్లో ఇదే మొదటిసారి?Rohith{#}Prasthanam;Rohit Sharma;MumbaiWed, 10 May 2023 17:00:00 GMTగత కొంతకాలం నుంచి రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు అనే విషయం తెలిసిందే. అయితే రోహిత్ అద్భుతంగా రానించి ఈసారైనా అటు ముంబై ఇండియన్స్ ని ఐపీఎల్ టైటిల్ విన్నర్గా నిలుపుతాడని అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. అయితే జట్టులోకి కొత్తగా సార్ ప్లేయర్లు వచ్చి చేరడంతో అటు ముంబై ఇండియన్స్ కూడా పటిష్టంగా మారిపోయింది అని చెప్పాలి. కానీ ఈ ఏడాది ముంబై ఇండియన్స్ ప్రస్థానం పెద్దగా చెప్పుకోదగ్గ విధంగా లేదు అని చెప్పాలి.



 ఐపీఎల్ ప్రారంభం సమయంలో వరుసగా మ్యాచ్ లలో ఓడిపోయిన ముంబై ఇండియన్స్.. ఆ తర్వాత పుంజుకుని హ్యాట్రిక్ విజయాలను సాధించింది. కానీ ఆ తర్వాత ఏ మ్యాచ్ లో గెలుస్తుంది ఏ మ్యాచ్ లో ఓడిపోతుంది అన్నది మాత్రం ముందుగా ఊహించలేని విధంగా మారిపోయింది. దీంతో పడుతూ లేస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అయితే ఇక ఇటీవల బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో మాత్రం మంచి ప్రదర్శన చేయడంతో చివరికి పాయింట్ల పట్టికలో మూడో స్థానాన్ని సొంతం చేసుకోగలిగింది ముంబై ఇండియన్స్. అయితే ఇలా జట్టు పడుతూ లేస్తూ ప్రయాణం సాగిస్తున్న అటు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యం మాత్రం కొనసాగుతూనే ఉంది.


 మునుపెన్నడూ లేని విధంగా ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఐపీఎల్ సీజన్లో ఘోరంగా విఫలం అవుతున్నాడు. ఇప్పటివరకు 11 మ్యాచ్ లలో కలిపి కేవలం 191 పరుగులు మాత్రమే చేశాడు. అయితే గత 5 ఇన్నింగ్స్ లలో సింగిల్ డిజిట్స్ స్కోర్కె పరిమితం అయ్యాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే ఒక చెత్త రికార్డును మూటకట్టుకున్నాడు అని చెప్పాలి. వరుసగా 5 ఇన్నింగ్స్ లలో 10 కంటే తక్కువ పరుగులు చేయడం అటు రోహిత్ శర్మ కెరియర్లో మొదటిసారి అని చెప్పాలి. అయితే రానున్న మ్యాచ్ లలో అయినా రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చి మంచి ఇన్నింగ్స్ లు ఆడాలని అటు అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆ ప్రముఖ సంస్థ చేతుల్లోకి "మేము ఫేమస్" సినిమా..!

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?

అమెరికాను వణికిస్తున్న రోబో టెక్నాలజీ?

ప్రాణభయంతో దాక్కున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు?

బిగ్‌ క్వశ్చన్‌: రాహుల్‌ గాంధీకి జైలు తప్పదా?

కర్నాటక పోలింగ్‌: బరిలో కరడుగట్టిన నేరస్తులు?

మణిపూర్‌ గొడవలకు అసలు కారణమేంటో తెలుసా?

పోలవరంపై ఏపీ, తెలంగాణ కీచులాటలు తగ్గలేదుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>