Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vv-vinayal2a889e6f-1b1c-4c2f-8c55-9d0e1c48c429-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vv-vinayal2a889e6f-1b1c-4c2f-8c55-9d0e1c48c429-415x250-IndiaHerald.jpgదర్శకదీరుడు రాజమౌళి టేకింగ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన ఛత్రపతి సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్ ని మాస్ ప్రేక్షకులకు దగ్గర చేసింది కూడా ఈ సినిమానే. ఇక ఇప్పుడు ఈ సినిమా టీవీలలో వచ్చినా కూడా చూసేందుకు అభిమానులు తెగ ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే సాధారణంగా రాజమౌళి తీసిన ఏ సినిమాని కూడా వేరే డైరెక్టర్ ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి పెద్దగా సాహసం చేయరు. కానీ మొదటిసారి అలాంటి ప్రయత్నం చేశాడు వివి వినాయక్. ఒకప్పుడు టాVv vinayal{#}bellamkonda suresh;krishnam raju;Rajamouli;v v vinayak;Tollywood;Blockbuster hit;Remake;Director;Press;Chatrapathi;Mass;Prabhas;Hero;Cinemaచత్రపతి రీమేక్ అనగానే.. ఎంతో భయం వేసింది : వివి వినాయక్చత్రపతి రీమేక్ అనగానే.. ఎంతో భయం వేసింది : వివి వినాయక్Vv vinayal{#}bellamkonda suresh;krishnam raju;Rajamouli;v v vinayak;Tollywood;Blockbuster hit;Remake;Director;Press;Chatrapathi;Mass;Prabhas;Hero;CinemaWed, 10 May 2023 08:45:00 GMTదర్శకదీరుడు రాజమౌళి టేకింగ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన ఛత్రపతి సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్ ని మాస్ ప్రేక్షకులకు దగ్గర చేసింది కూడా ఈ సినిమానే. ఇక ఇప్పుడు ఈ సినిమా టీవీలలో వచ్చినా కూడా చూసేందుకు అభిమానులు తెగ ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే సాధారణంగా రాజమౌళి తీసిన ఏ సినిమాని కూడా వేరే డైరెక్టర్ ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి పెద్దగా సాహసం చేయరు. కానీ మొదటిసారి అలాంటి ప్రయత్నం చేశాడు వివి వినాయక్.



 ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్గా కొనసాగిన వివి వినాయక్ ఇప్పుడు తెలుగులో పూర్తిగా సినిమాలను తగ్గించాడు. అయితే ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చత్రపతి సినిమాను ఇక హిందీలో రీమేక్ చేయగా ఈ సినిమా మే 12వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ పాత్రలో టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీను నటించాడు. అయితే ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్ర బృందం  బిజీ బిజీగా ఉంది అని చెప్పాలి. ఇటీవలే ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ లో వివి వినాయక్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 చత్రపతి సినిమాను రీమేక్ చేయడానికి ముందు తనలో భయం కలిగింది అంటూ వివి వినాయక్ చెప్పుకొచ్చాడు. స్టార్ డైరెక్టర్ స్టార్ హీరో కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ కావడంతో రీమేక్ అనేసరికి కచ్చితంగా కంపారిజన్ ఉంటుంది. అయితే బెల్లంకొండ సురేష్ మాత్రం పట్టు పట్టిమరి నువ్వు చేయగలవు అని నాతో ఒప్పించి ఈ సినిమా చేయించారు. రీమేక్  విషయంలో పెద్దగా మార్పులు అయితే చేయలేదు. అయితే అసలు సినిమాలో ఉన్న ఫీల్ ఎమోషన్ చెడగొట్టకుండా కొత్త సినిమాను దొరకకించడమే అసలైన పని. ఆ పనిని నేను కరెక్ట్ గా చేశానని అనుకుంటున్నా. అలాగే కొన్ని ఐకానిక్ షాట్స్ లో అయితే అస్సలు మార్పులు చేయలేదు. ఎందుకంటే అవి అలా ఉంటేనే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. కానీ నా స్టైల్లో కొన్ని చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం ఇందులో పెట్టాను అంటూ వివి వినాయక్ చెప్పుకొచ్చారు.



RRR Telugu Movie Review Rating

25 లక్షలకు.. ఫిలింఫేర్ అవార్డు అమ్మేసిన విజయ్ దేవరకొండ?

పాక్‌ ఉగ్ర కుట్ర బయటపెట్టేలా భారత్‌ వ్యూహం?

అమెరికాకు షాక్‌.. రష్యాతో దోస్తీ చేస్తున్న నాటో దేశం?

భారత్‌ పవర్‌ ఏంటో చెప్పిన పాక్‌ మాజీ అధ్యక్షుడు?

క్రైస్తవులు ఆ కోరిక.. జగన్ తీరుస్తారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>