ViralDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/bangalakathamf69e5637-fdfc-4f70-b896-49b779f55a58-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/bangalakathamf69e5637-fdfc-4f70-b896-49b779f55a58-415x250-IndiaHerald.jpgగడిచిన కొద్ది రోజుల నుంచి వర్షాలు అధికంగా పడుతూ ఉండడం తో ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా రైతులతో పాటు సామాన్య ప్రజలు , కూలీలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వాతావరణం కూడా చాలా ఉక్కపోతతో ప్రజలను అతలాకుతలం చేస్తోంది. దీంతో కొంతమంది రైతులు చేతికి అందిన పంట తడిసిపోతోంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజున తాజాగా వాతావరణ శాఖ తెలియజేస్తూ..బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఈరోజు నుంచి వాయుగుండంగా మారబోతున్నట్లు వాతావరణ శాఖ అండమాన్ దీవుల ప్రజలను అపBANGALAKATHAM{#}Andaman;Bangladesh;chirala;Varsham;wednesday;Teluguబంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం..!!బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం..!!BANGALAKATHAM{#}Andaman;Bangladesh;chirala;Varsham;wednesday;TeluguWed, 10 May 2023 16:00:51 GMTగడిచిన కొద్ది రోజుల నుంచి వర్షాలు అధికంగా పడుతూ ఉండడం తో ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా రైతులతో పాటు సామాన్య ప్రజలు , కూలీలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వాతావరణం కూడా చాలా ఉక్కపోతతో ప్రజలను అతలాకుతలం చేస్తోంది. దీంతో కొంతమంది రైతులు చేతికి అందిన పంట తడిసిపోతోంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజున తాజాగా వాతావరణ శాఖ తెలియజేస్తూ..బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఈరోజు నుంచి వాయుగుండంగా మారబోతున్నట్లు వాతావరణ శాఖ అండమాన్ దీవుల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా మృత్యుకారులు ఓడలు, పడవలు ,ట్రావెల్ నిర్వాహకులు ఆగ్నేయ మూలకి వెళ్ళకూడదు అని సూచిస్తున్నారు.


మే 12వ తేదీ ఉదయం వరకు ఈ అల్పపీడనం ఉంటుందని మొదట ఉత్తర వాయువ్యదిశ గా బంగ్లాదేశ్ మయన్మార్ చీరాల వైపు వెళుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ అల్పపీడనం బుధవారం తుఫానుగా మారబోతోందని వాతావరణ శాఖ తెలియజేయడం జరుగుతోంది. ఆగ్నేయం వైపుగా బంగాళాఖాతంలో 45 నుంచి 55 కిలోమీటర్ల వేగం తో గాలులు వీస్తాయని తెలియజేస్తున్నారు. ఈ అల్పపీడనం వల్ల రానున్న 12 గంటలలో మోచా తుఫాన్ గా మారుతుందని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు విస్తాయని తెలియజేస్తున్నారు.


అయితే అండమాన్ నికోబార్ దీవులు నిన్నటి రోజు నుంచి చాలా చోట్ల మోస్తారు వర్షాలు కూడా కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలియజేయడం జరుగుతోంది.. దీంతో పాటుగా  తెలుగు రాష్ట్రాలలో ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా మృత్యుకారులు వేటకు ఈ సమయంలో వెళ్లకూడదని కూడా తెలియజేస్తున్నారు. రానున్న రోజుల్లో అధిక వర్షం కారణంగా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆ ప్రముఖ సంస్థ చేతుల్లోకి "మేము ఫేమస్" సినిమా..!

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?

అమెరికాను వణికిస్తున్న రోబో టెక్నాలజీ?

ప్రాణభయంతో దాక్కున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు?

బిగ్‌ క్వశ్చన్‌: రాహుల్‌ గాంధీకి జైలు తప్పదా?

కర్నాటక పోలింగ్‌: బరిలో కరడుగట్టిన నేరస్తులు?

మణిపూర్‌ గొడవలకు అసలు కారణమేంటో తెలుసా?

పోలవరంపై ఏపీ, తెలంగాణ కీచులాటలు తగ్గలేదుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>