MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagachaitanya5473349d-6f6f-48ff-b47d-59a3f8ea9c46-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagachaitanya5473349d-6f6f-48ff-b47d-59a3f8ea9c46-415x250-IndiaHerald.jpgఈవారం విడుదలకాబోతున్న ‘కష్టడీ’ మూవీ నాగచైతన్య కెరియర్ కు అత్యంత కీలకంగా మారడంతో ఆమూవీని ఏదోవిధంగా హిట్ చేయాలని చైతన్య ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. దీనికోసం వరసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నాడు. ఆ ఇంటర్వ్యూలలో చైతన్య వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నలు ఎదురవుతూ ఉండటంతో చైతూ ఆ ప్రశ్నలకు కూడ సమాధానాలు చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా సమంత తో తన వైవాహిక జీవితం ముగిసిపోవడంతో ఆవిషయానికి సంబంధించిన ప్రశ్నలను చైతూ తప్పించుకోలేక పోతున్నాడు. ఈమధ్య ఒక మీడియా సంస్థNAGACHAITANYA{#}prema;Samantha;media;marriage;Love;Chaitanya;Industry;Naga Chaitanya;Cinemaహాట్ టాపిక్ గా మారిన చైతన్య భావోద్వేగం !హాట్ టాపిక్ గా మారిన చైతన్య భావోద్వేగం !NAGACHAITANYA{#}prema;Samantha;media;marriage;Love;Chaitanya;Industry;Naga Chaitanya;CinemaWed, 10 May 2023 10:00:00 GMTఈవారం విడుదలకాబోతున్న ‘కష్టడీ’ మూవీ నాగచైతన్య కెరియర్ కు అత్యంత కీలకంగా మారడంతో ఆమూవీని ఏదోవిధంగా హిట్ చేయాలని చైతన్య ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. దీనికోసం వరసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నాడు. ఆ ఇంటర్వ్యూలలో చైతన్య వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నలు ఎదురవుతూ ఉండటంతో చైతూ ఆ ప్రశ్నలకు కూడ సమాధానాలు చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.



ముఖ్యంగా సమంత తో తన వైవాహిక జీవితం ముగిసిపోవడంతో ఆవిషయానికి సంబంధించిన ప్రశ్నలను చైతూ తప్పించుకోలేక పోతున్నాడు. ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతన్య మొట్టమొదటిసారి సమంతతో విడిపోయిన విషయం పై స్పందించాడు. "నా వ్యక్తిగత జీవితంలో నా పెళ్లి ఫెయిల్ అవ్వడం దురదృష్టకరం. సమంతతో ప్రేమ పెళ్లి కలిసున్న జీవితం నా లైఫ్ లో జరిగిన ప్రతి విషయంలోనూ ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మా ఇద్దరి బాధ్యత ఉంది’ అంటూ అప్పట్లో సమంత తో తనకు ఉన్న వైవాహిక జీవితం గురించి స్పందించాడు.



సమంత పై పూర్తి గౌరవం ఉంది. అంతేకాదు చైతన్య తన విడాకుల వ్యవహారానికి సంబంధించిన వార్తలను తన పై వ్రాయవద్దని నాగచైతన్య మీడియా వారిని కోరుతున్నాడు. "విడాకులు నాకు, సమంతకు సంబంధించిన ఆ అంశం ఇంకా సాగదీయవద్దు.’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు చైతూ అన్న మాటల వెనుక అర్థం ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో హాట్ హాట్ చర్చలలో జరుగుతున్నాయి.  




అంతేకాదు నా వ్యక్తిగత జీవితాన్ని తన వ్యక్తిగత జీవితాన్ని తన చుట్టూ ఉన్న వ్యక్తులకు ఆపాదించకండి అంటూ చైతూ భావోద్వేగంతో చేసిన కామెంట్స్ హత న్యూస్ గా మారింది.  అంతేకాదు చైతూ తన పై వస్తున్న పుకార్లను పట్టించుకోవడం లేదు అంటూ తనకు నచ్చని విషయాన్ని తన మైండ్ లోంచి కట్ చేసేస్తానని అంటూ చైతూ అన్న మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి..  






RRR Telugu Movie Review Rating

భారీ నష్టాలను ఎదుర్కొన్న ఆ 5 మీడియం రేంజ్ సినిమాలు ఇవే..!

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?

అమెరికాను వణికిస్తున్న రోబో టెక్నాలజీ?

ప్రాణభయంతో దాక్కున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు?

బిగ్‌ క్వశ్చన్‌: రాహుల్‌ గాంధీకి జైలు తప్పదా?

కర్నాటక పోలింగ్‌: బరిలో కరడుగట్టిన నేరస్తులు?

మణిపూర్‌ గొడవలకు అసలు కారణమేంటో తెలుసా?

పోలవరంపై ఏపీ, తెలంగాణ కీచులాటలు తగ్గలేదుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>